యుగ యుగాలకు, ఆలు మగలకు ఆదర్శం "సీతారామ దాంపత్యం"
యుగ యుగాలకు, ఆలు మగలకు ఆదర్శం "సీతారామ దాంపత్యం"
అలు మగల అనుబందానికి సీతారామ దాంపత్య జీవితం చక్కని ప్రతీక.కస్ట సుఖాలలో బార్యాబర్తలు ఎలా పాలు పంచుకోవాలో తెలిపే వీరి దాంపత్య జీవనం మనకి ఆదర్శం. రాజ రికంలో పుట్టినప్పటికి, దర్మం కోసం వీరు అనుబవించిన కస్టాల ముందు మనవి ఒక లెఖ్ఖా?నిత్యం ఈ దేవతా మూర్తులను కొలిచే మనలో చాలా మంది చిన్న చిన్న విషయాలకే,సంసారాలను విడాకుల వరకు తీసుకు వెళ్లడం ఎంతవరకు సమంజసం. కట్టుకున్న వాళ్లతోనే సర్దుకుపోలేని వారు సమాజంలో ఎలా ఇతరులతో సర్దుకుపోగలుగుతారు?దాంపత్యమంటే ప్రేమతో కూడిన సర్థుబాటు.దీనిని తెలిసికోలేక సంసారాలు పాడు చేసుకుంటున్న వారు ఎన్ని సార్లు సీతారామ జపం చేసినా, నిష్టతో శ్రీరామ నవమి కల్యాణాలు చేయిస్తున్నా నిష్పలమే.
ఆ సీతారాముల ఆశీసులు అందరికి ఉండాలని ప్రార్థిస్తూ....
Comments
Post a Comment