ఉడతలు పట్టె వారు ఉపాద్యాయులు అయితే, " విద్యార్దిని చెర -అబార్షన్ సదా " అనేదే గురూపదేశం !


                                                                   


                      మానవ జన్మ ఎత్తాకా , గురువు స్తానం పొందాకా కొంచమైనా ఆ స్తానానికి గౌరవం కలిగించే పనులు చేయాలి . అది మరచి పోయి , తమకున్న వయసు స్తాయిని  ని కూడా   పట్టించుకోకుండా  తమ దగ్గరకు వచ్చిన కూతురి  వయసున్న విద్యార్దినిని  చెరచడమే కాకుండా , మూడు సార్లు అబార్షన్ చేయించి ఆమె మృతికి కారకులయ్యే వారిని ఏమని సంభోదించాలి ? వీది రౌడీల కంటే హీనంగా ప్రవర్తించిన ఈ "ఉపాద్యాయుల ఉదంతం" కనండి .
                             చిత్రంలో కనిపించే వారిని చూడండి . వారి ఇద్దరి పేర్లు ప్రసాద్ లే ! ఇరువురూ ఉపాద్యాయ వృత్తిలో ఉన్నవారే ! ఇరువురూ తండ్రి వయసు ఉన్న వారే ! మరి అటువంటి వారు చేయదగిన పనేనా ఇది? క్రిష్ణా జిల్లా , చల్లపల్లి లోని వక్కలగడ్డ హైస్కూల్లో పని చేసిన రిటైర్డ్ హెడ్మాస్టర్ ఒక మైనర్ విద్యార్దిని ని చెరబట్టి తన కామవాంచలకు బలిచేస్తుంటె , అది చూసిన మరో ఉపాద్యాయుడు , ఆ బాలికను రక్షించడానికి బదులు , బ్లాక్మెయిల్ చేసి తనూ పశువులా ఆ అమ్మాయి పై అత్యాచారం చేసే వాడట. దాని వలన ఆ మైనర్ విద్యార్దినికి గర్భం వస్తే ఒక సారి కాదు , ఏకంగా 3 సార్లు అబార్షన్ చేయించారట. దానితో పాపం ఆ చిన్నారి తల్లి  ఆరోగ్యం క్షీణించి చివరకు 15 రోజుల క్రితం చని పోయింది .
                  ఇక్కడ బాదితురాలు మైనర్ కాబట్టి, గురువుల నీచ కార్యానికి ఈ  ఆమె " అంగీకారం" ఉందా లేదా అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. వారి ద్రుష్టిలో "ఉంచుకోవడం " అనుకున్నా , చట్టం ద్రుష్టిలో వారు చేసింది  "రిపీటేద్ రేప్" అయితే , సమాజం ద్రుష్టిలో " మహా పాపం" . కాబట్టి వారికి  జీవించే హక్కు నైతికంగా లేదు. ఆ అమ్మాయి విద్యార్దిని కాకపోతే చట్టం ప్రకారం విదించే శిక్ష అనుభవిస్తే సరి పోవచ్చు. కాని కూతురు -తండ్రి అనుబందం లాంటి గురు శిష్యుల సంబందానికి మాయని మచ్చ తెచ్చిన గురువులు ఏ మాత్రం   సమాజంలో ఉండడానికి అర్హులు కారు. ఇటువంటి వారి కోసం "నిర్భయ "  చట్ట సవరణ చేసి " ఉరి శిక్ష " ను ఖరారు చేయడమే ఉత్తమం . లేకుంటే ఇటువంటి " "సమాజ ఆమోదం " లేని నీచ సంబందాలు మన సమాజంలో మరిన్ని ఎక్కువ అయ్యే ప్రమాదముంది .

         ఉడతలు పట్టె వారు ఉపాద్యాయులు అయితే, " విద్యార్దిని చెర -అబార్షన్ సదా " అనేదే  వారు చెప్పే పాఠం !

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన