గోపిచంద్ గారు లాంటి గురువులు ఉన్నంత కాలము, P.V. సిందూ లాంటి క్రీడా తారలు మిల మిల మెరుస్తూనే ఉంటారు!!!


             అటు ప్రభుత్వ దన్ను , ఇటు గురువు ఆశీర్వచనం ఉంటే ఇటువంటి పతకాలు ఎన్నో !!.

                                              ఈ దేశం లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో స్కానింగ్ ల ద్వారా ఆడ  శిశువుల  ఆచూకీ కనుక్కుని వారిని హతమార్చే దుష్ట సంస్కృతీ ఉంది. దీనికి తండ్రులది ఎంత పాపపు బాధ్యతో అంతకంటే ఎక్కువ బాధ్యత తల్లులది . అదిగో అలాంటి పాపపు తల్లి తండ్రులను వరుసగా నిలబెట్టి , మొన్న ఒలంపిక్స్ లో విజయం సాధించిన భారత క్రీడాకారిణులు ఇద్దరు సింధు మరియు సాక్షి మాలిక్   ల కాలి చెప్పులతో సత్కారం చేస్తే కానీ వారికి బుద్ధి  రాదు. మన రాష్ట్రం మరియు హరియానాకు చెందిన ఆ ఇద్దరు ఆడ  పిల్లలు  ఒకరు రజతం , మరొకరు కాంస్య పతాకం సాధించినందు వలననే అంతర్జాతియ ఒలంపిక్స్ క్రీడా మైదానం లో మన దేశం యొక్క జాతీయ గీతం ఆలకించే  భాగ్యం దక్కింది. 125 కోట్లమంది ప్రజలు ఉన్న ఒక దేశం రియో  ఒలంపిక్స్ 2016 లో కనీసం ఒక స్వర్ణం  వచ్చినా బాగుండు అనే దౌర్భాగ్యపు పరిస్థితికి నెట్టబడింది అంటే దానికి ఎవరు కారణం ?

                                                                     
సింధు ఎత్తింది అమ్మోరి బోనం మాత్రమే కాదు ,రెండు  తెలుగు రాష్ట్రాల కీర్తి పతాకాలు కూడా                          మన దేశం  జనాభా పరంగా గొప్పదేశం . 125 కోట్లమందిమి మేము అని ఘనంగా ఎలుగెత్తి  చాటుకుంటాం. కానీ అంతర్జాతీయ క్రీడా పోటీల వేదిక  అయిన ఒలంపిక్స్ క్రీడల విషయం వరకు వచ్చే సరికి కనీసం లక్షల జనాభా ఉన్న దేశాలు సాధించిన పతకాలు కూడా మనం సాధించలేని పరిస్థితి. ఎందుకయ్యా ఈ  దౌర్బాగ్యం  అంటే అడగల సత్తా ఉన్నా పిల్లలు మనకున్న్నా వారికి తగినంత ప్రోత్సాహం ఇచ్చే రాజకీయ రహిత ప్రభుత్వాలు కానీ , నైపుణ్యత గల గురువులు కానీ లేకపోవడమే అని నా అభిప్రాయం.


                      వజ్రం గనిలో  ఉన్నంత సేపు వాటికి ఉండే విలువ తక్కువ. కానీ ఒక సారి అదే వజ్రాన్ని జాగ్రత్తగా సానపెట్టి మార్కెట్లో పెడితే వాటి విలువ కోట్లలో కూడా ఉండవచ్చు .  అదే కోట్ల విలువ చేసే వజ్రాన్ని సైతం సానపెట్టడం లో నైపుణ్యం లేని వారి చేత సానపెట్టిస్తే అది పాడయి  దాని విలువ జీరో కూడా అయ్యే ప్రమాదముంది. అంటే ఒక వజ్రపురాయి  విలువ ఇనుమడించాలి అంటే అందుకు సరి అయినా నై పుణ్యం కల  సానపెట్టే నేర్పరి కావాలి . ఇదే సూత్రం అంతర్జాతీయ క్రీడాకారులకు, వారి శిక్షణ ఇచ్చే కోచ్ లకు కూడా వర్తిస్తుంది.
                                                                     
                                ఆడబిడ్డయితే ఏమి ? కన్నవారి మోముల్లో నవ్వులు పూయించిన బంగారు తల్లి
   
                   హైదరాబాద్ కు చెందిన "పుల్లెల గోపిచంద్ బాడ్మింటన్ అకాడెమి " వ్యస్థాపకులు అయిన గోపిచంద్ గారి కృషివలననే హైదరాబాద్ కు చెందిన నేటి ఒలంపిక్స్  రజత పతక విజేతగా  సింధు విజయం సాధించగలిగింది . సింధు లో ప్రతిభ ఉంది . కానీ నైపుణ్యం కలిగిన కోచ్ లేకుంటే ఎంత గొప్ప క్రీడాకారుడైనా అంతర్జాతీయ క్రీడా మైదానాలలో నిలబడటం కష్టం . ఇదే విషయాన్ని స్వయంగా గోపిచంద్ గారే చెప్పారు. తనకు సరి అయినా కోచ్ సహకారం లేనందువలనే 2000 సిడ్నీ ఒలంపిక్స్ లో విజయం సాధించలేక పోయాను అని అన్నారు . అందుకే  ఎన్నో కష్ట నష్టాలకోర్చి ప్రభుత్వం ఇచ్చిన 5 ఎకరాల భూమిలో తన పేరుమీదే బాడ్మింటన్  ఎకాడెమి  పెట్టి ఎంతో మంది జాతీయ , అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారుచేసారు . వారందరిలో మేటి నిన్నటి ఒలంపిక్స్ విజేత , తెలుగుబిడ్డ సింధు. పతకం కోసం ముఖం వాచిపోయి చూస్తున్న తరుణం లో రజతం సాధించిన సింధును , ఆమెకు తర్పీదు ఇచ్చిన పుల్లెల గోపిచంద్ ను ఎన్ని రకాలుగా సత్కరించినా , కొనియాడిన తక్కువే. అందుకే నిన్న తెలంగాణా ప్రభుత్వం , నేడు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం  భారీగా సత్కారాలు చేస్తోంది.

                                                                       
                                                    125 కోట్ల మంది పరువు నిలిపిన  సాక్షి మాలిక్ .
 
                           ఇప్పటికైనా భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరచి, ప్రజలకు ,క్రీడాకారులకు క్రికెట్ మీద ఉన్న మోజు తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలి. పిల్లలకు స్కూల్ స్థాయి నుంచే అత్యుతమ శిక్షణ అన్ని క్రీడలలో అందేలా చూడాలి. ప్రతి జిల్లాలో ,రాష్ట్రం లో అత్యుత్తమ సౌకర్యాలు , కోచ్ లు కలిగిన సర్వ క్రీడా ఎకాడెమీలు ఏర్పాటు చేయాలి . క్రీడాకారుల కోటను విద్యా , ఉద్యోగ రంగాల్లో పెంచాలి. మనం దేశ జనాభాలోనే కాదు , క్రీడా సామర్థ్యం లోను ప్రపంచ స్థాయి లో ఏ మాత్రం తక్కువ కామని నిరూపించుకోవాలి.

  రియో   ఒలంపిక్స్ 2016 లో రజత, కాంస్య పతక విజేతలు అయిన భారత సివంగులు  P.V సింధు మరియు సాక్షి మాలిక్ లకు శుభాభినందనలు , వారిని కన్న తల్లితండ్రులకు, క్రీడా విద్యనేర్పిన గురువులకు అనంతకోటి నమస్కారాలు .

         

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

తిరుమల దేవస్థానం వివాదాన్ని, కమ్మ ,బ్రాహ్మణ సామాజిక వర్గాల మధ్య జరిగే వివాదంగా చూడటం ఎంతవరకు సమంజసం?

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

15యేండ్ల అమ్మాయి పొందు కోసం , పెళ్ళానికి విడాకులు ఇచ్చేస్తాను అన్న "పాస్టర్ "!.

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )