గోకుడుకు మందు ఇస్తా రమ్మని , 15 యేండ్ల విద్యార్థిని గోకడం మొదలెట్టిన 35 యేండ్ల గిరిజా !!?
అయితే ఈ విషయం లో , తమ లైంగిక వికారాలు కు మైనర్లను వాడుకోవడం లో మాములు వ్యక్తులే కాదు , పదిమందికి ఆదర్శంగా ఉంది బావి పౌరులను తీర్చి దిద్దడాల్సిన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న కొంతమంది పంతుళ్ళకు, కొంత మంది పంతులమ్మలు ఏ మాత్రం తీసిపోరని , అక్కడక్కడా మన దేశం లో జరుగుతున్న విపరీత సంఘటనలు తెలియ చేస్తున్నాయి. నిరుడు తమిళ నాడులో తాను పాఠాలు చెప్పే మైనర్ విద్యార్థిని లేపుకు పోయి పెండ్లి చేసుకుని , గర్భవతి అయింది పాతికేళ్ళు పై బడిన ఒక లేడి టీచర్ .మొన్నటికి మొన్న మన హైదరాబాద్ లోనే సమ్రీన్ అనే కుర్ర పంతులమ్మ తన కంటే 5 యేండ్లు చిన్న వాడు కి ఇంటర్మీడియట్ పాఠాలు చెప్పే మిషతో ముగ్గులోకి దించి , వాడితో తుర్రుమని లేచి పొతే , లబో దిబో అంటూ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు కుర్రాడి తల్లి తండ్రులు .
పోనీ పెండ్లిళ్లు కావడం కష్టం అని భావించిన కొంతమంది నెరజాణలు , ఈ విదంగా తమ కంటే చిన్న వారిని , మైనర్ లను లనే లైన్ లోకి దించితే సేఫ్ గా ఉంటుందని భావించి , వారితో లేచిపోవడానికి కు సై అంటున్నారు అంటే, చట్టప్రకారం అది నేరమే అయినా , కొంతవరకు అర్ధం చేసుకోవచ్చు. కానీ పెండ్లి అయి , ఇద్దరు బిడ్డలకు తల్లి అయిన 35 యేండ్ల స్త్రీ , తన కొడుకు వయసుతో సమాన వయసున్న 15 యేండ్ల మైనర్ విద్యార్థిని , తన కామ వికారాలు కు బలి చేసి , అతని జీవితాన్ని పాడు చేయడం ని ఎలా అర్ధం చేసు కోవాలి . ఈ మధ్యనే పుదుచ్చేరి లో జరిగిన ఈ కేసు వివరాలు ఏమిటంటే :
పుదుచ్చేరి లో 15 యేండ్ల అబ్బాయి 10 వ తరగతి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు . వారి ఇంట్లోనే గిరిజ అనే ఆవిడా తన ఇద్దరు పిల్లలతో అద్దెకు ఉంటుంది . గిరిజ వయస్సు 35 సంవత్సరాలు , పైగా ఇద్దరు పిల్లలు తల్లి కాబట్టి , తమ పిల్లవాడు ఆమె ఉండే పోర్షన్ లోకి తరచూ వెళ్లి వస్తున్నా , పెద్దగా పట్టించుకోలేదు కుర్రాడి తల్లి తండ్రులు . కానీ రాను రాను కుర్రాడి ప్రవర్తనలో వస్తున్నా విపరీతపు మార్పును గమనించిన అతడి తల్లీ , అనుమానం తో ఒక రోజు కుర్రాడి పర్సనల్ డైరీ తిరగేసి చుస్తే , అందులో గిరిజ మేమ్ సాబ్ తో కుర్రాడు నడుపుతున్న బాగోతం అంతా తెలిసి పోయింది . దానితో గిరిజాకు వార్ణింగ్ ఇవ్వడమే కాక తక్షణమే తన ఇల్లు ఖాళి చేయాలని చెప్పింది అట. అంటే కాకుండా పిల్లల సంక్షేమ కమిటీ వారికి కంప్లైంట్ చేస్తే వారు వచ్చి విచారణ చేయగా , గిరిజా నెరజాణత్వం బయటపడింది. అదేమిటంటే
మైనర్ కుర్రాడికి అనుకోకుండా చర్మ సమస్యలు ఏర్పడి తరచూ గోక్కోవడం మొదలు పెడితే , అది చూసిన తోటి విద్యార్థులు గేలి చెయ్యడం మొదలు పెట్టారు అట. దానితో ఆ కుర్రాడు సిగ్గుతో కుంచించుకు పోవడం చూసి , కారణం కనుకుంది గిరిజా . నా దగ్గర మందు ఉంది ఇస్తాను రా అని కుర్రాడిని ఆహ్వానించి , తానే స్వయంగా మందు పూయడం మొదలు పెట్టినట్లుంది . అలా కొన్నాలు గడిచేసరికి పోరగాడికి వచ్చిన దురద తగ్గింది కానీ , వారిలో కొత్త దురద మొదలు అయి వారిని ఇక చేసింది. దీనితో విద్యార్థి చదువు అటకెక్కివుంటుంది. చివరకు కుర్రాడి తల్లి కంప్లైంట్ తో పోలీసులు Section 8 (punishment for sexual assault) of Protection of Children from the Sexual Offences (Pocso) Act క్రింద కేసు పెట్టి గిరిజ కోసం వస్తే ఆమె పరారు అయింది అట. ప్రస్తుతం ప్లోఇసులు ఆమె కోసం వెతుకుతున్నారు . అది కేసు.
పై సంఘటనలు వలన మనకు అర్ధమయ్యేది ఒకటే , పురుషుడు అయినా , స్త్రీ అయినా సమాజ కట్టుబాట్లకు లోబడి ఉండాలి. అలా కాకుండా "మై చాయిస్" అని తమ ఇచ్ఛ వచ్చినట్లు ప్రవర్తించే వెసులుబాటు ఉంటె నేరాలు చేయడానికి స్త్రీలు కూడా పురుషులకు ఏ మాత్రం తీసి పోరు. విశృంఖల స్త్రీ స్వేచ్చా వాదం పరిఢవిల్లుతున్న విదేశాలలో , చిన్న పిల్లలను తమ కామ వికారాలు బలి చేసే స్త్రీలకు కొదువ లేదట. చట్టాలు ఎంత పటిష్టంగా ఉన్నా , కట్టుబాట్లు లేని సమాజం లో ఇలాంటి విపరీతాలే కొనసాగుతుంటాయి .
Comments
Post a Comment