"లేచి పోయే రాజెశ్వరీలు ,కసెక్కి పోయే కామేశ్వర రావులు" ఉన్నంత కాలం జి.కొండూరు లాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి!.





                                               స్తీ వాదం పేరుతో  ఎంతో మంది రచనలు చేసి ఉంటారు. అందులో అందరిది ఒకటే బాధ .సంసార స్త్రీకి సంసారంలో  భర్త ఆదరణ తగినంతంగా లభించని వారు దాని కోసం వేరొకరితో లేచిపోయినా తప్పు లేదని తేల్చెయ్యడానికే మొగ్గు చూపారు. సెక్స్ విషయంలో సమాజంలో పురుషునికి ఉన్న స్వేచ్చ స్తికి లేదని అందువల్ల స్తికి చాలా అన్యాయం జరుగుతుందని స్తివాదుల ఆరోపణ. వీరికి "వీర గురువైన "చలం" గారు లేకపోయీనా ఆయన అందించిన  మైదాన సాహిత్యం ఇంకా ఆదుకుంటూనే ఉంది. కొంతమందిని చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. తప్పు అనేది ఎవరు చేసినా తప్పే. దానిని ఖండించడంలో తప్పులేదు. కాని మగవాడు తప్పు చేస్తున్నాడు కాబట్టి ఆడదానికి ఆ స్వేచ్చను ఇమ్మని అనడం ఎంత దిగజారుడు తనం!

   మనిషి అన్నాకా బలహీనతలు ఉంటాయి. కాని ఆ బలహీనతలు సంసారాలు పాడు చేస్తాయి కాబట్టే దానికి నియంత్రణలు అవసరం. ఇందులో ఆడ మగ అనే బేదం ఉండటానికి వీలు లేదు. వ్యవ సాయం చెయ్యడానికి గిత్తలకు "వ్రుషణ నియంత్రణ" చేస్తారు. అవి ఎద్దులుగా మారి వ్యవసాయం చెయ్యడానికి ఉపయోగ పడతాయి. సంతానోపత్తి కోసం కొన్నింటిని వదలివేస్తారు అవే "ఆబోతులు". వాటికి శ్రుంగార స్వేచ్చ ఎక్కువ. ఎందుకంటే వాటిని అందుకోసమే వదలి వేశారు కాబట్టి. పశువులను మనిషి నియంత్రిస్తున్నాడు కాబట్టి  వ్యవసాయం నడిచింది. కాని మనుషులకు ఆ ఫెసిలిటీ  లేదు. ఈ భూమి మీద ఏ జీవికి లేని  ఒక అలవాటు మనిషికి ఉంది. అదే సెక్స్ ని సంతానం కోసమే కాక తరచూ ఆనందించే సాదనంగా ఉపయోగించడం. ఇది  ప్రక్రుతి  నిర్ణయం కాదు .ఖచ్చితంగా మానవుడు కోరి కోరి అలవర్చుకున్నది. అందుకే కాల క్రమేనా సెక్స్ ఎంటర్తైన్మెంట్ గాను, స్త్రీ ఒక సెక్స్ బొమ్మగాను మారిపోయారు. ప్రపంచం మొత్తం మీద ఈ నాడు స్తిలను పురుషుడితో సమానంగా చూడలేక పోవటానికి కారణం "సెక్స్" అనేది ఎంటర్టెఇన్మెంట్ జాబితాలో ప్రదాన భూమిక పోషించడమే.

  చలం గారు ఆయన తోక రచయితలు రాసే" లేచిపోయిన  రాజేశ్వరి "లాంటి  కదలు  చదివి , తమకూ  సంసారంలో సౌక్యం లేదని  స్తిలూ తమకు ఇష్టం వచ్చిన వారితో లేచిపోతే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో , నిన్ననే జరిగిన జి.కొండూరు ఘటన తెలియ చేస్తుంది.

   ఆమే పెళ్ళైన వ్యక్తి. కాని సంసారంలో దొరికే సఖం చాలక ఆ వూరిలోని ఒక వ్యక్తితో లేచిపోయి కేరళ వెళ్ళి అక్కడ అమెకు సంసారం లో దొరకని దానిని తనవి తీరా పొందుతుంది. సాదారణంగా సామాజిక బాద్యత తెలిసిన వారెవ్వరూ ఒకరి సంసారాన్ని నాశనం చెయ్యాలని చూడరు. కాని "లేచి పోయే రాజేశ్వరీలు" కనిపిస్తే కసెక్కి పోయే కామేశ్వర రావులు వెంటనే తయారు అవుతారు. అటువంటి కామేశ్వర రావులు స్వంత  స్త్రీల పట్ల ఏడ్చేది ఏమి ఉండదు. పొరుగింటి పుల్ల కూరల మీద మోజు ఎక్కువ!అందుకే డబ్బు దస్కమ్తో ,తనతో లేచి రావడానికి ఎవరు రడిగా ఉన్నారా అని గుంట నక్కల్లా చూస్తుంటారు. అలా చూసిన వాడితోనే కోండూరు ఘటనలో ఇల్లాలు వెళ్లింది అనుకుంట!. కాని అలా కొద్ది రోజులు గడిచేసరికి ఆమేకు ఆ కామేశ్వర రావుతో లభించే సుఖం సరిపోలేదో, లేక భంగారం లాంటి సంసారం పాడుచేసుకున్నాను అని గ్రహింపుకు వచ్చిందో తెలియదు కాని కేరళ లో నిద్రమాత్రలు మింగి ఆత్మ హత్యకు పాల్పడితే, అక్కడి చుట్టు ప్రక్కల వారు ఆమెను కాపాడి, విషయాన్ని పోలిసులకు చేరవేశారు. కేరళ పోలిస్ ద్వారా జి.కొండూరు పోలిస్కి ఇన్పర్మేషన్ రావడం, అప్పటికే రాజేస్వరి భర్త పోలిస్ కంప్లెంట్ ఇచ్చి ఉన్నందు వల్ల, ఇక్కడి పోలిస్ సహాయంతో ఆమే తిరిగి ఇంటికి చేరుకోవటమ్ జరిగింది. అయితే సదరు కామేశ్వరరావు, ఆత్మ హత్య చేసుకున్నడట!. అతని శవం రైల్ పట్టాల ప్రక్కన గుంటూరు జిల్లాలో దొరికిందట. దీనికి ఆగ్రహించిన అతని బందువులు కొండూరు పోలిస్ స్టేషన్ మీద దాడి చేసి, తమ కొడుకు చావుకు కారణం పోలిస్ వారేనని చెప్పి, యస్.అయి. ని పోలిసులను చితగొడితే అది త్రెలుసుకున్న సి.ఐ. వచ్చి కాల్పులు జరిపితే నలుగురికి బుల్లెట్లు తగిలి హాస్పటల్లో విషమ పరిస్తితుల్లో ఉన్నారట. ఇక అసలే పంచాయతి ఎన్నికలు దగ్గర ఉన్నాయి సహజంగానే రాజకీయ పార్టిలు పూసుకుంటాయి కాబట్టి అది ఇప్పుడు మొత్తం స్తేట్ ఇస్స్యూ గా మారుతుంది.

  చూసారా ఈ లేచి పోయే రాజేశ్వరీలు, కసెక్కి పోయే కామేశ్వర రావులు వల్ల అటు పచ్చని సంసారాలే కాదు మొత్తం సమాజమే అల్లడి తల్లడి అవుతుంది. ఇంట్లో సుఖం లేని వారు గౌరవంగా  విడాకులు తీసుకుని తమకు నచ్చిన వారితో ఏ ప్రేమ దేశాలకో, "ఎయిడ్స్ అయిలాండ్లకో" వెళ్ళవచ్చు. కాని మీ రంకు అభిలాషని సమాజానికి రుద్దాలనుకుంటే రైల్ పట్టాల మీద తల పెట్టడమే  అవుతుంది అని గుర్తుంచుకోవడం మంచిది.   

                                         (8/7/2013 Post Republished).
    

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!