వేద కాలంలో ప్రక్రుతి స్టార్లు దేవతలు,సైన్స్ కాలంలో క్రికెట్ స్టార్లు, సినీస్టార్లే దేవతలు.
వేద కాలంలో మనం ప్రక్రుతి దేవతలు అయిన ఇంద్ర,వరుణ మిత్ర, అలాగే వన దేవతలను పూజించినట్లు వేదాల వల్ల తెలుస్తుంది.ప్రక్రుతిని దెవతా స్వరూపంగా నమ్మి సాగించిన మన పరిశోదనా ప్రస్తానం నేటి విజ్గ్ణానం నకు మూలం.కాని కొంతమంది సైన్స్ ప్రియులు వేదాలను అపహాస్యం చేస్తూ, తామేదో ఒక్కసారిగా సైన్స్ గ్రహాల నుంచి వూడి పడిన రోబో లాగ ప్రవర్తించడం అశ్చర్యం కలిగిస్తుంది.
వీరికి ఎంత సేపు పాత తరాల విజ్ణానం ని విమర్శించడం తప్ప,నేటి విజ్గ్ణాన అవిష్కరణలకు అదే పునాది అని తెలిసికో లెకపోవడం విచిత్రం. మన పురాణాలను,ఇతిహాసాలను,ఆచారాలను తిట్టడమ్ వీరికి ఫాషన్ అయి పోయింది.అదే ఈ దేశంలో వేరే మత ఆచారాలను విమర్శించ గల దమ్ముందా? అలా జరిగిన మరుక్షణమే వారి బ్రతుకు బస్ స్టాండ్ అవుతుందని బయం. ఈ దేశములో చీము నెత్తురు లేకుండా బ్రతుకుతుంది హిందువులే. ఆందుకే మన ఆచారాలు పంగ నామాలయ్యాయీ.మనమేమో వెర్రి వెంగలప్పలయ్యాము.
వీరి ఆదునిక బావాజాలానికి, ఆ నాడు ప్రక్రుతి దేవతలను పూజించిన మనిషి మూర్కుడయితే,మరి ఈ నాడు క్రికెట్ స్టార్లను,సినీ స్టార్లను వెర్రి అభిమానం తో కొలుస్తూ, తమ జీవితాలను పాడు చేసుకుంటున్న వారినేమనాలి? మీకు దమ్ముంటే అటు వంటి మూర్కత్వాలను విమర్శించి చూడండి.అప్పుడు అంటారు మిమ్మల్ని జ్ఘ్నానులని.గతించిన పాత గురించి కాదు. నేటి కొత్త మూర్కత్వం గురించి ఆలోచన చెయ్యాల్శిందింగా ఆదునికులకు మనవి
Comments
Post a Comment