నా ఇష్టం నాదంటే కష్టమే మరి!

                                                                 

         అది 1950 వ సంవత్సరం

స్తలం: సీతారామయ్య గారి ఇల్లు

(సీతరామయ్య గారు,ఆయన బార్య లక్ష్మమ్మ గారు,పెద్ద కుమార్తే భానుమతి ఇతర కుటుంబ సభ్యులు సీరియస్  గా తర్జన బర్జనలు పడుతున్నారు)

లక్ష్మమ్మగారు: (భానుమతి నుద్దేశించి):- నీకేమి పోయే కాలమే! కులం కాని వాడిని ప్రేమించి,వాడినే పెండ్లాడుతా నంటావు

భానుమతి: అమ్మా, మీకిప్పటికే లక్ష సార్లు చేప్పాను. ఇది నా పెళ్లికి సంబందించిన విషయం.పూర్తిగ నా ఇష్టం నాది. నా ఇష్టం ఉన్న వాడినే నేను పెండ్లి చేసుకుంటా. మీకు ఇష్టం అయితే నాలుగు అక్షంతలు వేసి అస్వీర్వదించండి. లేకుంటే లేదు. మా పెళ్లి మాత్రం ఆగదు.(చివరకు వ్యక్తి గెలిచింది. కుటుంబం ఓడిపోయింది. భానుమతికి తను ప్రేమించిన రాజారావు తో పెళ్లై పోయింది.)

అది 1982 వ సంవత్సరం

 స్తలం: రాజారావు గారి ఇల్లు

(రాజారావు గారు,భానుమతి గారు,కుమార్తే రజిత,సీరియస్  గా తర్జన బర్జనలు పడుతున్నారు)

 భానుమతిగారు:-నీకేమి పోయే కాలమే! మతమూ, దేశం కాని వాడిని ప్రేమించి వాడినే పెండ్లాడుతా నంటావు.
 రజిత:-అమ్మా, మీకిప్పటికే లక్ష సార్లు చేప్పాను. ఇది నా పెళ్లికి సంబందించిన విషయం.పూర్తిగ నా ఇష్టంనాది. నా ఇష్టం ఉన్న వాడినే నేను పెండ్లి చేసుకుంటా. మీకు ఇష్టం అయితే నాలుగు అక్షంతలు వేసి అస్వీర్వదించండి. లేకుంటే లేదు. మా పెళ్లి మాత్రం ఆగదు.(చివరకు వ్యక్తి గెలిచింది. కుటుంబం ఓడిపోయింది. రజితకు తను ప్రేమించిన పాకిస్తాని వరుడు సలీమ్ తో పెళ్లై పోయింది.రజిత కాస్తా రజియాగ మారిపోయింది.


అది 2014 వ సంవత్సరం

 స్తలం: సలీమ్ గారి ఇల్లు

(సలీమ్ గారు,రజియాగారు, కుమార్తే నూర్జహాన్, మరొక వ్యక్తి ఉన్నారక్కడ.)

నూర్జహాన్:- అబ్బాజాన్, మేము పెండ్లి చేసుకోవాలనుకుంటున్నాము.

రజియా:- ఎవర్ని?

నూర్జహాన్:-( పక్కనున్న వ్యక్తిని చూపిస్తూ), వీరినే.

  ( ఒక్కసారిగ పక్కనే బాంబ్ పడ్డట్ట్లుగ అదిరిపద్దారు,సలీమ్ ,రజియాగార్లు,)

రజియా:హవ్వా! హవ్వా!నీకేమి పోయే కాలమే! మాగాడిని కాదని ఆడదాన్ని  ప్రేమించి దానిని పెండ్లాడుతా నంటావా?ఇదెక్కడైనా ఉందా?

నూర్జహాన్:-అమ్మా , రోజులు మారాయి. ఇప్పుడు కుల మతాలే కాదు, ఆడ మగ భెదం లేకూండా స్వజాతీ వివహాలు జరుగుతున్నాయి.ఇది నా పెళ్లికి సంబందించిన విషయం.పూర్తిగ నా ఇష్టం నాది. నా ఇష్టంఉన్న వాళ్లనే నేను పెండ్లి చేసుకుంటా. మీకు ఇష్టం అయితే నికహ చేసి అస్వీర్వదించండి. లేకుంటే లేదు. మా పెళ్లి మాత్రం ఆగదు.(చివరకు వ్యక్తి గెలిచింది. కుటుంబం ఓడిపోయింది. నూర్జహాన్,మేరి ఒక్కట్టయారు)

  ఈ కథ లో నీతి : పెండ్లి అంటె ఇద్దరు వ్యక్తుల ఇష్టమే,  కుటుంబాల  అనుమతి అవసరం లేదు అనుకుంటే ఏదో ఒకనాడు కొన్ని కుటుంబాలకు ఈ అనుభవం ఎదురు కావచ్చు.

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం