"నిర్బయ" ఉదంతం తర్వాతే మన దేశంలో అత్యాచారాలు ఎక్కువయాయా!?


                                                              


  చూడబోతే అలానే అనిపిస్తుంది. నిర్బయ కేస్ తర్వాత, దేశ ప్రజలలో చెలరేగిన ఆందోళన , ఆ తర్వాత జరిగిన చట్ట సంస్కరణల వలన, స్త్రీల పై జరిగే అత్యా చారాలకు కటీన శిక్షలు విదించేటట్లు, చట్టాలు రావడం వలన ఖచ్చితంగా కామాందులలో భయం అనేది పుట్టి ,అత్యాచారాల క్రైం రేట్ తగ్గుతుందేమోనని బావించిన వారికి నిరాశే మిగులుతుందనుకుంటా!

  ఈ మద్య ఒక కేసు విచారణ సందర్బంగా డీల్లీ హై కోర్ట్ వారు కూడ ఈ విషయం లో ఆందోళన వ్యక్త పరచారు. ఈ మద్య విపరీతంగా పెరిగిపోతున్న స్త్రీల మీద లైంగిక దాడులు గురించి , వాటికి కారణాలు గురించి సమగ్ర అద్యయనం జరగాలన్నారు. అవును ఇది అక్షరాల సత్యం. మూలం కనుక్కోకుండా, పై పై పూతలు, మందులు రొగాన్ని తగ్గించనట్లే, వేయి "నిర్భయ" చట్టాలున్న పరిస్తితిలో మార్పు ఉందకపోవచ్చు.

  నేను ఇది వరకి టపాలలో చెప్పినట్లు "తప్పుడు కేసులు" సంస్క్రుతీ మన దేశ  పోలిస్ కేసులలో ఒక దౌర్బాగ్యం. డబ్బులకు ఆసపడో, బలమఈన సెక్షన్లు పెడితే తప్పా ప్రత్యర్దులను లొంగదీయలేమన్న తప్పుడు ఆలోచనల వల్ల, తప్పుడు కేసులు పెట్టబడుతున్నాయి. చివరకు ఈ కేసులు కాంప్రమైజ్  ల ద్వారా ముగుస్తాయి.ఇలా చట్టాలతో ఆట్లాడె వారి ఆటలు కట్టించే విదంగా, సరి అయిన చట్టాలు లేకపోవడం వలన,వీరి ఆటలు కొన సాగుతున్నాయి.  ఇతువంటి తప్పుడు కేసులు సంస్క్రుతి వలన ఏది తప్పుడు కేసో, ఏది నిజమైన కేసో తెలియక, తప్పుడు కేసుల ఆదారంగా నేరాలు అదికంగా జరుగుతున్నట్లు అనిపిస్తుండ వచ్చు. ఇంతకు ముందు ఉన్న యస్.సి. యస్.టి. చట్టం ఒక్క ఉద్దేస్యం , ఇతువంటి తప్పుడు కేసుల వలన నీరుగారి పోయింది. ఒక వేళా సరి అయిన దర్యాప్తు, తప్పుడు సమాచార నీరోదానికి సరి అయిన కట్టడి లేక పోతే, "నిర్భయ" చట్టం ఒక్క ఉద్దేశ్యం కూడ నేరవేరక పోగా, దుర్వినియొగం కవచ్చు.

  అన్ని కేసులు మాదిరిగా "లైంగిక" దాడుల కేసులను చూడకుండా ప్రతి కేసు సమర్దులైన, సామాజిక స్ప్రుహ కలిగిన అదికారులతీ నేర దర్యప్తు చేయించాలి. కేవలం నేరం ఎవరు చేసారు అనేది మాత్రమే కాక, ఆ నేరం జరగడనికి తోడ్పడిన పరిస్తితులు, .నేరస్తుల, బాదితుల   స్వబావం ఇత్యాది అన్నీ  కోణాలోనుంచి సమగ్ర దర్యప్తు చేసి రికార్డులు బద్ర పరిస్తే, అది సామాజిక శాశ్త్రవేతలకు ఉపయోగ పడుతుంది. అయితే నేర రికార్డులలో అసత్యం అసలు ఉండరాదు. ఇది సామాజిక వేతలకు నేర కారణాలు కనుగోవడంలో ఒక తప్పుడు అభిప్రాయానికి వచ్చే వీలుంది.

   ఉదాహరణకు మొన్న మన  రాష్ట్రం లో     పునాది పాడు  ఘటనే చూస్తే, మొదట బాదితులు ఆందోలనలు చేస్తే కాని ,ఒక వర్గం వారి మీద కేసు నమోదు కాలేదట! తిరిగి నిందితుల వర్గం వారు అది తప్పుడు కేసు అని ఆందోళన చేసారు. ఇటువంటివి ఎందుకు జరుగుతున్నాయో ఆలోచించాలి. కేసుకు కౌంటర్ కేసు పెట్టడం చాలా సుళువు. ఇటువంటి విదానాలు వలన ప్రజలలో "దండ భయం" ఉండదు. ప్రతిదీ రాజీల ద్వారానే పరిష్కారమవుతుంటే, నేరాలు చేసే వాడు, డబ్బున్న వాడు అవుతే వారిని చట్టాలు ఏమి చెయ్యలేవు. రోజు ఆందోళనలు చేసే ఓపిక ఎవరికీ ఉండదు. ముందు వ్యవస్తను ప్రక్షాళన చెయ్యకుండా ఏన్ని చట్టాలు తెచ్చినా అవి కూడ మరింత అవినీతి బురద జమ చెయ్యడనికే ఉపయోగ పడతాయి. చివరకు లైంగిక దాడులన్నీ  సినిమా స్టోరీలై, చాన్నళ్ళ రేటింగులకు ఉపయోగపడతాయి.అందుకే పెద్దల్లన్నది "దర్మో రక్షతిః రక్షితః". ఆడపిల్లల్ని రక్షించడమే నిజమైన మగవాడి ధర్మం.       . అలాగే తప్పుడు కేసులను నిర్ద్వందం గా ఖండించడం కూడ మన దర్మం కావాలి. "సత్యమేవ జయతే" అన్నది మన చట్టం మాత్రమే కాదు ధర్మం కూడ అన్నది మరువరాదు. ఆ ధర్మ రక్షణకు మనం కంకణ బద్దులై ఉండాలి.          

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన