మానభంగం కంటే ఘోరమయింది "మర్యాద భంగం"!
మొత్తానికి మన కేంద్ర ప్రభుత్వం వారు ఒక మంచిపనిని అతి త్వరగా చేశారు.అదే నండి మహిళా రక్షణ కొరకు "నిర్భయ"బిల్లును చట్ట రూపం లోకి తెచ్చారు. ఈ సవరణ చట్టం వలన ఇక నుండి "మాన భంగం " నేరస్తులకు కటిన శిక్షలు విదించే వీలు ఉంటుంది.అంత వరకు సంతోషమే.కాని పరస్పర అంఘీకార శ్రుంగారానికి పద్దెనిమిదేళ్ల వయసును నిర్దారించడం కొంత అబ్యంతరకరమే.
బారతదేశం లో విశిష్టమైనది, బలమయినది కుటుంభ వ్యవస్త.ఆటువంటి కుటుంభ వ్యవస్తకి పునాది "మనువు" . అంటే వివాహం. ప్రతి తండ్రి తన కుమార్తెను యోగ్యుడైన వరునికి ఇచ్చి పెండ్లి చేయ్యాలని కోరుకుంటాడు. " "కన్యాదానం" అనేది వివాహ తంతులో అత్యంత ప్రాదాన్యత గలది. అలాగే పెండ్లి అనేది పూర్తిగా మతపరమయిన చర్య. దీనిలో చట్టం జ్యోక్యం చేసుకోవడమంటే అది మతపరమయిన ప్రాదమిక హక్కుల ఉల్లంఘన క్రిందకే వస్తుంది. మరి ఇటువంటి పరిస్తితిలో కుటుంభ సబ్యులకు "అంగీకార శ్రుంగారం" వయస్సును చట్టం ఎలా నిర్దారిస్తుంది? పెండ్లి కాని యువతీ యువకులు కేవలం చట్టం అనుమతించిందని "శ్రుంగారానికి " సై అంటే వారిని నియంత్రించే అదికారం "కుటుంభ" సబ్యులకు ఉంటుందా? పద్దెనిమిది యేండ్ల లోపే పెండ్లి చెయ్యాల్సిందేనా? ప్రేమాకర్షణలో పడి తమ జీవితాలను నాశనం చేసుకునే పిల్లలను కాపాడుకుంటానికి తల్లితండ్రులకు ఉన్న చట్టపరమయిన హక్కులు ఏమిటి? వీటి గురించి చట్టాలు చెయ్యరా?
మాన భంగం అనేది అటు వ్యక్తినే కాక కుటుంభo మొత్తం ని బాదిస్తుంది.అలాగే "కన్యా దానం" అనేది కుటుంబ మర్యాదతో కూడిన మతపరమయిన హక్కు. కాని అట్టి హక్కును భంగపరచినపుడు, అలా భంగ పరచే వారిని శిక్షించకపోగా, పద్దెనిమిది యేండ్లు నిండితే చాలు "మా రాజ్యం మీకొక ప్రేమ సామ్రాజ్యం", స్వేచ్చగా విహరించండి అని అనుమతులు ఇస్తే ఎలా?.కచ్చితంగా ఇది తిరిగి స్త్రీల అభ్యున్నతిని, దెబ్బ తీస్తుంది. అసలే ప్రాశాత్య సంస్క్రుతికి అల్లడి తల్లడి అవుతున్న కుటుంబ వ్యవస్త ఇలా బాఃఆటంగా పద్దెనిమిదేళ్ళ తర్వాత మీ ఇశ్టం అని చట్టం లో పొందుపర్చడం వలన, కుప్ప కూల వచ్చు.ఇప్పటి వరకు ఆ నిబందనే ఉన్నప్పటికి మన సంస్క్రుతి బలం వలన జరిగిన నష్టం తక్కువ. కాని విద్యార్జన, ఉద్యోగ ఉపాది కోసం ఆడపిల్లలను బయటకు పంపాల్సి రావడం అనేది పెరిగిపోయిన ఈ రోజుల్లో, వెర్రి మొర్రి ప్రాశ్చాత్య దోరణులను అరి కట్ట లేని ప్రబుత్వాలు, కుటుంబ మర్యాదలను గుర్తించి, హక్కులుగా గుర్తించి చట్టాలుచెయ్యలి తప్పా, ఆవేశంలో చట్టాలు చేస్తే,అనర్దాయకం తప్పా మిగిలేది ఏమి ఉంటుంది?.
నా ఉద్దేశ్యంలొ వ్యక్తి హక్కులు ఎంత ముఖ్యమో, కుటుంబ హక్కులు అంతకంటే ముఖ్యం.వాటి పరిరక్షిచడం ప్రబుత్వాల విది.
Comments
Post a Comment