5 గురు కలసి అమ్మాయిని "గాంగ్ రేప్ " చేసిన వాళ్ళు "భాయ్ ప్రెండ్లు " అవుతారా?

                                                               
 


                                                            వేయి గంగా నదులు నీరు తెచ్చి కడిగినా ప్రస్తుత భారతీయ సమాజం లోని మలినం తొలగిపోయేలా లేదు. ఈ  సమాజాన్ని మతిమాలిన స్వేచ్చా విదానాలు, కట్టుబాట్లు లేని పిల్లల పెంపకాలు, బ్రష్టు పట్టి పోతున్న కుటుంబ సంబందాలు అన్నీ, అన్నీ కూడి  సర్వ నాశనం చేస్తున్నాయి. పట్టుమని పదిహేనేళ్ళు దాటని మగ పిల్లలు ఆడపిల్లలను గాంగ్ రేప్ లు చేసే హీన స్తాయిలో ఈ  సమాజం ఉందంటే, దానికి కారణO  ఎవరు? ఇప్పుడు సమాజం లో ఏమి జరుగుతుందో తెలియక ఎప్పుడో సమాజం లో ఉన్న దురాచారాలు , వాటికి కారకులైన పూర్వికులను నిరంతరం తిడుతూ , సమాజం లో మరింత విశ్రుంఖల మైన స్వేఛా  బావ  వ్యాప్తికి కారకులవుతున్న ఆదునిక వాదులా ? , పరిస్తితులకు అనుగుణంగా సంస్కరణలు చేపట్టి సమాజాన్ని మార్చుకునే ప్రయత్నం చేయకుండా , ఎప్పుడో తమ తాతలు చెప్పిన దానినే వల్లెవేస్తూ, పరమ చాందసంగా ప్రజలు త్రుణికరించే బావాలను ఇంకా సజీవంగా ఉంచాలనుకునే చాందస వాదులా? నన్నడిగితే అటు ఆదునిక వాదులు, ఇటు చాందస వాదులు ఇరువురూ ఈ  సమాజాన్నిఎంతవరకు దిగజారా లో అంతవరకు దిగజరేలా చేస్తునారు .

  ఒక సమాజం లో సంస్కరణలు  అనేవి  ప్రజలకు  మంచి చేయడానికే  రూపొందించబడతయి. కానీ అవే సంస్కరణలు కాలాంతరంలో ప్రజలకు ఉపయోగపడక పోగా చెడు చేసే విదంగా మారి పోవచ్చు. మరి అటువంటప్పుడు పాత  సంస్కరణలను సమీక్షించి  ప్రస్తుత పరిస్తితులకు అనుగుణంగా వాటిని మార్చాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు కొంచం ఈడు వచ్చిన ఆడపిల్లలను తన తోటి మగపిల్లలతో కలసి తిరగడ్డాన్నీ తప్పు పట్టేవారు పెద్దలు. అది స్త్రీ  స్వేచ్చా వికాసానికి పనికి రాని సాంప్రదాయం అని కో ఎడుకేషన్ పద్దతిని ప్రోస్తాహించి ఆడపిల్లల , మగపిల్లల మద్య స్నేహాలను ఆమోదించారు. కానీ ఈ  ఆడ మగ స్నేహాలు విదేశాలలో సక్సెస్ అయితే అయి ఉండవచ్చు కానీ, ఈ  సమాజం లో మాత్రం  స్త్రీల రక్షణకు పెను సవాలుగా మారిపోతున్నాయి. కొన్ని ఉదాహరణలు చెపుతాను.

       ఈ  మద్యనే ఖమ్మం దగ్గర పల్లెటూర్లో ఒక 5 యేండ్ల పాపను ఆదుకుందాం రా  అని చెప్పి, పక్కింటి 13 ఏండ్ల కుర్రాడు రేప్ చేసాడు. దానికి ఆ పాప ఆరోగ్య పరిస్తితి అందోలనగా మారింది. ఇలా మన రాష్ట్రం లో అనేకం జరిగాయి.  ఇది ఒక్క మన రాష్ట్రం అనే కాదు దేశ వ్యాప్తంగా ఈ  పిల్ల మృగాల్ల సంఖ్య అదికమవుతుంది. నిన్న ఆస్సాం లో ఒక 12 ఏండ్ల అమ్మాయిని బాయి ప్రెండ్ ఒకడు బయటకు ఆటల నెపంతో తీసుకు వెళ్లి అక్కడ ఇంకొక నలుగురుతో కలసి ఆ అమ్మాయిని గాంగ్ రేప్ కు గురి చేసారు. పాపం ఆ అమ్మాయి తనకు జరిగిన అమానుషాన్ని ఇంటికి వచ్చి తల్లి తో  చెపితే ఆమె పోలిస్ కంప్లైంట్ ఇచ్చింది. దానికి పోలిసులు వారిని పట్టుకుని అరెస్ట్ చేస్తే తాము మైనర్లమని క్లైం  చేసారట!  అంటే వారికి 3 యేండ్లకు మించి శిక్ష విదించే అవకాశం లేదు. రేప్ లు మాత్రం చేసేటప్పుడు మేజర్ల లాగే ప్రవర్తించినా , కేసులు వరకు వచ్చే సరికి మైనర్లు  గా చట్ట రక్షణ పొందుతున్నారు. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే ఆ అమ్మాయికి తండ్రి లేనట్లుంది. ఇది కూడా  ఆ పిల్ల మ్రుగాళ్ళకు అలుసుగా మారి ఉండవచ్చు. మరి ఇంత దారుణమైన విదంగా చిన్న పిల్లల స్తాయి నుంచే మగవాళ్ళు తమ "మగ బుద్దిని" ని ప్రదర్శిస్తుంటే వారి నుంచి ఆడపిల్లలను కాపాడటానికి కావల్సింది జాగర్తలతో లేక అంక్షల తో కూడిన కట్టుబాట్లా? లేక ఇంకా విశ్రుంకలత్వాన్ని ప్రోస్తాహించే పనికి మాలిన వాదాలా?

    నిజమే! స్త్రీ వాదులు అంటున్నట్లు ఈ  దేశం లో   మగవాడి బుద్ది  ఎదగలేదు అనే అనుకుందాం. మరి ఎదగని ఆ మగవాడి తో స్త్రీలు ఎంత జాగర్తగా ఉండాల్సిన అవసరం ఉంది? అలా జాగర్తలు తీసుకోవమని చెపితే అంతలా సాంప్రదాయక వాదులు మీద ఎగిరి పడడం ఎందుకు? ఇంగిత జ్ఞానం లేకుండా , స్వేచ్చా ఉందని చెప్పి నడిస్తే , ఆ తర్వాత జరిగే పరిణామాలకు నిందితులను మహా అయితే కఠినంగా శిక్షించడం తప్పా , చట్ట పరంగా ఎవరేమి చేయగలరు? మరి ఈ  కఠిన శిక్షలు మగవారిలో మార్పు తెస్తాయ? తెస్తే అది ఎంత కాలం పడుతుంది? అలా మార్పు వచ్చే దాక ఎంతమంది ఆడబిడ్డలు అన్యాయం కావాలి . కాబట్టి ఇది పనికి రాని  స్త్రీ వాదం. నా అభిప్రాయం ఏమిటంటే స్త్రీ రక్షణకు బలమైన కుటుంభ వ్యవస్త ఉండి తీరాలి. అటు స్త్రీలను, ఇటు పురుషులను సత్పౌరులుగా తీర్చిదిద్దడానికి, అంక్షలు తో , నిరంతర పర్యవేక్షణతో , క్రమశిక్షణతో మెలిగేలా చేయగలిగింది కుటుంబ వ్యవస్తే.రేప్ లకు గురి అవుతున్న స్త్రీలు మరియు మృగాల్ల కుటుంబ నేపద్యాలు పరిసీలిస్తే ఐ విషయం మనకు అవగతం అవుతుంది. . కానీ దానిని కూడా  సర్వ నాశనం చేస్తుంది సో కాల్డ్ ఆదునిక స్త్రీ వాదం.ఒక స్త్రీ వాది, మన సమాజంలో   పరాయి మగవాళ్ళు రేప్ ల కంటే కుటుంబంలో తండ్రులు , బాబాయిలు  లాంటి కుటుంబ సబ్యులు చేసే నీచ ప్రవర్తనలే ఎక్కువ అని భారతీయ కుటుంబ వ్యవస్తనే గేలి చేసింది . ఆమే పేరు షోమా ఆనంద్ .దీ గ్రేట్ తెహల్కాపత్రిక మేనేజింగ్ ఎడిటర్. ఆమె ఏమందో ఒక సారి  చూడండి .

