ఊరి బయట దెయ్యం! నాకైతే భయం!

                                                                    

మిత్రులారా ఇది నా చిన్నతనంలో జరిగిన సంఘటన. నేను మా నాన్న గారి కోరిక మేరకు ఇంటర్ మొదటి సంవత్సరం కాగానే చదువుకు ఫుల్ స్టాఫ్ పెట్టెసి, మ్ ఊళ్ళొ వ్యవసాయం ఇరగదీద్దామని వెళ్ళి పోయా. అలా వ్యవసాయం చేసే రొజుల్లో జరిగిన సంఘటన ఇది.

 మా ఊరికి షుమారు ౫ కిలోమీటర్ల దూరంలో ఉంది గోపాలపేట గ్రామం. ఆ ఊరికి దగ్గరలోనున్న  మా మిత్రుడి పొలాలు చూదామని నేను మా మిత్రుడు కలిసి వెళ్లాము. పొలమంతా వరి విరగ పండి,బరువైన కంకులతో వంగి చూడటానికి మనసుకు బలే హాయి అనిపిస్తుంటే పొద్దు గూకి సంద్య చీకట్లు అలుముకునేది కూడ గమనించలేక పోయాము. చివరకు నేనే వెళ్ళిపోదామని గుర్తు చేస్తే మా మిత్రుడు పొలానికి సంద్య వేళ అదవి పందుల బెడద ఉంది కాబట్టి ఒక 2 ఘంటలు ఆగి వెళ్దామన్నాడు. కాని మా నాన్న గారు కోఫ్ఫడతారు అని చేప్పేసి, మా మిత్రుడు వద్దని వారిస్తున్నా వినకుండా ఒంటరిగా బయలుదేరా.

   స్వతహాగా నేను దైర్యవంతుడిని(అని అనుకుంటాను).రాత్రుళ్ళు ఒంటరిగా చేల మీద గస్తీ కాపలా తిరిగేవాడిని.అంటే ప్రతి చేను దగ్గర జీతగాళ్లు రాత్రుళ్ళు కాపల పడుకుంటారు. వీళ్లు సరిగా కాపల కాస్తున్నారా ? లేదా? అని నేను మా మామయ్య కలిసి చెక్ చేసేవాళ్లం.కొణ్ణి సార్లు నేను ఒంటరిగానే వెళ్లేవాడిని. అలా నేను దైర్యవంతుడినే అనే బావన నాలోను మా వాళ్లలోను స్తిరపడి పోయింది.

సరే ఇలా దైర్య వంతుడనైన నేను ఆ సంద్య వేళలో నా మిత్రుడి మాటను ఖాతరు చేయ్యకుండ బయలు దేరి మా వూరి పొలి మేరలోకి వచ్చాను. మా వూరి పొలిమెరలో స్మశానం ఉంది. అది దాటితే గాని మా ఊళ్లొకి అడుగు పెట్టలేము. నేను 4,5 సార్లు రాత్రి వేళలో ఆ శ్మాశానం గుండా వెళ్లిన సందర్బాలున్నాయి కాబట్టి నాకేమి భయం లేకుండానే ఒంటరిగానే స్మాశానంవైపు అడుగులు వేస్తున్నాను. అంతలో కొంచం దూరంలో ఒక పేద్ద వెలుగు కనిపించి మాయమయింది. ఎవరైనా సందే కాపాల వాళ్లు బాటరీ లైట్తో వస్తున్నారేమొలే అనుకుని ముందుకు సాగాను. మళ్లీ అదే వెలుగు! ఈ సారి నిప్పులు రాలుతు పైకెగురుతు మాయమైంది.ఒక్క సారి చట్టుకున ఆగిపోయాను. ఏమిటా అని చూస్తున్నాను. మళ్లి కొద్ది దూరంలో అదే సీను. క్షణ కాలం భయం అంటే ఏమిటో తెలిసింది. అంతలోనే నాలోని సైన్స్ వాది మేల్కున్నాడు( నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ బై.పి.సి.లెండి), ఒరే’ రాజూ( ఇంట్లో నా ముద్దు పేరు అదేలెండి) ఇది శ్మాశానం రా  ఇకాడ మనుషుల్ని తగలెయ్యగ లేదా పాతెయగ బయతాకు వచ్చిన మానవ ఎముకల్లొ మిగిలిపోయిన ఫాస్పరస్,గాలికి పైకి లేస్తూ, మందిపోతుంది, నీ వేమి బయపడకు రా అబ్బాయి " అని దైర్యం చెప్పగానే తేరుకుని ౨ అడుగులు ముందుకు వేసాను. కాని విచిత్రంగా నా అడుగులు ముందుకు పడటంలేదు. ఇదేమిటా అని ఆశ్చర్యంగా చూస్తుంటె మల్లి నాలోని సైన్స్ గాడు గోలా చెయ్యడం మొదలు పేట్టాడు" ఒరే ఇదంతా ని మనసు చేస్తున్న ద్రామా, అక్కడ ఏమి లేదు మండే ఫాస్ఫరస్ తప్ప,నువుఉ నిర్బయంగా వెళ్లు" అని.నేను రెట్టించింన దైర్యంతో ఒక్క అడుగు ముందుకు వేయగలిగా! కాని రెండవ అడుగు పడతంలేదు. నా లోపల సైన్స్ గాడు, మనసు గాడు పోటి పడి పోరు పెడుత్తున్నారు. ఒకరు ముందుకు వెళ్లమని ఇంకోకరు వెలితే ప్రమాదమని. చివరకు ఆ సంఘర్షణలో సఈన్స్ గాడి వైపే మూగు చూపి బలవంతంగా అదుగు ముందుకు వేయ బోయా! అంతే! నా శరీరం నా పట్టు తప్పడం మొదలు పెట్టింది.నేను స్ప్రుహ కోల్పోవడం మొదలైంది.స్ప్రుహ కోల్పోతున్నాను..   కోల్పోతున్నాను.....  కోల్పోతున్నాను.... ఇంతలో ఎవరది అని పిలుపు వినిపించి ఒక్కసారిగ స్ప్రుహలోకి వచ్చి పడిపోయేవాడినల్లా నిల దొకుకుని వెను తిరిగి చూసా. మా వూరి మల్లయ్య నా వెనుకాల నిలబడి చీకట్లో నన్ను తెరిపార చూసి " మీరా బాబు గారు ఏవెళలో ఇటు ఎక్కడనుంచి వస్తున్నారు" అన్నాడు. "ఎమి లేదు మల్లయ్య, ఇటు పొలంకెల్లి వస్తున్నాను" అని చెప్పిమల్లయ్య తోడు రాగా ఊళ్లోకి వచ్చాను. నాకేమి అనిపించలేదు.

   అయా! ఇదీ కథ ఇందులో నా సందేహం ఏమిటంటే అంతో ఇంతో సైన్స్ పరిజ్గ్నానం ఉన్న నాకు అది దెయ్యం కాడు అని తెలిసి దైర్యంగా ఎందుకు ముందు అడుగు వెయ్య లేక పోయాను. ఎందుకు స్ప్రుహ తప్పాల్సి వచ్చింది. ఈ ప్రశ్నకు సమాదానాలు తెలిసీ చెప్పక్క పోయారో "మీ ఎలుకలు ఎదురు తిర్గు గాక". అదేనండి మీ సిస్టం మౌస్ లు’.               

Comments

  1. Replies
    1. నిజమే దిలీప్ గారు రెండు విరుద్ద బావాలు మనలో సంఘర్షనకు గురిఐతే రక్షణ చర్యగా మన మెదడు తగిన సంకేతాలు ఇచ్చి మనల్ని స్ప్రుహ కోల్పోయెలా చేస్తుంది.

      ఇక్కడ గమనించాల్శింది ఏమిటంటే నాలో అనువంశికంగా వస్తున్న దయ్యం అనే బావనకు, నేను నేర్చుకున్న్న సైన్స్ బావనకు పరస్పరం జరిగిన తీవ్ర సంగర్షన నాలోని అనువంసిక బావనను అదిగమించలేక కనీసం నన్ను రక్షించాడనికి నా మెదడు తీసుకున్న చర్యయే స్ప్రుహ తప్పబోవడం అని నెను బావిస్తున్నాను. మా బ్లాగు ను దర్షిచినందుకు దన్యవాదములు

      Delete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం