మనిషిని "రోగి"ని చేసి,"రోడ్లు" మీద పరిగెత్తిస్తుంది ఎవరో తెలుసా?





                         ఇంకెవరు? మనం ఎంతో గొప్పదని చెప్పుకుని మురిసి పోతున్న మన సాంకేతిక పరిజ్ణానం.అదేమిటి అని ఆశ్చర్య పోతున్నారా? చూడండి ఎలాగో!

  వెనుకటి రోజుళ్ళో ఒక చిన్నదో, పెద్దదో ఎవరి స్తాయికి తగ్గటు వార్కిఒక  ఇల్లు ఉండేది.ఇంటికి ముందూ, వెనుక కోంత ఖాళి స్తలంఉండేది.ఇంటిలో ఒక చేద బావి ఉండేది.పొద్దునే సూర్యోదయానికి ముందే  లేచే అలవాటు అందర్కి ఉండేది.

               లేవగానే చీపురు పట్టి, వళ్లు వంచి,ఇంటి ముందు, వెనుక ఊడ్చే వాళ్ళు.అదొక పావుగంట  పని. కళ్ళాపి చల్లి, అందంగా  ముగ్గులు వేసేవారు. పశువులు ఉంటే వాటి దగ్గర శుబ్రం చేసి,వాటి పాలు పిండి ఆడవాళ్ళు తమ ఉదయం పనులు తెమిలే సరికి రెండు గంటలు గడిచేవి. ఇక మగాళ్ళు అయితే చేద బావి లోనుంచి నీళ్ళు తోడి,గాబుల నిండా నీళ్లు నింపేవారు. ఆ తర్వాత ఇంటి పెరట్లోని కూరాగాయల మొక్కలకు,పూల మొక్కలకు, నీళ్ళు పోసే వారు.పొలం పనులు ఉంటే పొలాలకు వెళ్లే వారు, అది లేని వారు స్త్రీలకు పనులలో సహాయం చేసే వారు. ఈ విదంగా రోజు ఉదయం పూట కనీసం 2 గంటలైనా తమ శ్రమ్ శక్తిని,తమ ఇంట్లో వినియోగించే వారు.

                         పై విదంగా వారు కష్టపడటం వల్ల, వారికి దక్కేది, స్వచ్చమైన పాలు,తాజ కూరగాయలు,అన్నిటికి మించి సంపూర్ణ ఆరోగ్యం. మరి మనకు సాంకేతి(క్క) పరిజ్ణానం  పెరిగాక, బావులు పూడిపోయాయి.మోటర్ పంపులు వచ్చాయి.ఇండ్లు బదులు అపార్ట్మెంట్లు,పెరడ్లు మాయం,గొడ్ల స్తానం లో మిల్క్ పాకెట్లు ఇలా మనం కష్టపడాల్సిన అవసరం లేని వసతులు వచ్చేసాయి.అంతటితో ఆగితే బాగుండేది. లేని పోని "రోగాలు" వచ్చేసాయి.

 ఇక డాక్టర్ల దగ్గరకు వెళితే పెద్ద మందుల చీటితో పాటు రోజు వ్యాయమం "మస్ట్" అనే సరికి, బ్రతకడానికి మళ్ళి కష్ట పడక తప్పట్లేదు. కాక పోతే రూపం మారింది.కాళ్లకు ఆటగాళ్ళ బూట్లు, వేసుకుని చీకటితో లేచి,ఇక రోడ్డు మీద పరుగులు తీస్తుంటే నా సామి రంగా మనం కూడా పరుగు పందాళ్ళొ పాల్గొనే,క్రీడాకారుల్లాగా అదొక ఫీలింగ్.

 ఈ విదంగా మన శ్రమని(వ్యాయమం శ్రమ దానం లాంటిదే మరి) రోజు ఒక గంట పాటాయిన రోడ్ల మీద వేశ్ట్ చేసి అయ్యా!,,,అమ్మా, ఈ రొజుకి బ్రతికామురా నాయానా! అనుకుంటూ వస్తుంటే ఏమనిపిస్తుంది? నిజం చెప్పండి?
మనకు సాంకేతికత తెలియక ముందు మన శ్రమ మన ఇంటికి, వంటికి ఉపయోగపడితే, సాంకేతిక పెరిగాక మనకు ఆరోగ్యం లేక పోగా (ఎందుకంటే తాజా కూరగాయలు,స్వచ్చమైనా పాలు,పండ్లు  డబ్బులు పోయిన దొరకడంలేదు సరికదా అన్నింటిలోనూ కల్తీలే ఉంటున్నాయి మరి)  మన శ్రమ రోడ్ల పాలవుతుంది. అంతేనా, అలా శ్రమ పడలేక ఎవరి వొళ్లైనా కొవ్వు పెరిగితే, మళ్లి డాక్టర్లే తమ పెరిగిన సాంకేతికపరిజ్ణానం తోనే మనిషిని"కోసి,కొవ్వు తీస్తున్నారు". అకటా ఎంత టి దుర్గతి!

 కాబట్టి ఓ ప్రజలారా! ఇప్పుడు చెప్పoడి దీనంతటికి కారణం మన సాంకేతిక పరిజ్ణానం కాదా ? ఇప్పుడు మనం ఏమి చెయ్యాలి. ఏముంది, చూసి మురవడం!చెప్పుకుని ఏడ్వడం! లేదంటే బ్రతకాలి కాబట్టి" పరిగెత్తు, బాబూ!,పరిగెత్తు.! అహ!అహ! అహ! 
                                                (19/11/2012 Post Republished). 

Comments

  1. Replies
    1. దన్యవాదాలుANALYSIS గారు.

      Delete
  2. సాంకేతికత వలన మంచి,చెడు రెండూ ఉన్నాయి.మీరు చెప్పిన కారణంతో పూర్తిగా ఏకీభవిస్తున్నా.

    ReplyDelete
    Replies
    1. దన్యవాదాలు Unknown గారు.

      Delete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం