మీ అయన నల్లగా ఉన్నాడే అని బాద పడుతున్నారా? అయితే అయన తోలు వలవండి ఇలా!!!?
వర్ణ వివక్షత ! ప్రపంచంలోని చాలా మంది ప్రజలు ఈ వివక్షతకు గురి అవుతున్న వారే. అయితే భారత దేశం లోని వర్ణ వివక్షతకు , ప్రంపంచంలోని ఇతర దేశాలలో ఉన్న వర్ణ వివక్షతకు బేదం ఉంది. మన దేశం లో వర్ణం అంటే కులం. ఇక్కడ కులవివక్షతకూ భారతీయ సమాజం అనాదిగా గురి అవుతూ ఎంతో నష్ట పోయింది . అగ్రకులాలు , వెనుకబడిన కులాలు , నిమ్నకులాలు అనే వర్గీకరణతో ఒక అంచె పద్దతిలో ఇక్కడి ప్రజలు అందరూ ఏదో రకంగా కులవ్యవస్తను బలపరచుకుంటూ రావడం వలన భారత దేశం లో అది వేళ్ళునుకుని పోయి దృడంగా మారి పోయింది . దానిని నిర్మూలించాటానికి ఆదునిక ప్రభుత్వాలు ఎన్ని పదకాలు ప్రవేశ పెట్టినా , మార్పు క్రమానుగతంగా కొద్ది కొద్ది గా వస్తుండే తప్పా , ఒక్క సారిగా ఇక్కడి కులవ్యవస్తను నిర్మూలించే విధం కనపడడం లేదు. పూర్తి నిర్మూలన కు మరి కొన్ని దశాబ్దాలు పట్టవచ్చు.
అయితే ప్రపంచం లోని ఇతర దేశాలలో ఉన్న వర్ణ వివక్షత వేరు . అక్కడ ప్రజలలో శరీర రంగు ని బట్టి వివక్షత ఉంది . నల్లగా ఉండే ప్రజలను తెల్లగా ఉండే వారు ఈసదించుకుంటారు. తెలుపు రంగు కలిగిన వారు తామూ ఎంతో గ్రేట్ అని , నలుపు రంగు వారు బానిసత్వానికి తప్పా మరెందుకు పనికి రారు అని వారి ఉద్దేశ్యం. తెలుపు అయినా నలుపు అయినా అది ప్రక్రుతి దర్మం అని , మనిషి స్తాయిని నిర్దారించేది మేదస్సే తప్పా , శారిరక రంగు కాదు అనే విషయాన్ని తెల్ల తోలు వారు అంగీకరించటానికి అంత సుముఖంగా లేక పోవటానికి కారణం వారి నార నరాల్లో జీర్ణించుకు పోయిన వర్ణ వివక్షతే కారణం. అక్కడ కూడా మార్పు క్రమానుగతం గా వస్తుంది. .
అయితే ఈ రంగు వివక్షత విషయం లో రష్యా కు చెందిన లేబరీటరిలో పని చేసే పరిశోదకులకి ఒక బ్రహ్మాండమైన అయిడియా వచ్చింది అట! వర్ణ వివక్షత పోవాలంటే తెల్లవారిని సంపూర్ణ జ్ఞానవంతులుగా మార్చాలి , లేదా నల్ల వారి ఒంటి రంగును మార్చాలి . తెల్ల తోలు వారిని సంపూర్ణ జ్ఞాన వంతులిగా మార్చడం తరాలు కాలం పడుతుంది ,నల్ల వారి ఒంటి రంగును మార్చడమే సులువు అనుకుని ఆ దిశగా ప్రయోగాలు చెయ్యడం మొదలు పెట్టి , అందులో విజయం సాదించారు అట .
వారి ప్రయోగాల అనుసారం ఆక్సిటొనె , బెంజో డియోజెపిన్ లు కలిపినా మిశ్రమాన్ని లీటరు నీళ్ళల్లో 50 గ్రాములు కలిపి , అ నీళ్ళతో 6 గంటలు పాటు స్నానం లాంటి ప్రక్రియ లో ఉంటే చాలట .పై నల్ల చర్మం కాస్త ఒలవడానికి వీలుగా తయారు అవుతుంది అట . దానితో ఆ లేబరిటరి వారు సులువుగా తోలు వలిచేస్తారు అట . దానితో నల్ల మానవులు కాస్త ఎర్ర మానవులుగా మారి పోయి వెర్రి నవ్వు ఒకటి నవ్వేయోచ్చు అట. మరి ఇంత చేస్తే బుడ్డి లేని తెల్ల తోలు వాళ్ళు ఈ ఎర్ర మానవులని అక్కున చేర్చుకుంటారా , లేక "తోలు వలిపించుకున్నోళ్లు" అని ఈసడించుకుంటారా అనేది వేచి చూడాల్సిన అంశం . ఎందుకంటే ఇప్పటి దాక ఈప్రయోగం 254 మందికే చేసారట . త్వరలో రష్యా గవర్నమెంట్ ఈ పదకానికి రెఇంబర్స్ మెంట్ ఇచ్చే అవకాసం ఉంది కాబట్టి , రష్యాలోని నల్ల వారు వేలం వెర్రిగా తోలు వలిపించుకోవడానికి రెడీ అవుతారని లేబరేటరి వారి ఆశాబావం.
వర్ణ వివక్షత అనేది జ్ఞాన హీనత వలన కలిగే మానసిక రోగం. సదరు రోగులకు సరి అయిన మందు ఏమిటంటే వర్ణాలు అన్ని ఒకటే అని , నలుపు అయినా తెలుపు అయినా ప్రక్రుతి దర్మానుసారమే కలుగుతుందని , మనం చూడాల్సింది లోపలున్న మనస్సు తప్పా , పైనున్న తోలు కాదనే జ్ఞానం ఇవ్వడం. మరి దీనికి యేండ్లు పడుతుంది కాబట్టి కమర్షియల్ గా చూస్తే లాభసాటి వ్యాపారం కాదు కాబట్టి , సైన్స్ విజ్ఞానులు ఆలోచించి ఈ విదానం కనీ పెట్టారు అన్న మాట. "రోగం ఉన్న వాడికి మందు వేసే బదులు , బాదితుడికి తోలు వలిచే విదానం " తో వర్ణ వివక్షతను పోగోట్టొచ్చు అనే బావనకు వచ్చిన ఆ విజ్ఞానులకు జోహార్లు అర్పించడం తప్పా మనమేమి ఇవ్వగలం?
మన దేశం లోనేమో "నలుపు నారాయణుడు మెచ్చు " అనే సాంప్రదాయక బావనలు ,మన దేవుళ్ళు నల్లగా , దేవతలు ఎర్రగా ఉంటారు అనే బావనలు వలన నల్ల మొగుళ్ళు , ఎర్ర పెళ్ళాల్లు హ్యాపీగా కలసి మెలసి ఉంటున్నారు . కాని అక్కడక్కడా ఎవరైనా భార్యలు , తమ భర్తలు నల్లగా ఉండకుండా పక్కింటాయన లా ఎర్రగా ఉంటె ఎంత బావుండెదో అనే అసంతృప్తి ఉన్నట్లైతే వారికి గోల్డెన్ చాన్స్! ఎంచక్కా తమ మొగుళ్ళను రష్యాకు తీసుకు వెళ్లి పైన చెప్పిన కెమికల్ స్నానం చేయించి , అయన గారి తోలు వలిపించి మరీ తీసుకు వచ్చి "నా మొగుడూ ఎర్రోడు (వెర్రోడు) అని టముకు వేసుకోవచ్చు. దీని వలన రష్యాకు కూడా "కెమికల్ బాత్ టూరిజమ్ " ద్వారా బోల్డంత ఆదాయం.
వినాశకాలే విపరీత బుద్ది అని , నల్ల జాతి వారి తోలు వలిచే పై ప్రయోగాలు వారి మానవ హక్కుల ఉల్లంఘనలో బాగమేనని , కొన్ని మానవ హక్కులు సంస్తలు కెమికల్ స్నానం ని నిరసిస్తూ ఉండడం ఈ విషయం లో కొస మెరుపు .
SOURCE :- http://www.conspiracyclub.co/2015/08/05/way-to-remove-the-black-skin-layer-of-black-people/
Comments
Post a Comment