మచ్చలు లేని అరటి పండు , మానవత్వం లేని శాస్త్రీయ ట్రెండ్ , హానికరమే !!!?

                            
                                                                                     

                                        క్రైస్తవుల  పవిత్ర గ్రందం అయిన బైబిల్ లో ఒక కధ ఉంది . సృష్టిలోని అది మానవులు అయిన ఆదాం , అవ్వలు దేవుని అజ్ఞ మేరకు "ఎదేన్స్" వనం లో స్వేచ్చ గా , దిగంబరంగా ఏ అరమరికలు లేకుండా సంచరిO చేవారు . వారు కోరిన పలములు , తియ్యనివి తింటూ ఆ వనం లో ఉండేవారు . అయితే వారిని ఎలా అయినా దేవుని శాపానికి గురి చేయించి , తన అధినంలో ఉంచుకోవాలని బావించిన సైతాన్ "సర్ప" రూపo లో వారి వద్దకు వచ్చి వారిని ప్రలోభపరచి , దేవుడు తినవద్దని సూచించిన "జ్ఞాన ఫలం" తినేలా చేస్తాడు . దానితో వారికి జ్ఞాన నేత్రం లు తెరచుకుని ,తాము దిగంబరంగా ఉన్న విషయాన్ని తెలుసుకుని , సిగ్గుపడి తమ శరీరాలను ఆకులుతో కప్పుకుంటారు . ఆ తర్వాత దేవుని శాపానికి గురి అయి అనేక కష్ట నష్టాలకు గురి అవుతారు . అది వేరే కధ.  

   అయితే ఇప్పుడు ఆ కద గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ  రోజు ఈనాడు పేపర్లో చూసిన ఒక విషయం ఆ కదను గుర్తుకు తెచ్చింది. బహూశా ఆదం అవ్వ లు దేవుని మాట వినకుండా జ్ఞాన పలం తిన్న నేరానికి , వారి వారసులైన నేటి మానవులు అ జ్ఞానపరంపర లో కలిగిన శాస్త్రీయ జ్ఞానం వలన పండ్లు ను మగ్గబెట్టుకుని తినే బదులు , రసాయనాలు కలుపుకుని , విష పండ్లను తయారు చేసుకుని తింటునారు అంటె అది దేవుని శాపమే కాబోలు . ఎందుకంటె ఇదంతా శాస్త్రీయ జ్ఞాన మహిమే కదా ! 

                                                                         


      ఒక్కప్పుడు మార్కెట్ కి వెలితే మచ్చలు ఉన్న అరటి పండ్లు కనిపించేవి . వాటిని చీటా పండ్లు అనే వారు  అంటె చిరుతపులి మీద మచ్చలు ఉన్నట్లు వాటికీ మచ్చలు ఉండెవి. అరటి కాయ పక్వానికి వచ్చింది అని చెప్పటానికి ఆ మచ్చలే నిదర్శనం. మచ్చ యొక్క విస్తీర్ణత ను బట్టి  బట్టి పండు పక్వత చెప్పవచ్చు. ఉదాహరణకు పై చిత్రం లోని మూడు అరటి పండ్లను చూస్తే అన్నింటికి కంటె క్రింది పండు  మీద మచ్చలు తొలిదశను .,మద్య పండు మద్యదశను , పై పండు మీది మచ్చలు పూర్తి పక్వడశను తెలుపుతున్నాయి. కాని ఈ   రోజున  మార్కెట్ లోకి వెలితే చీటా కాయలకు బదులు "చీటింగ్ కాయలు " దొరుకుతున్నాయి . అంటే కాయ పక్వానికి రాక ముందే గెలల మీదే రసయానాలు పోసి ఒక్క రోజులోనే పండు రంగు వచ్చేలా చేస్తున్నారు . అది చూడటానికి నీట్ గా, నిగ నిగలాడుతూ మచ్చ లేకుండా ఉంటే మురిసి పోయి తెచ్చుకుని , ఆరగించి ఆనారోగాల పాలు అవుతున్నారు సామాన్య జనం. దీనికి కారణం కాసుల కక్కుర్తి . అందుకు దోహదం చేస్తున్న శాస్త్రీయ జ్ఞానం 

                                                                           
                         

                                                    శాస్త్రీయ జ్ఞానం , శాస్త్రీయ జ్ఞానం అని విర్రవీగే వారికి ఇది ఒక సవాల్. ఎంతసేపు వెనుకటి తరం ఏర్పరచిన గోతులు చూసి గేలి చేస్తూ నడుస్తున్నారే కాని, వీరు చంకలు గుద్దుకునే  శాస్త్రీయ జ్ఞానం, ముందు ఎంత అగాధం సృష్టిస్తుందో తెలుసుకోలేక పోతున్నారు. నిజంగా ఈ  నాడు ఆదునిక మానవులం అని చెప్పుకుంటున్న మనం బ్రతికేది ఒక బ్రతుకేనా? స్వచ్చమైన గాలి లేదు  . స్వచ్చమైన నీరు దొరికే పరిస్తితి లేదు. పాలలో కల్తీ . పండ్లు చూస్తే విష పూరితం . పట్టు మని 40 యేండ్లు  రాక ముందే ఒంట్లో జవసత్వాలు క్రుంగి పోతాయి . ఏ పని చేయాలన్నా గోలీ వేసుకోవాలసిందే . తిండి తినాలంటే మాత్ర. కాపీ తాగాలంటే మాత్ర . స్వీత్ తినాలంటే మాత్ర . ఆఖరకు సంసారం చేయాలన్నా మాత్ర వేసుకోమ్దే కుదరని పరిస్తితి. స్పందించాల్సిన  హృదయాలు  స్తంభిస్తాను అంటుంటె , స్తంభిచాల్సిన అవయవాలు స్పందనలు లేక నీరు కారి పోతుంటాయి. మనది ఒక బ్రతుకేనా ? చేవ చచ్చి, జావ గారే మనది ఒక బ్రతుకేనా? దీని కోసమేనా మానవాభివ్రుద్ది పేరుతో  వనం లో నుండి నగరాల్లోకి ప్రస్తానం చేసింది? ఇదే నా ఆధునిక శాస్త్రీయ జీవన విదానం? . నా ద్రుష్టిలో శాస్త్రీయ జ్ఞానం అంటె ఆరోగ్యకరమైన, ఆనందకరమైన  జీవనం సాగించగల జ్ఞానం  , కోట్లాది సంపాదన ఉన్న కోరుకున్న దానిని పొందలేని వాడి జీవితం వెస్ట్ . మధుమేహం ఉన్న వాడికి ఇంట్లో మిటాయి భండారం ఉన్నా  లాభమేమిటి?సంపద అయినా అంతే .   

     శాస్త్రీయ జ్ఞానం కంటె ముందు మనిషికి మానవత్వం అబ్బాలి  . పది మందికి చెడు  చేసే విజ్ఞానం ని నియంత్రించి , మంచి కోసమే దానిని వినియోగించేలా చేసేదే మానవత్వం. దానిని మనిషిలో పెంపొందించాదానికి , స్వార్దం కోసం అడ్డ దారులు తొక్కకుండా చెయ్యడానికే పాప బీతి , దైవబీతి , లాంటివి  మనషుల మనసులలో నెలకొల్పడం జరిగింది . వాటి   కోసం మత వ్యవత్సలు పని చేస్తున్నాయి. ఉదాహరణకు  పాలలో కల్తీ కలిపే వారు, పండ్లను విషపూరితం చేసే వారు గొప్ప శాస్త్రీయ జ్ఞానం కలిగిన వారు కాదు. వారికున్న కొద్ది పాటి జ్ఞానమే సమాజానికి అంత హాని చేయిస్తుంటే , ఇంకా జ్ఞానం ఎక్కువైతే ? అందుకే మానవత్వ హీనమైన శాస్త్రీయ జ్ఞానం మహా పాపాలలో ఒకటి అన్నారు మహాత్మా గాందీ .  సైన్స్ కంటె ముందు మానవత్వాన్ని ప్రబోదించాలి. అందుకు నైతిక విద్యాబోదన అవసరమ్. పూర్వకాలం లో రాక్షసులు అందరూ సైంటిస్టులే . కాని మానవత్వం లేనందువలన వారు చేసే పనులు సమాజ వినాశనానికి దారి తీసి చివరకు వారిని సంహరించాల్సి వచ్చింది. 

            అందుకే మచ్చలు లేని అరటి పండు , మానవత్వం లేని సైన్స్ ట్రెండ్ ,మనిషికి ,సమాజానికి  హానికరమే   !

      

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం