'శాడిజం' కి' రాడిజం 'మాత్రమే కరెక్ట్!



  వంద సార్లు చెప్పు, వేయి సార్లు చెప్పు,లక్షసార్లు చెప్పినా "లైంగికాసురులు" మారరుగాక మారరు. ముఖ్యంగా చిన్న పిల్లమీద లైంగిక దాడి చేసే నీచులుకి ఏమి చెప్పినా ప్రయోజనం ఉండదు. మొన్న డిల్లీలో జరిగిన అయిదేళ్ళ పాప మీద లైంగిక దాడి రోజూ దేశంలో జరుగుతున్న వాటిలో ఒకటి మాత్రమే. అయితే అక్కడ ప్రజలు అంతగా తిరగబడటానికి కారణం, మూడు నెలల క్రితం జరిగిన "నిర్భయ" ఉదంతం నుండి డిల్లీ పోలిసులు గుణపాటం నేర్చుకోపోవడం ప్రజల ఆగ్రహానికి కారణమయింది.

   ఒక చేతకాని వెదవ చిన్న పిల్లను హీంసిస్తే, దాని మీద కేసు నమోదు చెయ్యలేని పోలిసుల వెదవతనానికి పెల్లుబుకిన నిరసన అది.లైంగికంగా అసమర్దులైన వారు,తమ అసమర్దతను కప్పిపెట్టుకోవడానికి,ఇటువంటి శాడిస్ట్ పనులు చేస్తుంటారు. చిన్నపిళ్ళలు వీరు చేస్తున్న పని చూసి బాదతో భయంతో విల విల లాడుతుంటే,అది చూసి శాడిస్ట్ల మగ అహంకారం త్రుప్తిపడుతుంది. ఇది ఖచ్చితంగా మానసికి సమస్యే అయినప్పటికి ఆ కారణం తో వారిని కటినంగా సిక్షించే విషయమ్లో  జాలి చూపించాల్సిన అవసరం చట్టానికి ఉండకూడదు.

   ఈ మద్య ఇటువంటి బాల లైంగిక వేదింపుల  కేసులు బాగా పెరిగి పోతున్నాయి. దీనికి కారణం నేను పైన తెలిపిన కారణమే ప్రదానం కావచ్చు. ప్రస్తుత జీవన శైలి,కాలుష్యం  పురుషులలో  లైంగిక అసమర్థతను పెంచుతున్నాయి అనుకుంటా. దానిని కప్పి పెట్టుకోవడానికే ఈ చర్యలు అదికంగా ఉన్నాయి అని నా అభిప్రాయం. దీనికి కారణాలు , మానసిక, సామాజిక శాస్త్రవేతలు కనుగొనాలి.ఆ తర్వాత వాటి నివారనోపాయలు కనుగొనాలి. ఇదంతా లాంగ్ ప్రాసెస్ కావచ్చు. అప్పటిదాక లైంగిక దాడులు ఆగవు కదా?మరి యేమి చెయ్యాలి?

   ముందు దేశంలోని పోలిస్ వ్యవస్తను సమూలంగా ప్రక్షాళన చెయ్యాలి.కేంద్ర రాష్ట్ర ప్రబుత్వాలు ఈ విషయంలో తక్షణ చర్యలు చేపట్టాలి. కాసుల వ్యామోహంలో పడి డ్యూటీలను నిర్లక్ష్యం చేస్తున్న అధికారులను తక్షణమే తొలగించే ప్రక్రియ ఉండాలి. సమర్దులఈన ఆఫిసర్లు ఉన్న చోట కొంత నేరకట్టడి ఉందనేది కాదనలేని సత్యం. ఇందుకు వారు నేరస్తుల పట్ల వారు అనుసరించే "దండ నీతే" భయం  కారణం కావచ్చు.ఇది చట్ట వ్యతిరేకం కావచ్చు.కాని ఇప్పటి పరిస్తితిలో ఇది తప్పదేమో.


   శాడిజం మనస్తత్వం గల వాడిని గుర్తించడం కష్టం. వాడు అమాయకుడిగా బందువుల రూపంలో కావచ్చు, బయటి వారి రూపంలో కావచ్చు మన మద్యనే ఉంటాడు. బాలల మీద లైంగిక దాడులకు పాల్పడే వాడు స్వతహాగా పిరికి వాడు అయి ఉంటాడు. అందుకే వీళ్ళు తమ దాడులకు పిల్లల్ని టార్గెట్ చేస్తారు. వీళ్ళ నీచ మనస్తత్వాన్ని అదుపులో పెట్టేది "దండ భయం" ఒక్కటే. ఏ మన్నా జరిగితే ఒళ్ళు పగిలి పోతుందన్న బయం వీరిని నియంత్రణలో పెడుతుంది.కాబట్టి దండ ప్రయోగ మనేది చట్ట బద్దం చెయ్యడం విరి విషయంలో కరెక్ట్ అనుకుంటా.

  కాబట్టి "శాడిజం కు,రాడ్(దండం) ఇజమే కరెక్ట్ అని నా అభిప్రాయం. ఇంకొక కోణంలో ఆలొచిస్తే పాపాత్ముల పాలనలోనే ఇటువంటి అక్రుత్యాలు జరుగుతుంటాయి. ఎవరు పాపాత్ములో తెలిసి కోవాలంటే ఇది వరకు ఇదే విషయమ్ గురించి మేము పెట్టిన టపా కోసం లింక్ మీద క్లిక్ చెయ్యండి.http://ssmanavu.blogspot.in/2013/01/blog-post_25.html

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!