మా నియోజక వర్గం లో "తీన్ మార్ మల్లన్న " కన్నా , "తిక్కల చెల్లవన్న" కే ఓట్లు ఎక్కువ వచ్చాయి !!!?
మామూలు ఓట్ల కు ,పట్టభద్రుల ఓట్లకు చిన్న తేడా ఉంది. మామూలు ఓట్లను మనకు నచ్చిన గుర్తు మీద ఒక ముద్ర వేస్తే సరి పోతుంది .కాని పట్టభద్రులు వేసే ఓట్లు తమకు నచ్చిన వారికి ,ప్రాదాన్యత క్రమంలో ఓట్లు వేయాలి . పట్టభద్రులు అంటే సామాన్య నిరక్షరాస్యులు కాదు కాబట్టి ,ప్రాదాన్యత క్రమంలో ఎలా ఓటు వేయాలో సులువుగానే గ్రహించవచ్చు .పట్ట భద్రులు అంటె మామూలుగా ఏమి తెలియని వారు అని ఎలా అనుకుంటాం . 10+2+3 విదానంలో,కనీసం పదిహేనేళ్ళు కష్టపడి చదివి విజ్ఞానం సంపాదిస్తే కాని రాదు , పట్ట భద్రత ! మరి అటువంటి పట్ట భద్రులు లో, ఓటు ఎలా వేయాలో తెలియని వారు,మొత్తం పోలింగ్ కు హాజరైన ఓటర్లలో సుమారు 10% మంది ఉన్నారంటే ,వారి గురించి ఏమనుకోవాలి ? అసలు తాము వేస్తున్న ఓటు విలువ ఏమిటొ తెలియకుండానే ఓటు వేసారు అంటే , అబ్బా ! ఇక చెప్పేదేముంది ?
మా నియోజక వర్గంలో మొత్తం పోలైన ఓట్లు 1,53,547. అందులో తెరాస అభ్యర్ధి పల్లా రాజేశ్వర రెడ్డి గారికి 59,764, రాగా ,రెండవ స్థానం లో ఉన్న B.J.P అభ్యర్ధి ఎ . రామోహన్ రావుగారికి 47,041 ఓట్లు వచ్చాయి .ఇక మూడవ స్థానం ఎవరికో తెలుసా ! ఇంకెవరికి ? పైన చెప్పిన ,ఓటు వేయడం ఎలాగో తెలియకుండానే ఓటు వేసిన , అజ్ఞాన పట్టభద్రుల ఓట్లు పొందిన శ్రీ "తిక్కల చెల్లవన్న " (చెల్లని ఓట్లు బ్యాంక్ కు నేను పెట్టిన పేరు ) గారికే. ఎన్నో తెలుసా ? వంద కాదు ,రెండు వందలు కాదు ,ఏకంగా 14,039 ఓట్లు చెల్లకుండా పోయాయి . ఆ తర్వాతి స్తానం,కాంగ్రెస్ అభ్యర్ధి , ప్రముఖ T.V సెలబ్రిటి "తీన్మార్ మల్లన్న "గారు . చూసారా ! T.V సెలబ్రిటి కంటె కూడా తిక్కల చెల్లవన్న ఓట్లు ఎక్కువ పొందాడు . ది గ్రేట్ "తిక్కల చెల్లవన్న "..పూర్తి సమాచారం కొరకు పై చిత్రం చూడగలరు .
Comments
Post a Comment