"బెత్లేహాం" లో పుట్టిన రోజు జరుపుకున్న వ్యక్తి,మన రాష్ట్రం లో హిందూ సంస్దల నియంత్రణాధిపతి!

 
                                                                           


                                                 అవును ఇది అక్షరాలా నిజం. మన రాష్ట్రంలో మైనార్టి మతస్తుల కున్న మత స్వేచ్చ హిందూ మతస్తులకు లేదు. కారణం అంద్ర ప్రదేష్ ఎండోమెంట్ చట్టం. దీని ప్రకారం రాష్ట్రంలోని అన్ని హిందూ మత సంస్తలను ప్రభుత్వం నియంత్రిస్తుంది.దీనికి ప్రత్యెకంగా శాఖ, మంత్రి ఉన్నప్పటికి, అంతిమ నిర్ణయాదికారి ముఖ్యమంత్రే కాబట్టి ఈ సంస్త లన్ని ఆయన అదికారానికే లోబడి పని చేస్తుంటాయి.

                            మనది లౌకిక రాజ్యం కాబట్టి ఏ మతస్తులయినా ముక్యమంత్రులు కావచ్చు. అదే విదంగా గతంలో ఒక ముక్యమంత్రి గారు ఉండెవారు. వారు తమ పాలనను దేవుడి పాలన గా అభివర్ణించుకున్నారు కాని దేవుడు అంటే ఎవరో చెప్పలేదు. ఆయన ప్రక్కా  మత విశ్వాసి. ఎంత విశ్వాసం అంటే తన పుట్టిన రోజును తమ దేవుడు పుట్టిన బెత్లేహాం లో జరుపుకునేటంతా!మరి అటువంటి  మత విశ్వాసి పాలనలో అదిక శాతం మంది ఆయన సామాజిక వర్గానికి చెందిన వారు ఆయన అనుసంరించిన మతంలోకి మారిపోయారు(మార్చబడ్డారు అని చాలామంది అభ్హియోగం).ఆయన గారి సతీమణి చేతిలో ఆ మత గ్రంథం లేనిదే బయటకు వెళ్ళరు.ఇదీ అయాన చరిత్ర.సరే ఇవన్ని అయన వ్యక్తి గత విషయాలు కాబట్టి మనకనవసరం.

                                                                 

Lord Lakshmi Narasimha Temple ,Garloddu.



                                 కాని మేమడిగేది ఏమిటంటే ఇటువంటి అన్య మతస్తులు హిందూ సంస్తలకు అదిపతుల్ని చేస్తున్న చట్టాలను అమలు చెయ్యడం ఎంతవరకు సమంజసం?.మను ధర్మ శాస్త్ర ప్రకారం జీత భత్త్యాలు తీసుకుని దైవ పూజలు చెయ్యడం మహా పాపం.అటువంటి వారు వచ్చే జన్మలో జంతువులై జన్మిస్తారని ఉంది.కాని పాపం మన రాష్ట్రంలో పూజారులను ఈ పాపానికి ఒడిగట్టేలా చేస్తుంది "ఎండోమెంట్ ఏక్ట్". హిందూ ధర్మం ప్రకారం పూజారులకు ఇచ్చిన మడులూ, మాన్యాలూ తీసివేసి, వారిని నెలసరి జీతగాళ్లని చేసారు.హిందూ మత సంస్తలన్నింటిని  రాజకీయ నిరుద్యోగుల పునరావాస కేంద్రాలు చేసారు.అన్య మతస్తులను అంతిమ అదిపతిని చేసారు.పవిత్రమయిన ఏడుకొండలు సహితం హిందూ సంస్తలవి కాదని, ఒకటి మాత్రమే తిరుమల దేవస్తానిదని వాదించే స్తాయికి వెళ్లారు అంటె ఇదంతా "ఎండోమెంట్ చట్టం". మహిమే.

Lord Venkateswara Temple, Tirumala


  మన మతం లొనుంచి పుట్టిన సిక్కులను చూద్దాం.అక్కడు మంత్రి అయినా సరే తప్పు చేస్తే గురుద్వారా ల ముందు చెప్పులు తుడిచి పాప ప్రక్షాళన చేసుకుంటారు. కాని ఇక్కడి హిందూ అధికారులు అదే మంత్రుల చెప్పులు మోయాడానికి వెనుకాడరు.రాజకీయ నాయకులు ఆ దగ్గరి ప్రాంతానికి వచ్చి, దేవాలయాన్ని సందర్శించకపోయినా, తీర్త ప్రసాదాలు వారున్న చోటికే తీసుకు వెళ్ళి, దేవుడి కటాక్షం కంటే వారి కటాక్షమే గొప్పదని బావిస్తునారు అంటే ఇదంతా చట్ట నియంత్రణ పేరుతో హిందూ సంస్తలను రాజకీయ నాయకులు తమ గుప్పిటలో పెట్టు కోవడమే. కాని విచిత్రమేమిటంటె అన్ని మతాలు మాకు సమానమని చేప్పే ఏ నాయకులు ఇతర మత సంస్తల మీద ఈ నియంత్రణను విదించక పోవడం.

కాబట్టి హిందువులారా! ఇకనయినా మేల్కొనండి.హిందూ సంస్తల మీద రాజ్యం నియంత్రణ చెయ్యాలంటే (1)హిందూ మతాన్ని అదికారిక మతంగానైనా గుర్తించాలి.దీనివలన అన్య మతస్తులు అత్యున్నత పదవులు పొందే అవకాశం లేకుండా చెయాలి లేదా(2) అన్ని మతాలకు చెందిన మతసంస్తల మీద సమాన నియంత్రణ ఉండాలి.కాదంటే అసలు ఎండొమెంట్ ఏక్ట్ నే రద్దు చేయాలి.ఈ మూడింటిలో ఏది చేస్తారో ’పాదయాత్రల" పేరుతో తమ దగ్గరకు వస్తున్న నాయకులను హిందువులు అడగాలి.

                     జై హిందూ!      జై జై హిందూ!      
                                (7/11/2012 Post Republished).         

Comments

  1. ప్రస్తుతం హిందువులలో ఎక్కువభాగం ధర్మ నిష్ఠలేనివారు కావటం విచారకరం. దీనివల్లనే ఇన్ననర్ధాలు

    ReplyDelete
  2. మీరన్నది నిజం దుర్గేశ్వర గారూ.కేవలం తాత్కాలిక లబ్ది కోసం భవిష్యతులో ఏర్పడే ప్రమాదాని గ్రహించలేక పోతున్నారు.అన్య మతస్తులు సేవా సంస్తల పేరు చెప్పి కొన్ని వేల ఏకరాలు భూములను పొందుతుంటే హిందూ సంస్తల ఆస్తులు రాజకీయ నాయకుల నిర్వాకంతో రొజు రోజుకి కను మరుగయి పోతుంటే దీని మీద ఒక ఉమ్మడి ప్రణాలికతో ఎదుర్కోవల్సిన హిందువులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం ఎంత ప్రమాదాన్ని కొని తెచ్చుకోబొతున్నారో అర్థం చేసుకోవాలి.

    ReplyDelete
  3. మీరు చెప్పినది ముమ్మాటికీ నిజం .
    అన్ని మతాల ప్రార్ధనా మందిరాలూ ప్రభుత్వం క్రింద ఉండాలి లేదా హిందూ దేవాలయాలు కూడా స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉండాలి.

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనకు దన్యవాదాలు jsnrao గారు

      Delete
  4. మీ వ్యాఖ్యల తో పూర్తిగా ఏకిభవిస్తున్నాను .

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనకు దన్యవాదాలు సుమ గారు

      Delete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!