ఆడా మగ సమానం అనుకుంటే ,మద్యలో తడిక అడ్డం ఎందుకు తమ్ముడూ ?
హిందూ సమాజం స్త్రీ లను పురుషులతో పాటు సమానం గానే చూసింది .దేవుడు ప్రక్కన దేవతలను నిలబెట్టి పూజలు చేస్తుంది .స్త్రీ పురుషులు సమానం కావాలని ,పూర్వ సమాజం వారిని ఒకరి పై ఒకరు ఆదారపడి జీవించేలా కొన్ని నిబందనలు విదించింది .అందులో నుండి ఉద్బవించిందే విశిష్టమైన కుటుంభ వ్యవస్థ . స్త్రీ పురుషులు కలిస్తేనే "సంపూర్ణ మానవుడు" ఏర్పడతాడు అని చెప్పింది . స్త్రీ లేక పురుషుడు లేడంది . అదే అర్ధ నారీశ్వర తత్త్వం .ప్రక్రుతి రీత్యా స్త్రీ బల హీనురాలైనప్పటికీ ,కుటుంబ వ్యవస్థ వలన కుటుంబ బలం ఆమెకు సంప్రాప్తించి ఆమె బల వంతురాలు అవుతుంది .అదే అది శక్తి అవతార ప్రతీక .ఒక సందర్బంలో రాక్షసుడిని సంహరించడానికి దేవతలు తమ ఆయుదాలు అన్నీ ఆదిశక్తికి ఇచ్చి ఆమెను బలోపేతం చేసి ,ఆ దుర్మార్గ రాక్షసుడు సంహరింపబడెలా చూస్తారు . ఈ కదలోనె కుటుంబం స్త్రీని ఎలా బలోపేతం చేస్తుందో తెలియచెప్పారు . అప్కోర్స్ అసలు రాక్షసులే మా తాతలు ,మేము వారి వారసులం అనుకుని, లేని రోమ్ముని విరచుకుని తిరిగేవారికి ఇది అర్ధం కావడం కష్టం .
ఈ విదంగా స్త్రీ పురుషులను సమానం చేస్తుంది సమాజంలో ని కుటుంబ వ్యవస్థ . అప్కోర్స్ కుటుంబ వ్యవస్థ పటిష్టతకు ఉపకరించేవి ప్రేమానురాగ బందాలు అనేవి సత్యం . కాని స్త్రీని పురుషుని తో పాటు సమానం చేసి ,ఆమెకు రక్షణ ఇచ్చె కుటుంబ వ్యవస్థ వద్దని ఒక పక్క చెపుతూ ,ఇంకొక ప్రక్క స్త్రీ పురుషులూ సమానం గా చూడ బడాలి అని గొంతు చించుకుని అరచే వారు వాస్తవాలకు ఎంత దూరంగా ఉన్నారో తెలుసుకోవాలి . ఏదైనా సరే ఒకటి కావాలి అనుకుంటే మరొకటి ఒదులుకోవాలి . కుటుంబ వ్యవస్తను వద్దనుకునే వారు ,కుటుంబ కట్టు బాట్లను కాల దన్నేవారికి సమాజంలో రక్షణ తక్కువే అవుతుంది .ఇది ఎవరు అంగీకరిం చినా, అంగీకరించక పోయినా కఠోర సత్యం ఇదే .
మీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి .స్త్రీ పురుషులు ను ప్రభుత్వాలు సమానంగా చూస్తున్నాయా ?సమానమే అనుకుంటే వారికి ప్రత్యేక బస్సులు ఎందుకు? ప్రత్యేక టాక్సీలు ఎందుకు? అసలు ఒక బస్సులోనే పురుషులుతొ పాటు ప్రయాణిస్తున్నప్పుడు వారికీ వీరికీ మద్య ఇనుప తడిక అడ్డం ఎందుకు ఉంచుతున్నారు .ఈ చర్యలు చాలవా స్త్రీ పురుషులు సమానం కాదు అని మన సమాజం ఒప్పుకుంటుందని . కాబట్టి ఊక దంపుడు ఉపన్యాసాలు మాని , స్త్రీ పురుషులను ఒకరి పై ఒకరు ఆదారపడి జీవించేలా చేస్తున్న కుటుంభ వ్యవస్తను పటిష్ట పరచే దిశగా చర్యలు తీసుకోవడం ఉత్తమమైన పని .ఇది మన అంతర్జాతీయ న్యాయ సూత్రాలలో ఒకటి . కుటుంబ పటిష్టత హక్కు మన జన్మ హక్కు కావాలి .అప్పుడె స్త్రీ పురుషుల సమానత సాద్యం .
Comments
Post a Comment