అటు ఆంద్రా ప్రభుత్వానికి గిట్టని ,ఇటు తెలంగాణా ప్రభుత్వానికి పట్టని ,తెలంగాణా విద్యార్దులు!
రాష్ట్ర విభజన జరిగి ,తెలంగాణా ప్రభుత్వం ఏర్పడినాక,ఆర్టికల్ 371 D ప్రకారం కాకుండా ,1956 కు ముందు తెలంగాణాలో నివసించిన కుటుంభాల వారి పిల్లలకు మాత్రమె బోధనా రుసుములు ,స్కాలర్ షిప్ లు ఇవ్వడం జరుగుతుందని K.C.R గారు చెప్పినప్పుడు , అది అన్యాయం ,తెలంగాణాలో చదివే వారందరికి బోధనా రుసుములు ఇవ్వవలసిందే అని , కొంత మంది ఆంద్రా రాజకీయ నాయకులు హై కోర్టులో పెటిషన్ లు వేశారు .ఆ సందర్భంగా హై కోర్టు వారు కోన్ని కీలక వ్యాఖ్యలు చేసారు . "మనది భారత దేశం, భారత దేశం లో నివసిస్తున్న మనం అందరం భారతీయ పౌరులం .ప్రతి భారతీయ పౌరుడికి తనకు ఇష్టం వచ్చిన చోట నివసించే ,విద్య నబ్యసించే హక్కు ఉంది. కేవలం ప్రాంతీయ ప్రాతిపదికగా బోధనా రుసుములు , స్కాలర్ షిప్ లు ఇస్తాము అనడం,రాజ్యాంగ వ్యతిరేకం కాదా ? " అని ప్రశ్నించడం జరిగింది . తాము ఉదారంగా భారతీయ స్పూర్తితో వ్యవహరిస్తాం, అని అంద్రా సర్కార్ అప్పుడు చెప్పింది .కాని వాస్తవంగా జరిగింది ఏమిటంటే తన ప్రాంతంలో చదువుతున్నతోటి తెలుగు విద్యార్దులు ,తెలంగాణా కు చెందిన విద్యార్దులను ,బోధనా రుసుములకు అర్హులు కారంటూ మొండి చేయి చూపింది . ఆంద్రా ఈ పాస్ వెబ్సైట్ లో ,ఆంద్ర ప్రదేశ్ లో చదువుతున్న తెలంగాణా విద్యార్దులు పెట్టిన అప్లికేషన్ లను నిర్ ద్వందంగా తిరస్కరించి భారతీయ స్పూర్తిని దెబ్బ తీసింది .
ఇక పోతె తెలంగాణా లో పని చేసే ఘనమైన అధికారులు గురించి చెప్పాలంటే చాలా ఉంది . మొన్న తెలంగాణా సర్కార్ స్పష్టంగా "ఆర్టికిల్ 371 D ప్రకారం తెలంగాణాలో పదవ తరగతికి లేదా ఇంటర్ కు ముందు 4 యేండ్లు వరుసగా చదివిన విద్యార్దులు కు బోదానా రుసుములు ఇస్తాము" అంది . దాని ప్రకారం తెలంగాణా , ఆంద్రా లో చదువుతున్న తెలంగాణా విద్యార్దులు ఫీజ్ రియంబర్స్మెంట్ ,స్కాలర్ షిప్ లకు అర్హులు .కాని ఘనత వహించిన తెలంగాణా అధికారులేమో తెలంగాణా ఈ పాస్ వెబ్సైట్ లో కేవలం తెలంగాణాలో చదివే తెలంగాణా విద్యార్దులు మాత్రమె అప్ప్లై చేసుకునే అవకాశం కల్పించారు . అదేమిటంటే, తెలంగాణా ప్రభుత్వ పాలసి అది కుంటి సాకులు చెపుతున్నారు .ఒక సారి ఆర్టికిల్ 371 D ప్రకారం అర్హత ఉంటుంది అంటె ,ఆంద్ర ప్రదేశ్ ,తెలంగాణా లో చదువుతున్న తెలంగాణా విద్యార్దులు అందరూ బోధనా రుసుములు కు అర్హులు అనే కదా అర్దమ్. మరి తెలంగాణా ప్రభుత్వ పాలసిలో ఇంత స్పష్టత ఉన్నప్పటికీ ,దానిని ఉల్లంఘించి కేవలం తెలంగాణాలో చదివే విద్యార్దులకే స్కాలర్ షిప్ లకు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించటం ఎంత వరకు సబబు? సంబందిత తెలంగాణా అధికారులు దీనికి సమాదానం చెప్పాల్సి ఉంటుంది .ఇది కేవలం తెలంగాణా సర్కార్ ను బదనాం చెయ్యడానికే కొంత మంది అధికారులు కంఖణం కట్టుకున్నట్లు కని పిస్తుంది .
ఈ విషయం మీద ఎవరైనా హై కోర్టు తలుపులు తడితే ఇటు తెలంగాణా ,ఆంద్రా గవర్నమెంట్ లతో పాటు అటు కేంద్ర సర్కార్ కు అక్షింతలు తప్పవు . ఆంద్రా ,తెలంగాణా అని కాకుండా తమ తమ రాష్ట్రాల్లో చదువుతున్న భారతీయ విద్యార్దులు అందరికి ,అర్హతను అనుసరించి బోధనా రుసుములు ,స్కాలర్షిప్ లు చెల్లించడం రాష్ట్రాల రాజ్యాంగ ధర్మం . అలా చెల్లించమని ఈ పోస్ట్ ద్వారా ఉభయ ప్రభుత్వాలను కోరడమైనది .ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ శక్తి లేకుంటే ఆ బాద్యతను కేంద్ర సర్కార్ తీసుకుని , భారతీయ స్పూర్తిని కాపాడవలసినదిగా కోరడమైనది . రాష్త్రాలు అనేవి పాలనా సౌలభ్యం కోసం తప్పా ,భారతీయ పౌరుల మద్య వివక్ష చూపడానికి కాదు అని పాలకులకు తెలియక పోవడం విచారకరం.
Comments
Post a Comment