మేమే విజ్ణానులం అనుకునే వారు ఇస్రో చెర్మన్ గారిని ని చూసి నేర్చుకునేది చాలా ఉందనుకుంటా!.
ఈ రోజు నింగిలోకి ఎగరనున్న ఉపగ్రహం ( PSLVc22), రాకెట్ లాంచింగ్ సమస్యలు లేకుండా సజావుగా జరగాలని సాక్షాత్తు, ఇస్రో చేర్మన్ శ్రీ రాదక్రిష్ణన్ గారు సతీ సమేతంగా తిరుమలకు విచ్చేసి, ఆ ఏడుకొండల వాని సన్నిదిలో ఆ ఉపగ్రహ కక్ష్య మార్గం నమూనాకు పూజళూ చేయించి, అ భగవంతుని అశీసుల కోసం ప్రార్దించారు. ఇది సైంటిస్ట్ లు అనబడే వారు కొంతమందికి ఏమనిపించినా ఆ దైవాన్ని విశ్వసించే వారికి ఆనందం కలిగించే విషయం.
మనిష్ బౌతికంగా ఎంత విజ్ణాన వంతుడైనప్పటికి, అతను మానసికంగా తనను నడిపించే శక్తి ఈ విశ్వంలో ఏదో ఉందనే బావిస్తుంటాడు. అది మూడ విశ్వాసం కాదు.అనాదిగా అతని నరనరాల్లో జిర్ణించుకుని ఉన్న మత లేక అద్యాత్మిక పరమైన బావన. సాక్షాత్తు ఐన్ స్టీన్ అంతటి వాడే "సైన్స్, మతమూ అనేవి ఒకే వ్రుక్షానికి ఉన్న రెండు కొమ్మలు లాంటివి " అన్నాడు. కాబట్టి అన్నింటికి సైన్స్ సమాదానం చెప్పలేదు అనేది మనకు అనుభవమే. అలా అంతిమ సత్యమ్ కనుగొనబడే వరకు అటు ఆద్యాత్మికత బావననలు, ఇటు విజ్ణాన బావనలు ఉండి తీరతాయి.
కొన్ని కోట్ల ఖర్చు పెట్టి చేస్తున్న రాకెట్ ప్రయోగం విషయం లో ఇస్రో చేర్మన్ గారు సజావుగా సాగాలని ఆ అలౌకిక శక్తిని ప్రార్దించడం ఆయనలోని బాలెన్స్ మైండ్ కి నిదర్శనం. మనిషి మెదడులో ఎడమ వైపు తార్కిక ద్రుక్పడానికి, కుడి బాగం ఎమోషనల్ ఫిలింగు లను కలిగించడంలో ముఖ్య పాత్ర వహిస్తాయని చెపుతారు. మరి ఈ రెండింటిని సమతూకంలో ఉంచేవాడే బాలెన్స్ మైండేడ్ పర్సన్ అనిపించుకుంటాడు. అటువంటి బాలెన్స్ మైండ్ ఉన్న వ్యక్తి మన బారత అంతరిక్ష పరిశోధన సంస్తకు అద్యక్షుడిగా ఉండడం మన అద్రుష్టం. ఆయన నేత్రుత్వంలో మరిన్ని అంతరిక్ష ప్రయోగాలు జరిగి మన దేశ ఖ్యాతి ప్రపంచం లో ఇనుమడించాలని, మరియూ ఈ రోజు జరిగే ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావాలని ఆ దేవ దేవుని,మరియు ఆ చెంగాలమ్మ తల్లిని మనాసారా ప్రార్దిస్తున్నాం.
Comments
Post a Comment