"భర్త జైలులో ఉన్నా , భార్యా పిల్లల్ని కనవచ్చు" అన్న పంజాబ్ హర్యానా హైకోర్టు !!

                                                                     


           మొన్న పంజాబ్ హర్యానా హైకోర్టు వారు ఒక సంచలనాత్మక తీర్పును వెలువరించారు . "జైలులో ఉన్నవారు  వివాహితులు అయి ఉండి ,పిల్లలు కావాలని కొరుకుంటూంటె ,అట్టి వారికి తమ వైవాహిక బాగాస్వాములతో సెక్స్ వల్ గా కలవడానికి జైలు అధికారులు తగిన ఎర్పాటులు చెయ్యాలి . తమ వారసత్వాన్ని అభివృద్ధి చేసుకోవడం అనేది పౌరులకు ఉన్న ప్రాదమిక హక్కు . అట్టి హక్కు అమలుకు జైలులో ఉన్న  ఖైదీలు కూడా అర్హులే ".. ఇదీ  హైకోర్టువారి తీర్పు !

హోషియా పూర్ కు చెందిన భార్యా భర్తలు జస్వీర్ సింగ్, సోనియా .ఒక ధనిక కుటుంభాన్ని బ్లాక్ మెయిల్ చేసి పెద్ద మొత్తంలో డబ్బు గుంజాలన్న దురాశతో ,వారి 16 ఏండ్ల కుర్రవాడిని కిడ్నాప్ చేయడమే కాక ,హత్య చేసిన కేసులో ట్రయిల్ కోర్టు వారికి మరణ శిక్ష విదించింది . వారు పంజాబ్ హర్యానా హై  కోర్టులో అప్పీల్ చేసుకున్నందు వలన  మరణ శిక్ష అమలును తాత్కాలికంగా ఆపి ,హై  కోర్టు వారి ఆదేశాలు అనుసారం వారిని పాటియాలా సెంట్రల్ జైలులో ఉంచటం జరిగింది . అప్పీల్  పెండింగ్ లో ఉంది . 

జస్విర్ సింగ్  తండ్రికి ,జస్విర్ సింగ్ ఒక్కడే కొడుకు . అతని తర్వాత వారసులు ఎవరూ లేకపోవటం వలన ,తమ వారసత్వ అభివృద్ధి కోసం ,తాము సెక్సువల్ గా కలవడానికి ,పిల్లల్ని కనడానికి అనుమంతించాలని ,హై కోర్టుకి ఆ ఖైది దంపతులు పిటిషన్ పెట్టుకున్నారు .. జస్వంత్ సింగ్ దంపతులు చేసిన నీచాతి నీచమైన హత్య కేసును ద్రుష్టిలో పెట్టుకుని ,వారి కోరికను త్రోసి పుచ్సినా , ఖైదీ ల సంసార ,పునర్య్త్పత్తి హక్కులను ప్రస్తావిస్తూ ,హై కోర్టు పై విదంగా తీర్పును ఇవ్వడం జరిగింది . అయితే ఈ విషయంలో తగిన మార్గాదర్శకాలు  అంటే,  ఎటువంటి ఖైదీలు  సంసార హక్కు అమలుకు అర్హులు? వారి కొసం జైలులో ఎలాంటి ఏర్పాటులు చేయాలి ?అనే వాటిని పరిశీలించి ప్రభుత్వానికి 
సిపార్సులు చేసేందుకు ,హై కోర్టు మాజీ న్యాయమూర్తి అద్యక్షతన జైలు సంస్కరణల కమిటి ఏర్పాటు చేయాలని అదేసించింది . అలాగే భార్యా భర్తలు ఇరువురు జైలు ఖైదీలు అయినప్పటికీ వారికి గల సంసార హక్కును అమలుచెసుకొవడానికి వారిని కూడా కమిటి విచారణ అంశాల  లిస్టు లో చేర్చాలని అదేశించిoది. 

   దీనితో దొర కైనా ,దొంగ కైనా సంతానాభివ్రుద్ది హక్కుఅనేది  ప్రాదమిక హక్కుగా ఉంటుందని , సెక్స్ ను కేవలం అనందం కోసం కాకుండా సంతానం కోసం కోరినట్లయితే ,చట్టబద్దం గా అర్హులైన భార్యా భర్తలకు ప్రభుత్వాలు తగిన ఏర్పాటులు  చేయాల్సిందేనని తేల్చి చెప్పినట్లు అయింది . పాపం ! ఈ తీర్పు లెస్బియన్ ,గే ,లకు చెంప పెట్టు లాంటిదే !ఇకనుండి ప్రతి జైలు లో "సంసార గదులు " ఏర్పాటు చేస్తారు అన్నమాట !

Source:http://timesofindia.indiatimes.com/india/High-Court-allows-jail-inmates-to-have-sex-with-their-partners/articleshow/45785525.cms

                                                 (9/1/2015 Post Republished).

Comments

  1. ఇంకొక సంచలనాత్మక వార్త

    Germany Green Party pledges to pay for free sex with prostitutes for anyone who needs 'sexual assistance' and can't afford it
    German Green Party care spokeswoman Elisabeth Scharfenberg revealed plans

    She said doctors should be given the right to issue free prescriptions for sex

    Patients would need a medical note saying they can't get sex any other way

    Prostitution is legal in Germany and women have been selling sex in care home


    Read more: http://www.dailymail.co.uk/news/article-4101376/Sex-prostitutes-paid-Government-needs-sexual-assistance-afford-hooker-German-Green-Party-plans.html#ixzz4VGqdM4rc
    Follow us: @MailOnline on Twitter | DailyMail on Facebook

    ReplyDelete
  2. అన్న్ని ఉచిత స్కీములు అయిపోయాయి ఇప్పుడు సరికొత్త ఉచిత పథకం జర్మనీ రాజకీయపార్టి ప్రతిపాదిస్తున్నాది

    ReplyDelete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!