తాగితే ఆడ ఐనా, మగ ఐనా ఒకటే!

                                                                   
  మొన్న రెండు  చోట్ల వేర్వేరు ఘటనలు జరిగాయి.మొదటిది తెనాలిలో తాగుబోతులైన యువకులు ఒక అమ్మాయిని అల్లరి చేసే క్రమంలో ఆమె తల్లిని లారీ క్రిందకు నెట్టి చంపారని పోలిస్ వారి సమాచారం. అలాగే హైద్రాబాదులో కొంతమంది అమ్మాయిలు పబ్బులో ఫుల్ గా తాగేసి, అర్థరాత్రి రోడ్డు మీదకు వచ్చి వీరంగం వేసి మీడియా వాళ్ళ మీద దౌర్జన్యం చేసారని వార్తలు.

  అర్థరాత్రి స్వాతంత్ర్యం గురించి గాంది గారు కన్న కలలు మనవాళ్ళు ఇలా నిజం చేస్తున్నందుకు ఎలా సిగ్గుపడాలో తెలియడం లేదు.అర్థరాత్రి ఒంటిగంట వరకు బారులకు లైసెన్స్ లు ఇచ్చిన ఈ సెన్స్ లేని పాలకుల వల్ల జరిగే అనర్థాలు ఇవి అని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసిన, అసలు తాగడం అనేది తప్పు అని, ఒక వేళా అలవాటు ఉంటే దానిని లిమిట్ గా ఎలా వినియోగించాలో చెప్పే నిబందనలు ప్రబుత్వం చేసిందా? చెయ్యదు. ఎందుకంటే మనకున్న ప్రదాన వనరుల్లో "మద్యపానం" ఒకటి కాబట్టి.

    మనకు తాగడంలో, వాగడంలో, ఉన్నంత స్వేచ్చ బహూశా ఏ దేశంలో ఉండవనుకుంటా!ఈ మద్యనే ఎందుకో ప్రజల్లో చైతన్యం వచ్చినట్లుంది,ముందు వెనుక కానక ఇష్టం వచ్చినట్లు వాగే వారిని పలు చోట్ల ప్రైవేట్ కంప్లైంట్ లు వేసి బయపెడుతున్నారు. అలా కొంచం నియంత్రణ కనపడుతుంది. కాని ఈ తాగుడు వ్యవహారంలో అలా లేదు ఎందుకంటే  తాగి ఉండడం  నేరం అని చెప్పే చట్టం లేదు. ఏదైనా గలాటా చేస్తే న్యూసెన్స్ అనే పెటి కేస్ పెడతారు అంతే. ఈ విషయం లో చట్టం కటినం చేస్తే  రాష్ట్ర ఆదాయం దెబ్బ తింటుంది కాబట్టి ఆ పని మాత్రం చెయ్యరు.

   స్త్రీలు పురుషులు అన్న బేద బావం లేకుండా అందరూ ఇలా విపరీత పోకడలు పోయి మీరు తప్పు చేస్తే మేము చెయ్యకూడదా? అనే పెడ వాదనలు చేస్తూ మన సంస్క్రుతిని నాశనం చేస్తున్నారు. ఇంత వరకు వచ్చాక కట్టడి చెయ్యడం కష్టమే అయినప్పటికి, బార్లను పబ్బులను మూసివేసి, కేవలం షాపులకు మాత్రమే అనుమతి ఇచ్చి, వాటిని సహితం ప్రబుత్వ పర్యవేక్షనలో నిర్వహించాలి. పబ్లిక్ ప్లేస్ లలో తాగి ఉండడం ను నేరంగా పరిగణించాలి. యింటిలో అదీ కుటుంభ సబ్యుల అంగీకారం ఉంటే తప్పా మద్య సేవనం నేరంగానే బావించాలి. ఇలా చేస్తే కొంతకాలనికి కట్టడి చేయ వచ్చు.     

Comments

  1. FiRST PERMISSION TILL MIDNIGHT GRANTED BY CHANDRABABU.

    ReplyDelete

Post a Comment

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

ఇంగ్లీష్ దుస్తులు వేసుకుని "Happy New Year " అంటే , కన్నడ కేకలు వేస్తూ వెంటపడి వేధించారు అట !

స్త్రీ ని నగ్నంగా చూపించటం అశ్లీలం కాదన్న సుప్రీం కోర్టు

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

మనల్ని ఆపదల నుండి కాపాడే నరసింహ మంత్రం