ఆలూ మగలు ఎలా ఉన్నా , పడక గది లో "అది" లేక పొతే , 'అంతా హ్యాపీస్ ' యే నంటా !

                                                                         

పండంటి కాపురానికి పది సూత్రాలు అని సినిమా ఒకటి ఉన్నట్లుంది . అందులో రచయిత ఏమి చెప్పాడో కాని , కాపురం పది కాలాలు పాటు స్వీట్ గా , హాట్ గా ఉండాలంటే , చైనా సాంప్రాదాయక పద్దతి అయిన "పెంగ్ షుయి అష్ట  సూత్రాలు" పాటిస్తే  ఏ కష్టాలు లేకుండా కోన సాగుతుంది అట. అవేమిటో తెలుసుకుందాం.

   పెంగ్ షుయి 8 సూత్రాలు ముక్యంగా దంపతుల పడక గదిని ఉద్దేశించి చెప్పినవే! దంపతుల మద్య ప్రేమతో తో పాటు కూసింత ఆకర్షణ , వ్యామోహం లు ఉంటే ఆ కిక్కే వేరు కదా! ఆ కిక్కు లు ఇంట్లో లేకనే కదా చాలా మంది మగాళ్ళు వీదుల్లో పడేది . అలా అంటె స్త్రీల సంగతి ఏమిటి అని మాత్రం అడక్కండి . ప్రతి దాంట్లో సమానత్వం అనేది ఒప్పుడు పనులకే తప్పా , తప్పుడు పనులకు వర్తించదు . అంతే !

ఇక పడక గదికి వర్తింపచేసే  పెంగ్ షుయిఅష్ట సూత్రాలు(చిట్కాలు ) ఇవి!    

1).  "చిందర వందర ఇల్లు , చింతలకు పుట్టిల్లు "
                 మన పెద్దలు ఎకానమీ ని ద్రుష్టిలో పెట్టుకుని కాబోలు  "ఇల్లు  ఇరకటం , అలీ మర్కటం లాగా ఉండాలి" అన్నారు . అప్కోర్స్ చాలీ చాలని సంపాదనతో , కోరుకున్న జీవితం పొందలేని వారికి ఇది పనికి వచ్చె సూత్రం కావచ్చు. కాని పెంగ్షుయి పద్దతిలో ఇల్లు, ఇల్లాలు  ఎలా ఉన్నా , పడక గది మాత్రం ఉన్నంతలో  నీట్ గా , అస్సలు ఏ మాత్రం చిందర వందర గా కాకుండా ఉండాలట. చిందర వందర గది రొమాంటిక్ మూడ్ ని చిన్న బుచ్చి , వలపు వ్యవసాయానికి ఆటంకంగా మారుతుంది అని వారి థీరీ కాబోలు! అందుకే ఇదే దియరీ ఇంటికి కూడా వర్తిస్తుందని చెప్పారు . "చిందర వందర ఇల్లు , చింతలకు పుట్టిల్లు " అని చెప్పుకోవచ్చు.

2). పడక మంచం ఎలా ఉండాలి ?
 పడక గదే కాదు , పడక మంచం ఎలా ఉండాలో కూడా చెప్పబడింది . కాకపొతే ఇది 90% ప్రజలకు సాద్యం కాక పోవచ్చు. కనీసం కలిగిన వారికైనా పనికి వస్తుందేమో!
అ)    బెడ్  గదికి తగినదిగా ఉండాలి  . గదిలో ఏ మూలనో కాకుండా , అన్ని వైపులా ఖాళీ జాగా ఉండెటట్లు అమర్చుకోవాలి. ఇలా చేస్తే దంపతుల లో తగిన పాజీటవ్ శక్తి వస్తుందట !
ఆ ).    పడక మంచం , బీమ్ ల క్రిందో , సీలింగ్ ప్యాన్ ల క్రిందో ఉండకూడదట . అలా ఉంటె ఆ ఫ్యాన్ రెక్కల తిరుగుడు , "పాజిటివ్ శక్తి " కి ఆటంకాలు కలిగిస్తాయి అంట.

ఇ )  దంపతులు కాళ్ళు డోర్ ల వైపు పెట్టి నిద్ర పోరాదు.
ఈ ).  బెడ్ కి ఇరువైపులా ఎటువంటి అద్దాలు అమర్చ రాదు.

ఉ ).బెడ్ క్రింద ఏమి ఉంచ రాదు.
ఊ ) బెడ్  సైజ్ కూడ ఇంపార్తేనంట ! కింగ్ సైజ్ మంచం గదిలో ఉంటె అ వైబోగమె వేరు అంట!

3).బెడ్ రూం తలపు లు ఎప్పుడూ మూసి ఉండాలి అంట. ముక్యంగా భార్యా భర్తలు గదిలో ఉన్నప్పుడు .

4). వాటర్ పౌంటైన్ లు , అక్వేరియం లు అస్సలు ఉండకోడదట . అవి ప్రేమ అరిష్ట గుర్తులు అంట.

5). ఇందులో ముక్యమైనది ఇదే! బెడ్ రూం లో T.V అనేది అస్సలు ఉండకోడదంట !. దీని ఎత్తి అవతల పడెయ్యడమే ఉత్తమం అంట . ఇది రొమాంటిక్ మూడ్ ని మరల్చే దుష్ట శక్తి కాబట్టి , దంపతుల మద్య దూర శ్రవణ యంత్రం  ఎట్టి పరిస్తితుల్లో ఉండ రాదు కాక ఉండ రాదు.

6). పడకగదిని తగిన అలంకారపు మొక్కలతో అలరారేలా చెయ్యాలి .

 7). మీరు ఏది కొనాలన్నా , జంట వస్తువులు కనాలి తప్పా , సింగిల్ ఐటం పద్దతి సరి కాదంట .

 8). పడక గదికి  రొమాంటిక్ కలర్ వేయాలి . సాదారణంగా ఎరుపు, గులాబి లు రొమాంటిక్ మూడ్ ని పెంచే విగా చెపుతారు .

అదండి పెంగ్షుయి వారి అష్ట సూత్రాలు . ఇవి గనుక పాటిస్తే దంపతుల శ్రమ పలించి "వలపు పంట " పండుతుంది . అబ్బే ఇవేమి మన బడ్జెట్ కు సరిపోయే మాటలు కావు అనుకునే వారు , ఉన్నంతలో అయినా అష్ట సూత్రాలు పాటిస్తే , వారి కష్టానికి తగినట్లు సగం పంట పండినా నయమే కదా! ఏమంటారు?

 తాము వయసులో ఉండగా అలా వలపు పంట పందించుకున్నబామ్మ లు కొంత మంది ఆ తలపులతో , సంతోషంగా ఎలా డాన్స్ వేస్తున్నారో, క్రింది విడియోలో  చూడండి(ఇది నిన్న చూసాను . బాగుందని అటాచ్ చేసా అంతే!)


source :-   http://www.astrospeak.com/article/8-feng-shui-tips-for-a-happy-married-life

           
                        

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన