నీతి బాదితుల ఓదార్పు యాత్ర కథ!

                                                                     


  నిన్న నా దగ్గరకు ఒక వీరాభిమాని వచ్చాడు. ఆయన ఒక రాజకీయ పార్టీ నాయకుడు కి వీరాభిమాని.వాళ్ళ నాయకుడు  చనిపొతే, పాపం ఈయన సంవత్సరం  పాటు తెగ ఏడ్చాడు.ఎందుకంటే,ఆయన తర్వాత  ఈ రాష్ట్రానికి దిక్కేవరూ లేరు అని.అలా ఆయన లాగా బాదపదే వాళ్ళు లక్షల్లో ఉన్నారట!అందుకని వారందరిని ఓదార్చడానికి ఆ చనిపోయిన నాయకుడి కుమారుడు "ఓదార్పు యాత్ర" పేరుతో రాష్ట్రమంతా పర్యటించి తన తండ్రి మరణ బాదితులను ఒదార్చడం ప్రారంబించాడాట.అందరిలాగా కేవలం ఒదార్పు మాటలు కాకుండ కాస్త ఘనంగా ఓదార్చితే, మంచిదనుకున్నాడో ఏమో,ఒక్కొక్క కుటుంభానికి లక్ష రూపాయలు ఇచ్చి మరీ ఓదార్చాడట!.ఆ దెబ్బతో అబ్బా, ఓదార్పు యాత్ర గ్రాండ్ సక్సెస్ అయ్యిందట.

  కాని ఆ పైనున్న ప్రభువు చిన్న చూపు చూసాడు కాబోలు, అవినీతి కేసులు మెడకు చుట్టుకుని జైల్ పాలయ్యడు ఆ వీర నాయకుడు.ఇక అక్కడ్నుంచి ఆయన్ని ఓదార్చాడానికి జైల్కి అభిమానులు  క్యు కడితే, జైల్ అదికారులు నిబoదనలు చూపించి ఓదార్పు యాత్ర జైల్ లో కుదర అనే సరికి,పాపం అభి మానులు దిగాలుగా ఇండ్లకు వెళ్ళి, ఇంట్లో పోటో నీ ఓదారుస్తున్నారట!.

  ఇలా ఆ వీర నాయకుడు ఆయన అభిమానులు పరస్పర ఓదార్పు ప్రక్రియ ఇలా ఉందగా పాపం రాష్త్రం లోని కొంతమంది మంత్రుల ఖర్మ బాగోక వారి మీద చార్జ్ షీట్లు పెట్టడం జరిగిందట. ఇది కూడ ఆ నాయకుడు పుణ్యమేనని ప్రతి పక్షాలు దుమ్మెత్తి పోస్తుంటే, కనీసమ్ ఈ కష్ట కాలం లో తమను ఓదార్చే ’ఓదార్పు యాత్రీకుడు" ఎవరో తెలియక మంత్రులంతా తమలో తామే ఓదార్చుకోవడమ్ బెస్ట్ అనే నిర్ణయానికి వచ్చి, జైల్ లో ఉన్న మంత్రులను, చార్జ్ షీట్ మంత్రులను ఒక్కొక్కరిగా వెళ్ళి ఓదార్స్తున్నారంట!

  అలా నీతి(చట్ట) బాదితులంతా ఒకరినొకరు ఓదార్చుకుంటూ,ఊరట పొందుతుంటే, అసలు అవినీతి అంటే జనాలకు తెలియదు కాబట్టి, సామాజిక సంపదకు తాము హక్కుదారులం అనే విషయమే తెల్యిక పోవటం వలన, ప్రజలు కూడ, ఈ చట్ట బాదితులను చూసి కన్నీరు కారుస్తూ,ఎలాగైనా  సరే రాబోయే ఎన్నికలలో వారికే వోటు వేసి తమ సాను బూతిని, సంఘీ బావాన్ని తెలపాలని యమ పట్టు దలగా ఉన్నారని అందుకని తమ నాయకుడు గెల్వడం ఖాయం, గెలిచి రాష్ట్రాధిపతి కావడం ఖాయం అని డంకా బజాయించినట్లు చెప్పాడు.
                   అయ్యా!  ఇదీ ఆయన చెప్పిన  నీతి బాదితుల  ఓదార్పు యాత్ర కథ!    

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!