"నాయక్" కెజ్రివాల్ విషయంలో "మనవు" చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజమయింది !

                                                        
                                           కెజ్రివాల్ రాజీనామా చేసేసాడు

 కెజ్రివాల్ గారు "నాయక్ "{తెలుగులో ఒకే ఒక్కడు" ) అనే సినిమా స్పూర్తితో రాజకీయాలలోకి వచ్చినట్లుంది .టూకీగా ఆ సినిమాలో కూడా ఒకానొక సందర్బంలో ముక్యమoత్రి తో చాలెంజ్ చేసిన జర్నలిస్ట్ అయిన హిరో ఒక్క రోజు ముక్య మంత్రిగా పదవి చేపట్ట వలసి వస్తున్ది. అయితే అది సినిమా కాబట్టి హిరో గారు ఆ ఒక్క రోజులోనే అవినీతి పరులను ఏరి పారేస్తాడు . తనవెంట ఒక స్తెనొ ను తీసుకువెళ్ళి రేషన్ షాప్ డీలర్ మొదలు బడా ఆపిసర్ ల వద్దకు స్వయంగా తనే వెళ్లి అక్కడికక్కడే రూల్స్ ఏవి పాటించకుండా వారిని స్పాట్ సస్పెండ్ చేసేస్తాడు . ఇది చూస్తున్న ప్రేక్షకులకు అస్సలు సీట్లో కూర్చో బుద్ది కాదు . యమ హుషార్ వస్తుంది . నిజ జీవితంలో జరగని పనులు మూడు గంటల సినిమాలో చూసి అయినా ఆనందించే అల్పసంతోషం భారతీయ ప్రేక్షకులలో ఉంది కాబట్టి ఆ సినిమా నిర్మాతకు డబ్బులు తెచ్చిపెట్టి ఉన్దవచ్చు. కాని నిజ జీవితం లో అలా చేయాలని చూస్తె మాత్రం "ఎదురు దెబ్బలు" తప్పవు అని కెజ్రివాల్ గారి "జనలొక్ పాల్ " ఉదంతం తెలియ చేసింది .
  ఈ దేశంలో చాలా మంది మేధావులకు ఒక అపోహ ఉంది . ప్రజలు అందరూ  మంచోళ్ళు నాయకులే చెడి పోయిన వారని . ఒకవేళ అదే నిజమయితే లక్షలు కోట్లు దోచిన వారు సుద్దులు చెపుతూ దైర్యంగా ప్రజల మద్య తిరిగే వారే కాదు . యదా రాజా తదా ప్రజా అనే రోజులు పోయి యదా ప్రజా తదా నాయకా అనే రోజులు వచ్చినయి . ప్రజలకు నియమ నిబందనలు పాటించే నాయకుడు కంటే ఏదో రకంగా తమకు మేలు చేసే వాడు కావాలి తమ సబ్సిడీలు తమకు ఇస్తే నాయకులు కోట్లు దోచుకున్న పట్టించుకోని   ఔదార్యం మనలో ఉంది . అసలు రాజ్యాంగం అనేది లేకపోతె ఒక్క రోజు "నాయక్ "  సినిమా నిజజీవితంలో చూసేవారం . అలాగే ఆ తర్వాత "ఖల్ నాయక" లు కూడా ఉద్బవించి దేశాన్ని అల్ల కల్లోలం చేసే వారు .

  " పాలన అంటే అవినీతి పరులను జైలు కు పంపడమే " ఇది కెజ్రివాల్ గారి కొటేషన్ . చాలా బాగుంది . కాని ఏది చేసినా చట్ట బద్దంగా చేయాలి . అలా చేయాలి అంటే ఎంతో ఓర్పూ ,సహనం తో పాటు వాస్తవ పరిస్తితుల గ్రహింపు కావాలి . ఒక్క మాటలో చెప్పాలంటే "కృష్ణ రాజకీయం " చేయాలి . అనువైన వేళ చెలరేగి పోయినా , అనువు కాని వేళ ఒదిగి ఉండడం నేర్చుకోవాలి . ఆ ఇంగిత జ్ఞానం లేదు కాబట్టే కెజ్రివాల్ గారు రాజీనామా చేసే పరిస్తితులను స్వయంగా కొని తెచ్చుకున్నారు . ఆయనకు డిల్లి ప్రజల మిద బోల్డంత నమ్మకం అనుకుంట . ఈ సారి బంపర్ మేజార్తి తో గెలుస్తాను అని ఆశ కాబొలు. చూదాం ఏమి జరుగుతుందో ! మేజార్తి ని నిర్ణయించేది కేవలం 5 లేక 6 శాతం మంది ప్రజలు మాత్రమె అని అనుబవమున్న నాయకులకు తెలుసు. మరి అసలు ఏమి చేస్తే కెజ్రివాల్ డిల్లి పీటం ని నిలబెట్టుకుని సక్సెస్ అయ్యే వాడు అనేది ఆలోచిస్తే నేను ఇంతకూ ముందు టపాలో చెప్పినట్లు చేస్తే కొంత పలితం ఉండేది .

 నేను ఇంతకు ముందు టపాలో "   " ఇంకొక ప్రక్క ఆం ఆద్మీ పార్టీ కంటే ఎక్కువ సీట్లు గెలుచుకున్నB.J.P   పార్టీ  ప్రధాన ప్రతి పక్షం గ ఉన్నంత కాలం, ఆం ఆద్మీ వారి పాలన తుమితే ఊడి పోయే ముక్కు లాంటిదే . అసలు ఆం ఆద్మీ పార్టీ అధినాయకుడు కి పాలనా పగ్గాలు చేపట్టడానికి ఎవరి సహాయం తీసుకోవాలి అన్న విషయం లో సరి అయిన నిర్ణయం తీసుకోలెదు అని పిస్తుంది. తమ పార్టీ ప్రాదాన అజెండ అవినీతి నిర్మూలన అయినప్పుడు , పోయి పోయి, దేశం లోని అవినీతికి మూల కారణమయిన కాంగ్రెస్ పార్టీ వారి సహాయం తీసుకోవడం ఏమిటి? విడ్డూరం కాకపోతే!తమకు కాంగ్రెస్ మరియు B.J.P పార్టీలు రెండు శత్రువులే అని ప్రకటించిన పెద్ద మనిషికి, అవినీతి విషయం లో ఎవరు ప్రదాన శత్రువు, ఎవరు ద్వితీయ శత్రువు అని ఆలోచించే ఇంగిత జ్నానం లేక పొయింది . కమ్మ్యునిస్ట్ సిద్దాంతం ప్రకారం బడా బూర్జువాలను ఎదుర్కోవాలంటే , అంత కంటే తక్కువ బూర్జువాలతో కలసి పని చేయాలి. ఈ సూత్రమే కేజ్రీ వాల్ గారి డిల్లీ పాలన విషయం లో అనుసరిస్తే బాగుండేది. అవినీతి విషయం లో  కాంగ్రెస్ కంటే మెరుగయిన B.J.P వారి సహాయంతో పాలనా పగ్గాలు చేపడితే సత్పలితాలు పొంది ఉండే వారు." అని స్పష్టంగా కెజ్రివాల్ గారి పాలనా విదానం మిద నా అభిప్రాయం చెప్పాను . నా అభిప్రాయం నూటికి నూరు పాళ్ళు కరెక్టే అని నిన్న డిల్లి అసెంబ్లీలో జరిగిన ఉదంతం తెలియ చేస్తుంది .
     
 నేను ఇంతకూ ముందు ఇదే విషయమై ప్రచురించిన టపా పుట్టగానే అవినీతి పొట్ట చీల్చడానికి ఆం ఆద్మీ కెజ్రివాల్ ఏమన్నా "నరసింహవతారమా !?" ని క్రింది లింక్ లో చూడండిhttp://ssmanavu.blogspot.in/2014/01/blog-post_17.html  

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

తిరుమల దేవస్థానం వివాదాన్ని, కమ్మ ,బ్రాహ్మణ సామాజిక వర్గాల మధ్య జరిగే వివాదంగా చూడటం ఎంతవరకు సమంజసం?

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

బాయ్ ప్రెండ్ ఇంట్లో పడుకున్న 16 యేండ్ల అమ్మాయి కి , 30 మంది రేప్ చేసాక కాని మెలుకువ రాలేదట!!!?

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )