మన రాష్ట్రంలో కారల్ మార్క్స్ చెప్పింది జరగకపోయినా, కాలజ్గానం లో చెప్పింది జరుగబోతుందా?
ప్రపంచంలో ఆర్థికవాద పరిణామ కాలజ్ణానం చెప్పినవారు మార్క్స్ పండితుడు. సరే దాని మీద బిన్నాభిప్రాయాలున్నా, ఆయన చెప్పింది జరగటానికి కొన్ని వందల(వేలు కూడ కావచ్చు) సంవత్సరాలు పట్టెట్టట్లుంది కాబట్టి, ఆయన చెప్పిన కమ్మునిజం మనకు చూసే బాగ్యం లేదు. కాని ఎప్పుడో మన రాష్ట్రంలో పుట్టిన మహాను బావుడు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పిన కాలజ్ణానం లోని " కలికాలం లో జరగబోయే వింతలు" జరుగుతున్నాయి అనిపిస్తుంది. ఎలాగంటారా!
బ్రహ్మం గారు చెప్పిన దాంట్లో 2 వాక్యాలు ’"గొర్రెలను తినువాడు గోవింద కొడతాడు"," బర్రెలను తినువారు వస్తారయా". దీనిని విశ్లేషించిన పండితులు " తక్కువుగా దోపిడి చేసే పాలకులు పోయి, ఎక్కువుగా దోపిడి చేసే వారు వస్తారు" అని అర్థం అన్నారు.
ఈ మద్య నా మిత్రుడొకరు పిచ్చాపాటి మాట్లాడుతు ఇదే వాక్యాలకు కొత్త అర్థం చెపితే నాకు చాలా ఆశ్చ్యర్యం వేసింది . అబ్బా! అలా ఐయి ఉంటుందా? అనిపించింది. కాని వెంటనే ప్రక్కనే ఉన్న హేతువాది మిత్రుడు గోల చేసాడు. చీ,చీ ఇలాంతివి నమ్ముతావా? అసలు కాలజ్ణానం యె పుక్కిట్టి పురాణం అంటే మళ్ళి దానికో ఆర్థం! అంటు ఈసడించాడు. ఎవరేమన్న నాదొకటే సిద్దాంతం గదా, అదేనండి "దేనిని గుడ్డిగా నమ్మకు, వ్యతిరేకించకు." అందుకే నేను ఈ విషయంలో కామ్. ఇంతకి నా మిత్రుడు చెప్పినదేమిటంటే:
కొన్నాళ్ల క్రిందట మన రాష్ట్రంలో ఒక ముక్యమంత్రి ఉండె వారు. ఆయన కాలంలో విదానసభ కొలువు తీరి ఉండగా , సభలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న అవినీతి గూర్చి అప్పట్టి ప్రతిపక్ష నాయకుడు సీరియస్ గా విమర్శిస్తుంటే సదరు ముక్యమంతిగారు హేళనగా నవ్వారని, అది చూసి ఆ ప్రతిపఖ్ష నాయకుడు కోపంతో " ఇలా ఆస్వామిని హేళన చేసిన వారు చరిత్రలో నాశనమయ్యరని" అన్నారట. అఆ సంఘటణ జరిగిన కొద్ది రోజులకే ఆ ముఖ్య మంత్రి గారు దుర్ఘటన లో చని పోయారు. ఇది ఎవరూ ఊహించని దైవ ఘటన. కాని విచిత్రంగా సదరు దుర్ఘటనకు కారణం మీరంటే మీరని మనుషులు వాదించుకుంటున్నారు, అసలు సూత్రదారి ఆ జగన్నాటక సూత్రదారిని ఎవరూ గుర్తించటం లేదని నా మిత్రుడి బాద." గొర్రెల్ని తినువాడు గోవింద కొడతాడు అంటె అర్థం ఇది అంటా!
ఇక పోతే ఇప్పుడు ఇంకొకటి జరగాలి అదేనండి రెండవ వాక్యం. ఇప్పుడు జరగబొయెది అదే నంటా! మొన్నీ మద్య ఒక జొతిషుడు రాబొయే ముఖ్య మంత్రి గురించి చెప్పేశాడట! దాని మీద ఇప్పట్టి అదికార పక్షం వారు కారాలు మిరియాలు నూరుతు, అదే గనక నిజమయితే ఇక పూర్తి దొపిడియే అంటున్నారంట. కాబట్టి బ్రహ్మం గారి రెండవ వాక్యం కూడ నిజం కాబోతుంది అన్నాడు. నేనింకా ఆశ్చర్యం నుండి తేరుకోకముందే " మిమ్మల్ని ఎవాడు బాగు చెయ్య లేడు " అనుకుంటూ మా హేతు వాద మిత్రుడు లేచి వెళ్లి పోయాడు. మా కాలజ్ణాన మిత్రుడు పైనున్న ఆ గోవిందుడికి నమస్కరించి తనూ వస్తానని వెళ్లి పోయాడు. నేను " నా బ్లాగు కి ఈ రోజుకి కథ దొరికిందని" సంతోషిస్తూ నేనూ వచ్చేశా !
కందుకూరి వీరేశలింగం గారు ఇలాంటి బావాలనే తొలగించటంకొసం మంత్రాలతొ జీవనం సాగించే వ్యక్తి నేను నీపైన చేతబడి చేస్తున్నానని చెప్పాడట. దానికి బదులుగా వీరేశం గారు నేనే నీపైన చేస్తున్నానని చెప్పారట. తర్వాత ఆ మత్రాలతనికి వాంతులూ విరేశనాలూ, అవ్వటం మొదలైంది బయపడిన ఆ మంత్రాలతను వీరేశలిగం గారి కాళ్ళపైన పడి చేతబడిని ఉపసమ్హరించుకొమని కొరాడు.పంతులుగారు అతనికి ఇలా చెప్పారు. నేను ఏ చేతబడీ చేయలేదు నీ బయమే వీటికి కారణం అని చెప్పారు.
ReplyDeleteభుమి మనుషులు లేనప్పుడు కుడా వందల కొట్ల సంవత్సరాలనుంచి వుంది . బ్రమ్హం గారు నిన్న మొన్నటి. మనిషి. మనిషి అట్టడుగు నుంచి ప్రారంభించి ఎన్నొ ఆటుపొట్లను ఎన్నొ దశలను దాటుకుని బట్టలు నేయటం, వ్యవసాయం పైన జీవనం సాగించడం ఈ దశకు చేరుకున్న సమాజంలొని మనిషే బ్రమ్హం గారు. క్రీ.శ. 8 లేదా 9 శతాత్దం నికి చెందిన మనిషి. ఆయనే కాదు సమాజం గురించి కొంత అవగాహన వున్న వారు కొంతవరకు ఊహించి చెప్పవచ్చు. మీరు చెప్పిన ఉదాహరణలు యాదౄచ్చికం మాత్రమే. కమ్యునిజం ఎప్పుడు వస్తుందనేది అది ప్రజా చైతన్యం మీద ఆదారపడి వుంది.
బ్రహ్మం గారు 16 వ శతాబ్దం వారు. మీరు చెప్పిన దానిని సామాజిక పరిణామం సిద్దాంతం ప్రాకారం ఆంగికరించవలిసీందే. అయితే మీరన్నట్టు ప్రజా చైతన్యం ప్రకారమే కమ్మ్యునిజం వస్తుంది అనుకుందాము కాసేపు. మరి 1960 తో పోల్చుకుంటే ఈ నాడు ప్రజలలో చైతన్యం ఎక్కువ అని ఎవరఈనా ఒప్పుకుంటారు. కాని ఆ నాడు ప్రజలలో ఉన్న కమ్మ్యునిజం మీద ఆసక్తి ఈ నాడు వారిలో కనిపించటం లేదు.ఎందుకో చెప్పగలరా?
Deleteనేను కూడ మీలాగానే, ఎవరిని ఖండించను, నమ్మను..
ReplyDeleteబ్రహ్మం గారు చెప్పిన దాంట్లో 2 వాక్యాలు
*స్త్రీలు రాజ్యాధికారం చెపడతారు*
*నీటి గురుంచి గొడవలు జరుగుతాయి*
Deleteదన్యవాదాలు రాహుల్ గారు .ఇవి ఎవరఈనా ఊహించి చెప్పవచ్చు అంటారు మన మిత్రులు . కాని ఆశ్చర్యకరమయింది ఏమిటంటే బాంబర్ విమానాలు గూర్చి అయన చెప్పడం." రెక్కల కోడి వచ్చును, దాని రెక్క విసురుకు లక్షమంది చచ్చును". రెక్కల నుంచి పడే బాంబులను ,చచ్చే జన్నాన్ని చూడటం 16 వ శతాభ్దం వారికి ఎలా సాద్యం.?
నిజానికి కమ్యూనిజం == రాజుల కాలం.
ReplyDelete
Deleteదన్యవాదాలు ప్రసాదు గారు . కమ్మ్యునిజం గురించి కొత్త అర్థం వింటున్నాను మీ ద్వారా. ఎలాగో వివరించగలరా!