" భారతదేశంలో ఇప్పటికే అత్యాచారాల సంఖ్యను తగ్గించి చెబుతున్నారు. దాని వెనుక కనీసం ఉందని కూడా అంగీకరించని ఒక ఇతర హింసా ప్రపంచమే దాగి ఉందని ఎవరు గుర్తించేది? కేవలం ఒక తెల్ల బస్సులోని హింసోన్మాదులే రేపిస్టులు కానవసరం లేదు: తండ్రులు, భర్తలు, సోదరులు, బాబాయిలు, స్నేహితులు వీరు కూడా. తమ సొంత ఇళ్లలోనే, నాలుగు గోడల మధ్య తమను అసహ్యంగా తాకిన, అభిమానాన్ని భంగపరిచిన, చెప్పలేని విధంగా వేధించిన, అత్యాచారానికి గురయిన కధ –చెప్పినవి, చెప్పనివీ- దాదాపు ప్రతి ఇద్దరిలోనూ ఒక స్త్రీకి ఉంటుంది. దాని గురించి వారు ధైర్యం చేసి చెప్పడం అంటూ జరిగితే, దాన్ని సమాధి చేసి భరించి ఊరుకొమ్మని చెప్పి నోరు మూయిస్తారు. స్త్రీ జీవితంలో అదొక భాగంగా మారిపోయింది. అంకుల్ తనను వేధిస్తున్నాడని ఒక మైనర్ బాలిక పేరు పెట్టి చెప్పడం అంటే అది కుటుంబాన్ని బజారుకి ఈడ్చడమే. ఇక వైవాహిక అత్యాచారాల సంగతి చెప్పుకోవాలంటే అది మన ఊహా శక్తిని దాటిపోతుంది. మహిళలకు సంబంధించి మన పశుత్వ భావనలు ఎంతదూరం వెళ్తాయంటే సమాజం చీదరించుకునే ఒంటరి బతుకుకంటే రేపిస్టును పెళ్లి చేసుకోవడమే ఉత్తమమైన విముక్తి మార్గం అని న్యాయమూర్తులే తరచుగా సలహా ఇస్తున్నారు."(జాతీయ , అంతర్జాతీయ వార్తలు , విశ్లేషణ బ్లాగు నుండి) . 

 ఈ విదమైన పనికి రాని  వాగుడు వాగి , ఇంట్లోని సబ్యులను వీది రౌడీలు కంటే అత్యంత జుగుప్సాకరంగా పోల్చి, కుటుంబం అనేది స్త్రీలకు పనికి రానిదని తేల్చి పారేసింది. మరి ఇదే మహిళ తన యజమాని అయిన తరుణ్ తేజ్ పాల్ తన తోటి ఉద్యోగినిపై లైంగిక వేదింపులకు పాల్పడితే , అతన్ని టెక్నికల్  గా రక్షించాలని చూస్తుంది . ఇలా ఉంటాయి స్త్రీవాదుల  స్వార్దాలు .

కాబట్టి  కుటుంభ వ్యవస్థ బల హీనమయితే మొదటి నష్టం స్త్రీలకే  అన్నది గుర్తుంచుకుని మెలగితే అందరికీ మంచిది.లేదు అనుకుంటే స్త్రీ వాది షోమా ఆనంద్ సెలవిచ్చినట్లు ఇతర శారీరక గాయాలు వలనే , రేప్ కూడా  ఒక శారీరక గాయం గా బావించాలి అనుకునే వారు , ఇండియాలో కాకుండా అండమాన్ నికోబార్ దీవులలో ఒక దీవిని చూసుకుని(అక్కడ వేయి దీవులు జన రహితంగా ఉన్నాయట) , కుటుంబ రహితంగా " హుక్కా పార్టీలు" మాదిరి , ఏ ఆంక్షలు లేని ఆనందకర జీవనం కొనసాగించవచ్చు. 

                                                           (27/11/2013 Post Republished).

  

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం