తలంబ్రాలు పోసి అగ్ని సాక్షిగా పెండ్లాడమంటే, కిరోసిన్ పోసి అగ్గి అంటించి హాస్పిటల్లో చేర్చిన ప్రియుడు!.


     


                                 ప్రేమ కంటే మత్తు అయినది ఏది ఈ  ప్రపంచం లో లేక  పోవచ్చు. ఆ ప్రేమను ఆస్వాదిస్తున్నంత కాలం ,అది కలుగ చేసే మత్తులో నుండి భయటకు రావడం కష్టం. అందుకే ప్రేమలోకి దిగకముందే , తను ప్రేమించేవారి గుణగణాలు , ఆ తర్వాతి పరిణామాలు అన్నీ ఆలోచించుకుని,వారితో ప్రేమాయాణం సాగిస్తే కొంతలో కొంత సేఫ్. ప్రేమకు ఇద్దరి పరస్పర అంగీకారం చాలు. కానీ పెండ్లికి కి మాత్రం రెండు కుటుంబాల అంగీకారం కావాల్సి ఉంటుంది. పెద్దల అనుమతి లేకుండా పెండ్లిళ్ళు చేసుకునే వారికి ఈ  నియమం వర్తించక పోవచ్చు, కానీ ప్రేమించక ముందే తన ప్రియుడు లేక ప్రియురాలు అలా చేయగల సాహసం గల వారేనా అని ఆలోచించాకే తర్వాతి అడుగు వేయ్యాలి. అసలు ప్రేమించే వారు ఎవరైనా ఇవ్వన్నీ ఆలోచించి చేస్తారా , ఇవ్వన్నీ ప్రేమ గురించి తెలియని వారు చెప్పే పిచ్చి మాటలు అని అనుకుంటే , ఇదిగో ఈ  ఉదంతం లో మాదిరి తలంబ్రాలు కు బదులు కిరోసిన్ , పల్లకి కి బదులు పాడె ఎక్కాల్సి ఉంటుంది.

  అమ్మాయి B. Tech  పైనలియర్ చదువుతుంది. అబ్బాయి తమ  మండలం నకు చేందిన వేరే గ్రామ ఉప సర్పంచి.అలా  పరిచయముంది. రాను రాను ఆ పరిచయం ప్రేమగా మారింది. అలా రెండేళ్ళు గాడంగా ప్రేమ్ంచుకున్నారు. ఒక మండలం  వారే కాబట్టి ఇద్దరికీ వాళ్ళ పామీలీ బాక్ గ్రౌండ్ గురించి బాగానే తెలిసి ఉంటుంది. అబ్బాయి మాజీ  ఉపసర్పంచ్ పైగా పైనాన్స్ వ్యాపారముంది. . అమ్మాయి కొంచం ఆర్దిక స్తితి అంతగా లేని పామిలీ కాబోలు. కానీ ఇవేవి వారి ప్రేమకు అడ్డం రాలేదు. అందుకే జాం జాం అని రెండేళ్ళు చెట్టా పటాలేసుకుని తిరిగారు.మొన్న అమ్మాయి కాలేజీలో పరీక్షలు రాస్తుంటే కాలేజీకి వచ్చి అమ్మాయి ని  పరీక్ష రాసిన తర్వాత బయటకు తీసుకు వెళ్ళాడంట . ముందు స్వీట్ షాప్ కు తీసుకు వెళ్లి స్విట్ తినిపించాడంట. ఆ తర్వాత తన పైనాన్స్ ఆపీసుకు తీసుకు వెళ్లి కాసేపు ప్రేమ ఊసులు చెప్పుకుని మదురోహల్లో తేలిపొయారట . ఆ తర్వాత కొంత సేపటికి అమ్మాయి తన మనసులో విషయం బయట పెట్టిందట. తనకు ఫైనలియర్ అయిపోతుంది కాబట్టి, ఇక ప్రేమకు పుల్స్టాప్ పెట్టి పెండ్లి చేసుకుంటే బాగుంటుంది అని అంటే , అబ్బాయి మాత్రం అందుకు ఒప్పుకోలేదట. దానితో అమ్మాయి అబ్బాయి మద్య అప్పటి దాక ఉన్న ప్రేమ పోర తొలగిపోయి , మాటా మాటా పెరిగి , చివరకు అబ్బాయి అమ్మాయి మీద కిరోసిన్ పోసి తగుల పెట్టాడట. ఆ తర్వాత చట్టం గుర్తుకు వచ్చి నలుగురితో కలసి అమ్మాయిని ఆటో లో తీసుకు వెళ్లి హాస్పిటల్ లో జాయిన్ చేసి , అమ్మాయి ఇంటికి అమ్మాయి కిరోసిన్ పోసుకుని ఆత్మ హత్య చేసుకోబోయిందని పోన్ చేసి , అక్కడనుండి పరారు అయ్యాడట. ఆ విదంగా చూపులతో కలిసిన ప్రేమ , కిరోసిన్ పోసి నిప్పు పెట్టడం తో ముగిసి పోయింది.

  ఆ తర్వాత కద మామోలే. పోలిస్ కేసు. అమ్మాయి పరిస్తితి విషమం గా ఉంది కాబట్టి మరణ వాంగ్మూలం తీసుకోవటం జరిగింది. అబ్బాయి అతని స్నేహితులు పరారీలో ఉన్నారు. అమ్మాయిని కన్న  తల్లి తండ్రులు శోక సముద్రం లో ఉన్నారు. తమ కూతురుని బ్రతికించమని దేవుళ్ళకు మొక్కు తున్నారు. అబ్బాయి తల్లి తండ్రులు కూడా ఆందోళన లో ఉండే ఉంటారు. తమ కొడుకు మీద కేసు ఏమి లేకుండా బయటపడాలని వారి దేవుడుని వారు కోరుతుంటారు. అదీ విషయమ్. ఈ  కేసులో అమ్మాయి , అబ్బాయి ఇద్దరూ మేజర్లే. ఇష్టపూర్వకంగానే ప్రేమించుకున్నారు. కానీ పెండ్లి దగ్గరకు వచ్చే సరికి అమ్మాయి కావాలంటుంది , అబ్బాయి వద్దంటునాడు. అదే విదేశాల్లో అయితే డేటింగ్ అయ్యాక  ఇద్దరికీ ఇష్టం ఉంటే వివాహం, లేదంటే లేదు. కానీ మన దేశం లో ప్రేమింఛి నోడు  పెండ్లి చేసుకోకపోతే ఆ అమ్మాయి పరిస్తితి కష్టమే. అందుకే ప్రేమించినోన్ని పెండ్లి చేసుకోమని కోరడం అమ్మాయిల  హక్కు గా మారింది. కాదన్న అబ్బాయిలు చీటింగ్ కేసులో బుక్ కాక తప్పదు. మరి ఇవ్వన్నీ ఆలోచించే ప్రేమలోకి దిగాలి అని చెప్పడం లో తప్పేముంది. పద్దతులు పారేనువి అయినా , బుద్దులు ఇండియాయే కాబట్టి, కచ్చితంగా ఆడపిల్లలు ప్రేమలోకి దిగకముందే, తాము ప్రేమిచబోయే వారు తలంబరాలు  పోసే వారో , కిరోసిన్ పోసే వారో  తెలుసుకుని ప్రేమ మొదలెడితే బాగుంటుంది. ఈ  సలహా  కుటుంభాలను  కాదని స్వేచ్చగా  విహరించాలనుకునే కాబోయే ప్రియురాళ్ళకు మాత్రమే సుమా! కుటుంబ కట్టుబాట్లలో ఉన్నవారి  గురించి పెద్దలు ఆలోచిస్తారు కాబట్టి , కొంత రక్షణ ఉంటుంది అమ్మాయిలకు.

   ఏది ఏమైనా ఇండియాలో ప్రేమ విషయం లో అమ్మాయి లు అబ్బాయిలు సమానం కాదని తెలిపే ఉదంతాలలో పైన చెప్పిన నల్గొండ జిల్లాలో జరిగిన ఉదంతం   కూడా  ఒకటిగా మిగిలిపోతుంది.
                                              (Republished. 18/12/2013)

Comments

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.