లేచిపొండి ప్రేమికులారా! పోతే పొయేదేమి లేదు,మీ కామబాధలు తీరటం తప్ప!
మన సమాజంలో ఇటీవలి పరిణామాలు చూస్తే కొంతమంది మన పిల్లలకు ఇటువంటి సందేశమే ఇస్తున్నారా అనిపించక మానదు.వ్యవసాయం చేసే వారికి తెలుసు.గిత్తలను(కోడె దూడలు), వ్యవసాయ పనులు చేసే విధంగా మార్చాలంటే తగిన తర్ఫీదు ఇస్తారు.దీనినే ’సాగవెయ్యడం’ అంటారు. కేవలం జాతి సంతానోత్పత్తికి కొన్ని గిత్తలను ఆబోతులుగా వదలి వేస్తారు. వ్యవసాయాలు నడవాలంటే ఈ ప్రక్రియ కంపల్సరి.
అలాగే సంసారాలు సజావుగ, ఒక నిర్మాణాత్మక పద్దతిలో సాగటానికి చిన్నప్పటినుండే మన పిల్లలకు తర్ఫీదు ఇస్టుంటాం. వారు సమాజంలో జరుగుతున్న పరిస్తితులను గమనిస్తూ తమ భవిష్యత్తు ప్రణాళికను ఏర్పరచుకుంటారు.క్రమశిక్షణ గల కుటుంబాలలోనుంచి వచ్చిన పిల్లలు ఇటు కుటుంభ అటు మంచి సమాజ నిర్మాణంలోను ప్రభావం చూపుతారు
మనిషి వయోదశల్లో, కౌమార దశ అత్యంత ప్రమాదకరమయింది. ఈ దశలో ఎంతటి క్రమశిక్షణ గలవారయినా ఏ మాత్రం అవకాశం వున్నా, వయసు పోరుకి తట్టుకోలేక తప్పటడుగులు వేస్తుంటారు.చివరకు కళ్లు తెరిచి చూసే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోయి, బాదతో కుమిలిపోతు,అపరాద బావాలతో జీవితం నరక ప్రాయం చేసుకుంటున్నారు. కాబట్టి ఈ దశలో జాగరూకతో కూడిన పెద్దల పర్యవేక్షణ నిర్ంతరం అవసరం.వారి పర్యవేక్షణకు చట్ట దన్నూ అవసరమే.
18 యేండ్లు నిండితే చాలు, తమను చట్టం యేమి చెయ్యలేదన్న, దీమాతో కొంత మంది కుర్రకారు ప్రేమ పేరుతో అమ్మాయల్ని ట్రాప్ చేసి, స్నేహితుల సహయంతో,లేవదీసుకుపొయి, తమ పశు వాంచలు తీర్చుకుని, తిరిగి అమ్మాయల్ని వాల్ల ఖర్మలకు వదిలేస్తుంటే తల్లి తండ్రులు యేమి చెయ్యాలి? అంత పద్దతి గలవాల్లయితే మీ అమ్మాయిని అదుపులో పెట్టుకోవచ్చుగా, అని కొందరు ఉచిత సలహాలు పడేస్తారు. నిజమే,కాని అలా అదుపులో పెట్టుకునే అవకాశం ఈ దరిద్రపు చట్టాలు వల్ల కోల్పోతే,అలా తప్పులు చేసిన వారికే పొలిస్ స్టేషన్లు కల్యాణ మండపాలు అవుతుంటె ఎలా పిల్లల్ని రక్షించుకోవాలి. అలా పెళ్లిలు చేసిన చట్ట రక్షకులు అమ్మాయిల సంసారాలకు గ్యారంటి ఇవ్వగలుగుతారా? తల్లి తండ్రుల స్తానాని వారు భర్తీ చెయ్య గలుగుతారా? లేదు. పేరు కోసం నాలుగు ఫొటోలు, మీడీయా కవరేజ్ ఇవి చాలు వారికి. తెల్లారి ఎవరెటు పోతే వారికే. అంతిమంగా బాదపడేది కుటుంబ సభ్యులేగా.
అసలు నాదొక దర్మసందేహం! వివాహమనేది మతపరమయినదా? సెక్యులర్ పరమయినదా? ఎందుకంటె మతపరమయితే రాజ్యం జోక్యం చేసుకోరాదు. కాని కొన్ని శక్తుల ప్రోద్బలంతో ఈ దేశంలో మేజర్ మతాన్ని దెబ్బ తీయాలనే కుట్రలో బాగంగానే మన మతాచారాల మీద, సాంప్రాదాయాల మీద ఒక పద్దతిలో దాడులు చేస్తూ, దానికనుగుణంగా పాలకులను ప్రబావపరుస్తున్నారు. ఈ నాడు రెడ్ లైట్ యేరియాలలో లక్షల మంది ఆడ పిల్లలు తమ జీవీతాలను నాశనం చేసుకుంటున్నారంటే దానికి కారణం ఈ దేశంలో విదేశి బావజాలాల నుండి పుట్టిన అడ్డగోలు వాదాలే. ప్రజలకు జ్గ్నానం కంటె ముందు విశ్రుంఖల స్వేచ్చ ముఖ్యమన్న వీరి అడ్డ గోలు వాదన మన ఆడ పిల్లల్ని వ్యభిచార గ్రుహాలలో మగ్గెట్టట్లు చేస్తుంది.ఇది వ్యాపార వాదుల కోరికలు తీర్చడానికే వీరి అడ్డగోలు వాదనలు ఉపయూగపడ్డాయి.
కాబట్టి ఓ హిందువుల్లారా! ఇకనైనా మేల్కొనండి. మన పిల్లల్ని రక్షించుకోవడానికి ముందుకు రావల్సిన అవసరం ఉంది.
ఇంకా తెలుసుకోవాలంటే క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యండి
Comments
Post a Comment