భార్యా పిల్లలు ఉన్న ఇంటికా? బార్ అండ్ రెస్టారెంట్ కా?

                                                          
            

  మీకు ఉగాది శుభా కాంక్షలు తెలపటానికి ముందు ఒక వీషయం తెలుసుకుందామనిపించి ఈ ప్రశ్న వేస్తున్నాను.
  మీరు ఎప్పుడైనా బయట పనుల ఒత్తిడిలో ఉన్నప్పుడు, మనసు చికాకుగా అనిపించిదనుకోండి మీరు వెంటనే  ఎక్కడికి వెళతారు? భార్యా పిల్లలు ఉన్న ఇంటికా? బార్ అండ్ రెస్టారెంట్ కా?

   ఒక వేళా మీకు మొదటి చోటుకే వెళ్లాలనిపిస్తే మీ అంత అద్రుష్ట వంతుడు ఈ భూమి మీద వేరొకడు లేదు. "గ్రుహమును మించిన స్వర్గసీమ ఇల యందు కలదే"?. కాని చిన్న, చిన్న అపోహలు, కలతలు మన సంసార గ్రుహాన్ని చిన్నా భిన్నం చేస్తున్నాయి. వాటిని పరిష్కరించి,బార్యా భర్తలను సరిదిద్దే ఓపిక ఈ నాటి పెద్దల్లో లేదు, ఒక వేళా ఎవరైన పెద్దలు చెపితే సర్థుకు పోయి సంసారం చేసే గుణం పిన్నల్లో లేదు. ఈ మద్య  కొందరిని చూశాను. ముప్పై యేండ్లు కాపురం చేసి, పిల్లలు పెద్దవారిని చేసిన దంపతులు సహితం తమ మద్య పొసగడం లేదని విడాకుల కోసం అర్థించడం. మనలో ఈ సర్థుకు పోయే గుణం ఎందుకు తగ్గుతుందో ఎప్పుడైనా ఆలోచించారా?

   మన చుట్టూ పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం, ద్వని కాలుష్యం, మన జీవన సరళి లో మార్పుల వల్ల కలిగే వ్యాదులు, మితిమీరిన సెల్ పోన్ వాడకం ఇవన్ని బౌతిక కారణాలైతే, వ్యక్తిగత స్వేచ్చ మీద మక్కువ పెంచుకోవడం,ప్రాశ్చ్చాత్య దోరణిలో పడి సామాజిక విలువలను పట్టించుకోక పోవడం , అనాలోచిత చట్టాలు ,ఇవన్ని భారతీయ సంసార గ్రుహ విచ్చిన్నానికి కారణమవుతున్నాయి.

   కాబట్టి పెద్దలు ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగులు,సాద్యమైనంత వరకు మీ శేష జీవితాన్ని, మన కుటుంబ వ్యవస్త పరిరక్షణకు వినియోగిస్తే మంచిది. దీనికి మీ జీవితానుభవం తోద్పడుతుంది. మీరుండే ప్రాంతాలలో "ఫామిలీ కౌన్సెలింగ్ సెంటర్"లు తోటి వీశ్రాంత ఉద్యొగులు, సీనియర్ సిటిజన్ లతో ఏర్పాటు చేసి, ఆ ప్రాంత కుటుంభీకులకు సలహా సంప్రదింపుల సేవలు అందించ గలరు. మన కుటుంబ వ్యవస్తను రక్షించాల్సిన బాద్యత మనందరి మీద ఉంది.

     మా బ్లాగ్ వీక్షకులకు, మిత్రులకు, విమర్సలు, సలహాలతో ఈ బ్లాగు మనుగడకు సహకరిస్తున్న అందరికి ఉగాది శుబాకాంక్షలు. మీ "మనవు"       

Comments

  1. మా బ్లాగు మిత్రులకు, వీక్షకులకు, ఉగాది . పండుగ శుభాకాంక్షలతో......

    ReplyDelete

Post a Comment

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.