ప్రస్తుతం ప్రజలకు కావాల్సింది, ప్రజా సేవకులు కాదు ప్రజా నాయకులు

                                                                  


                          అవును ప్రస్తుతం ప్రజలకు కావాల్సింది, ప్రజా సేవకులు కాదు ప్రజా నాయకులుమాత్రమే. నేనేందుకు ఇంత గట్టిగ ఈ విషయాన్ని నొక్కి చెపుతున్నానంటే గత 6౦ సంవత్సారాలుగ మనం చూస్తున్న మన ప్రజాస్వామ్య వ్యవస్త మేడిపండులాంటిది. "మేడిపండు చూడ మేలిమై ఉండు,పొట్ట విప్పి చూడ పురుగులుండు".అని పెద్దల ఉవాచ. ఈ పోలికి మన ప్రజాస్వామ్య వ్యవస్తకి సరిగ్గా సరిపోతుంది. నిజానికి మనలో చాల మందికి మన వ్యవస్త మీద నమ్మకంలేదు. అంటే ఈ వ్యవస్త లో,నీతి పరుడైన రాజకీయ నాయకులు ఉండరని అవినీతికి పాల్పడడం సర్వసాదరణమని, కాబట్టి అవినీతి పేరుమీద రాజకీయ నాయకులను వేదించడం రాజకీయ కక్షల్లొ బాగం తప్ప వేరు కాదని, అని ప్రజలు చాలమంది ఇటీవల రాష్త్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల పట్ల వ్యాఖ్యానిస్తున్నారు.రాజకీయనాయకులు సరే వారి వారి పార్టీల ఆసక్తులకు అనుకూలంగ మాట్లాడుతున్నారు అంటే అర్థం ఉంది. కాని సామాన్య ప్రజలు సైతం చాలమంది ఇటువంతి అబిప్రాయాల్నే వ్యక్తం చేస్తుంటె ఆశ్చర్యం వేస్తుంది. ఇలా వ్యాక్యానించే ప్రజలు ఎవరు కూడ వారు సమర్దిస్తున్న రాజకీయ నాయకుల అవినీతి కుంభకోణాలలో భాగస్వాములు కారు. అయినా సరే అవినీటి రాజకీయ నాయకులను గుడ్డిగ సమర్థిస్తున్నారు. మరి ఈ ప్రజలే రెపు ఎన్నికలలో కాబోయే పాలకులను తమ ఓట్ల ద్వార నిర్ణయిస్తారు. మరి అటువంటపుడు ఎటువంటి పాలకులు దాపురిస్తారో మనం వూహించవచ్చు.కాబట్టి చైతన్యం లేని ప్రజలు ఉన్న చొట ప్రజాస్వామ్యం దారుణంగా విపలమవుతుంది ఇది తద్యం

మేము ఆద్యాత్మికపరులమైనప్పట్టికి, మా విధానం మనవువాదం కాబట్టి, పాలకులు అంటే ఎవరు? వారు ఎలా ఉండాలి అనే దాని మీద కొన్ని నిచ్చితాభిప్రాయలున్నయి.వాటి గురించి మీకు వివరిస్తాను. కొంచం బోర్ అనుకోకుండా పరిశీలీంచమని మనవి.

   అసలు రాజకీయ చైత్యనం లేని ప్రజలకు కావల్సింది ప్రజా సేవకులా ?ప్రజా నాయకులా?.ఇక్కడ ప్రజాసేవకులకు, ప్రజా నాయకులకు మద్య తేడా ఏమిటో తెలిస్తే తప్ప మీరు ఒక అభిప్రాయానికి రాలేరు. ప్రజా సేవకుడు అంటే ప్రజల చేత ఎన్నుకోబడినవారు లేక నిర్ణయించబడిన వారు. ప్రజానాయకులు అంటే వారు జన్మత సేవాగుణం కల్గిఉండి,సంక్షొభ సమయాలలో కాని, అవసరమైనప్పుడు కాని ప్రజలకు నాయకత్వం వహించి వారికి మార్గ నిర్దేశనం చేస్తారు. ఉదాహరణకు గాందిగారు ఇతర వెనుకటి తరం నాయకులు ఈ కోవలోకే వస్తారు. ప్రజా సేవకులు అంటే ఎవరో మీకు నేను విడిగా చెప్పనవసరం లేదనుకుంటా.

  సాదారణంగా తగు జాగ్రత్తలు లేని యజమాని ఉన్నచోట సేవకులు దొంగలుగ మారడానికి ఎక్కువ అవకాశం ఉంది. అందుకే మనం చూస్తుంటాం, నమ్మకమైన పనివాళ్ల్లు కావాలని ఇంటి యజమానులు ఆరా తీస్టుంటారు.కాబట్టి చోరత్వం అనేది సేవకుడి సహజ బుద్ది అని పండితుల అభిప్రాయం.అందరు అలా కాక పోవచ్చు.చాల తక్కువ మంది నీతిగ ఉంటారు.కాబట్టి వారి మీద యజమానుల నిఘా సదా అవసరం. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులు కాబట్టి, పాలకులు ప్రజాసేవకులే కాబట్టి, సామాజిక,రాజకీయ,చైతన్యంలేని ప్రజలున్నప్పుడు వ్యవస్త ఎక్కువ శాతం అవినీతి మయమవుతుంది.అలాంటి చోట ప్రజలు సులువుగా దోపిడికి గురి అవుతారు. కాని విచిత్రం ఏమిటంటే వారి సంపద డొపిడికి గురి కాబడుతుందని తెలియని దౌర్బాగ్య స్తితిలో ప్రజలు ఉంటారు. ఆందుకే బ్రహ్మం గారు తన కాలగ్నానం లో అంటారు"ఈ కాలం లో చోరులు పాలకుల రూపంలో ఉంటారు" అని. ఒక వేల ఎవరైనా ప్రజలకు ప్రజాసేవకుల చోరత్వం గురించి చెప్పిన వారి నిర్భాగ్యత్వం వారిని అలోచింపనివ్వదు. అందుకే వెమన గారు చాల చక్కగ చెప్పారు,

                         "కోతిని పట్టి తెచ్చి,కొట్ట పట్టం కట్ట బెట్టి,

                           కోండ ముచ్చులెల్ల గొలిచినట్లు

                           నీతిహీనుని వద్ద నిర్భాగ్యులుందురు,

                           విశ్వదాబి రామ! వినుర వేమ!

అందుకె చైతన్యం లేని ప్రజలకు ప్రజానాయకులే కావాలి, ప్రజాసెవకులు వల్ల హాని ఉంటుందనేది. మరి ప్రజా నాయకులు ఎవరు అనేదాని గురించి తరవాతి టపాలో చెపుతాను. (సశేషం)

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం