సుప్రీంకోర్టు తీర్పుతో అవినీతి పరులైన అధికారులకు కాసుల పంటేనా!?                                                           అవుననే అనిపిస్తుంది! ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాలు చూస్తే తాజాగా ఇచ్చిన సుప్రీం కోర్టు తీర్పు సత్పలితాలు కన్నా దుష్పలితాలే ఎక్కువ ఇచ్చేటట్లుంది.

  నేరస్తులు రాజకీయాలలో కొనసాగకుండా శిక్ష పడిన మంత్రులు, ఎమ్మెల్యెలు, ఇతర రాజకీయ పదవులు అనుభవించే వారెవరైనా సరే, వారిక్ గల అప్పీల్ అవకాశాలతో సంబందం లేకుండా తక్షణమే పదవి కోల్పోతారని మొన్న సుప్రీం కోర్టు వారు ఇచ్చిన తీర్పు సర్వదా అహ్వానించదగినది. ఎందుకంటే ఏ తీర్పు అయినా కూలంకష విచారణ అనంతరం మరియు నిందితుడి కి డెపెన్స్ చేసుకునే అవకాశం కల్పించి, ఇరువైపుల ప్రవేశపెట్టబడిన సాక్ష్యాల విచారణ అనంతరం కోర్టు వారు తీసుకునే నిర్ణయం కాబట్టి, అది న్యాయమైనదే అని చెప్పాలి.

  కాని రెండవ రోజు ఇచ్చిన తీర్పు అదే పోలిస్ కష్టడిలో ఉన్నా, జుడిసియల్ రిమాండ్లో ఉన్న ఎన్నికల్లో పోటి చెయ్యడానికి అనర్హులు అనేది పైకి చూడటానికి నేరమనస్తత్వం కలిగిన వారిని కట్టడిగా చేసేది కనిపించినా కచ్చితంగా అది మరింత అధికార దుర్వినియోగానికి, అవినీతికి దారి తీస్తుంది. ఎలాగంటారా

   తమకు ప్రత్యర్దిగా ఉన్నవారు ఎన్నికల్లో పోటి చేస్తారని బావిస్తే, డబ్బున్నవారు వారిమీద ఎన్నికల సమయంలో తన అనుచరులతో తప్పుడు కేసు పెట్టిస్తే, డబ్బు లేక అధికార బలంతో పోలిసులను ప్రభావపరచి వారిని పోలిస్ కష్టడి లేక జుడిషియల్ కష్టడికి పంపిస్తే నిర్దోశులు అయిన వారు కూడా  ఎన్నికల్లో  పోటి చేసే అవకాశమే ఉండదు కదా? పోని మనం ఊహించేదేమి అతిశయోక్తి కాదు. కాసుల కోసం కక్కుర్తి పడి ఎన్ని తప్పుడు కేసులు బనాయిస్తున్నారో మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇటు వంటి వ్యవస్తలో సుప్రీమ్కొర్టు వారు కల్పించిన ఈ సువర్ణ అవకాశాన్ని, అవినీతి పరులైన అధికారులు, తప్పుడు రాజకీయాలు చేసే నాయకులు వదులు కుంటారా! నెవ్వర్! ఇది కాదు దీనికి సరిఅయిన పరిష్కారం అనిపిస్తుంది. తప్పకుండా ఈ విషయంలో రాజ్యాంగ ధర్మాసనం సమీక్ష కోరాల్సిన  అవసరం ఎంతైనా ఉంది.

   దీనికి ఒక మార్గం ఉంది.ఎన్నికలు డిక్లేర్ అయ్యాక జరిపే అరెస్ట్లకు, జుడిసియల్ రిమాంద్లకు ఈ టిర్పు వర్తించకూడదు అని ఉండాలి. అలాగే ఎవరైనా వ్యక్తి మీద తప్పుడు కేసు పెడితే, సదరు వ్యక్తి తాను ఎన్నికల్లో కాని, ఇతరత్ర కాని రాజకీయ  పదవుల అబ్యర్దినని, కాబట్టి తన పఈ మోపబడిన నేర అభియోగాన్ని త్వరగా విచారించి తనకు న్యాయమ్ చెయ్యలని కోర్టు వారిని కోరితే అతని కేసు  అత్యవసర కేసు గా బావించి సత్వర విచారణ జరిపి నెల రోజుల్లోపే నిర్ణయం ప్రకటించాలి. అమ్తే కాదు తప్పుడు కేసులు పెట్టే వారికి , వారికి సహకరించే అధికారులకు బారీ జరిమానాతో కూడిన కఠిన సిఖ్ష విదించేటట్లు చట్ట సవరణ రావాలి. ఈ విదమయిన కఠిన నిబందనలు ఉంటే తప్పా ఏది చేసినా చివరకు అవి అవినీతికి ఊతమిచ్చేవే అవుతాయి.    

Comments

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.