మొగుడు అంటే మోసేవాడు అని నిరూపించిన కేరళ అయ్యప్పన్ , ఒడిశా దానామాజీ !!!

                                                                       
 


                              భర్త అంటే భరించే వాడు అని భారతీయ సాంప్రదాయం లో పుట్టి పెరిగిన మగాళ్లు అందరికి తెలుసు. దానిని వేరొక రకంగా కూడా చెప్పవచ్చు . అదే "మొగుడు అంటే మోసే వాడు "అని కూడా . దానినే అక్షరాలా నిజం చేసి చూపారు భారతీయ సాంప్రాదాయం లో భాగమైన గిరిజన సంస్కృతీ పుత్రులు. నిజంగా భార్యా భర్తల బంధానికి మన సాంప్రాదాయం  ఎటువంటి నిర్వచనం ఇచ్చ్చిందో వీరిని చూసి తెలుసుకోవచ్చు . ఎందుకంటే ఇంకా ఆధునిక వాసనలు ఇంకా వీరికి అబ్బలేదు కాబట్టి పూర్వపు మనుషులు భార్యా భర్తల బంధానికి , కుటుంబ సంబంధాలకు ఎలాంటి విలువ నిచ్చారో, భార్యల పట్ల వీరు చూపిన ప్రేమ తో కూడిన   నిబద్ధతే సాక్ష్యం  . ఇక వివరాలు లోకి వెళితే ;
                                                                       
భార్యా శవాన్ని 10 కిలోమీటర్లు మోస్తున్న డానామాజీ! చోద్యం చూస్తున్న నాగరికులు. 



                                                      నిన్న సోషల్ మీడియాలో ఒక వార్త హల్ చల్ చేసింది . ఒరిసా కు చెందిన దానామాజీ ఒక గిరిజనుడు అతని భార్యా అర్దరాత్రి ప్రభుత్వాసుపత్రిలో  టీబీ వ్యాధితో మృతి చెందింది.. ఆ సమయం లో అతని వెంట అతని పన్నెండేళ్ల కూతురు తప్పా సహాయంగా ఎవరూ లేరు. సుదూరంగా స్వగ్రామం...ప్రభుత్వ వాహనం ఇవ్వలేదు...
లేటయితే శవం పరిస్థితి ఎలా ఉంటుందో...ఏం చేయాలి? తోచిందే చేశాడు దానామాజీ ...
శవాన్ని భుజంపై మోసుకుని బయలుదేరాడు ...
బీదలు ప్రభుత్వ ఆస్పత్రులలో మరణిస్తే వారిని ఇంటికి చేర్చేందుకు ప్రభుత్వమే వాహనసౌకర్యం కలగజేస్తుంది...
దేశంలోని ఏ రాష్ట్రంలోనయినా మానవతా దృక్పధంతో ఈ ఏర్పాట్లు ఉన్నాయి...
ఒడిషాలోనూ ఆ పథకం ఉంది సరికొత్త వాహనమూ ఉంది..కానీ ఎమ్మెల్యే ప్రారంభించకపోవడంతో అందుబాటులో లేదు...
దాంతో ఆ అభాగ్యుడు తన భార్య మృతదేహాన్ని 60 కి.మీల దూరం లో ఉన్న స్వగ్రామానికి భుజం పైనే మోసుకుంటూ బయలుదేరాడు...అలా పది కి.మీల దూరం దాకా నడిచాక స్థానిక రిపోర్టర్ చొరవతో కలెక్టర్ స్పంధించారు ఏర్పాట్లు చేశారు...

              కానీ ఆ పది కి.మీల దూరం దాకా జనం చోద్యం చూసారే తప్ప ఒక్కడైనా సాయం చెయ్యలేదు అంట . ఎందుకంటే మనకు నాగరికత నేర్పిన ఆధునిక సంస్కారం అది. చస్తున్నవాడికి గుక్కెడు మంచి నీళ్లు ఇవ్వడం కన్నా సెల్ఫీ లు తీసి ఫేస్ బుక్ లో పెడితే తద్వారా వచ్చే లైక్ లు వలన కలిజె కిక్కే వేరు అని తలపోసి తబ్బర సంస్కృతికి అలవాటు పడి పోయాం.

    బ్రతికుండగానే ముసలి తల్లి తండ్రులను పాతిపెట్టే సంతానం ఉన్న ఈ  రోజుల్లో ఇలా భార్య శవాన్ని తన స్వగ్రామం లోనే ఖననం చేసి ఆమె పట్ల తనకున్న ప్రేమతో కూడిన నిబద్ధతను చాటుకున్న దాసామాజి ని చూస్తుంటే,   2013 లో కేరళలో అయ్యప్పను అనే గిరిజనుడు చేసిన అపూర్వ సాహసం గుర్తుకు వస్తుంది కదూ ! ఆ సందర్భం లో ఇదే బ్లాగులో నేను రాసిన  పోస్టు ను యదాతదాంగా ఇస్తున్నాను. అది చదివితే ఆ గిరిజన భర్త తన భార్య పట్ల తనకున్న ప్రేమను ఎలా నిరూపించుకున్నాడో తెలుస్తోంది

   "  "నిజంగా ఇది ఒక అద్బుతమైన వార్త! మానవ సంబందాలు నాగరికత మాటున మ్రుగ్యమవుతున్న వేళ, కుటుంబ బందాలు, ఆర్థిక సంబందాలుగా చూడబడుతున్న వేళ, ఒక నిజమయిన బారతీయుడు అంటే నాగరికతకు దూరంగా బ్రతుకుతున్న కేరళ గిరిజనుడతడు. పేరు అయ్యప్పన్. ఇతను తన బార్య సుదతో కలసి "కోన" అడవుల్లో తేనే సేకరణ ద్వారా జీవిస్తున్నాడు. బార్యకు ఏడు నెలల గర్బం. హట్టాతుగా నెప్పులు వచ్చే సరికి దగ్గరలో వైద్య సదుపాయం లేక విలవిల లాడి పోయాడు. ఒక ప్రక్కన జోరున వాన. ఇంకొక వంక వాహన సదుపాయం లేని ప్రాంతం. క్షణం ఆలోచించిన బార్యా, లోపలి బిడ్డ దక్కడం కష్టమని బావించిన అయ్యప్ప ఆలస్యం చెయ్యకుండా, బార్యను బుజాన వేసుకుని, నడక మొదలెట్టాడు పట్నం వైపు. ఒకటి కాదు రెండు కాడు ఏకంగా నలబై కిలోమీటర్లు, అదీ అడవిలో ఏక బిగిన నడచి హాస్పిటల్కు బార్యను చేర్చాడట! పాపం బిడ్డను రక్షించలేకపోయినా, బార్యను మాత్రం కాపాడ గలిగారు డాక్టర్లు.

                                                                 


                                    ఇక్కడ మనం చూడాల్సింది అయ్యప్ప యొక్క నడక సామర్ద్యం గురించి కాదు. బార్య బిడ్డ మీద తనకున్న అంతులేని ప్రేమాను రాగాలు. నిజానికి జోరున కురిసే వానలో నలబై కిలోమీటర్లు ఒక గర్బవతిని ఎత్తుకొని రావడం ఆమె అరోగ్య పరంగా కూడా రిస్క్తో కూడుకున్న పనే అయినప్పటికి గత్యంతరం లేని పరిస్తితిలో అతను చెయ్యగలిగింది చేశాడు.బార్యా బిడ్డల్ని హింసించే బడుదాయిలు, ఈ బారతీయున్ని చూసి సిగ్గు పడాల్సిందే!

   మనం సినిమాల్లో సూపర్ మాన్, స్పిడర్ మాన్లు చేసే సాహస ఘట్టాలు చూసి అబ్బురపడుతుంటాం.  కాని అటువంటి అద్బుతాలు చేసే వారు కుటుంబ రక్షణకు అవసరం లేదు. అయ్యప్పన్ లాంటి "ఫామిలీ మాన్" ప్రతి ఇంటిలో ఉంటే అంతకు మించిన అద్రుష్టం ఆ కుటుంబ సబ్యులకు ఏం కావాలి! గ్రేట్ అయ్యప్పన్ ! హాట్స్ ఆఫ్ యూ! ""(సూపర్ మాన్,స్పైడర్ మాన్ లు కాదు, మనకు కావలసిందీ ఈ "ఫ్యామిలి మాన్" లు మాత్రమే!)

                   కాబట్టి  భారతీయ సాంప్రాయాదాయం ప్రకారం భర్త అంటే భరించే వాడు అని అర్ధమైతే ,అందులో భాగమైన గిరిజన సాంప్రదాయం ప్రకారం " మొగుడు అంటే మోసే వాడు " అని పై ఇద్దరు మొగుళ్ళు నిరూపించారు. బ్రతుకులో నైనా చావులో నైన భార్యబంధాన్ని మోసే వాడే నిజమైన మొగుడు . అలాంటి వాడే ఆలీకి హీ  మాన్ అయితే ఎంటైర్ ఫ్యామిలీకి "ప్యామిలీ మాన్ ".

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!