సిమాంద్ర కి మరో "కేజ్రి వాల్ " కావాలని ఉవ్విలూరుతున్న సినిమా నటుడు" శివాజీ "
ఆ మద్య పాలెం దగ్గర జరిగిన "వోల్వో బస్సు" దుర్ఘటనలో 45 మంది దాక చని పోవటం దేశ ప్రజలను ముఖ్యంగా తెలుగు ప్రజలను కలచి వేసింది . అయితే సదరు వోల్వో బస్సు ప్రైవేట్ అపరేటర్లది కావడం , ప్రైవేట్ ఆపరేటర్ల చట్ట వ్యతిరేక విదానాలను రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ అధికారులు , పైసలకు ప్రలొబపడి చూసి చూడనట్లు ఉండటం మిద అనేక విమర్శలు వెలువెత్తెసరికి , అందుకు కిరణ్ కుమార్ గారి ప్రబుత్వం స్పందించి ఇప్పటి వరకు ఆకస్మిక దాడులు జరుపుతూ అక్రమంగా తిరిగే ప్రైవేట్ బస్ లను సిజ్ చేస్తూనే ఉంది .
నిజానికి పాలెం వద్ద దుర్ఘటనకు గురి అయిన బస్ ప్రైవేట్ బస్ కాబట్టి దాని యజమాని కాని , బస్సు కి ఇన్స్యూర్ చేసిన కంపెని కాని నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుంది . వాటి కోసం అస్సిడేంట్ క్లైమ్స్ ట్రిబ్యునల్స్ లో క్లైమ్ చేసి బాదితులు నష్ట పరిహారం పొందవచ్చు . అయితే జరిగిందో ఘోర దుస్సంఘటన కాబట్టి బాదితులె కాకుండా ,ప్రజలు కూడా సీరియస్ గా రియాక్ట్ అవ్వడం వలననే ప్రైవేట్ ఆపరేటర్ల మిద చర్యలు తీసుకుంది . అయితే ఈ సంఘటన ను డిల్లి లోని "నిర్భయ " సంఘటన లాగా చేసి దాని ద్వారా రాజకీయ ప్రక్షాళనకు శ్రీ కారం చుట్టాలని కొంతమంది వ్యక్తులు ప్రయత్నించారు . దానికి వత్తాసు పలికింది ముక్యంగా T.V. 9 చానల్ వారు . కొన్నాళ్ళు నిర్భయ ఉదంతంలో మాదిరి కొవ్వొతులు వెలిగించి అందోళన చేసారు . బాదితులు అందరిన్ కూడ గట్టి ఉద్యమం చేసినా ప్రబుత్వాన్ని, ప్రజలను పెద్దగా కదిలించలేక పోయిందనే చెప్పాలి . ఎందుకంటే ఆ కాజ్ లిమిట్ అంతవరకే .
ఆ ఉద్యమానికి ఒక సినిమా నటుడు బాగా స్పందించాడు . అ సందర్బంగా అతను ఇచ్చిన ఉపన్యాసాలు , చెప్పిన కవితలు వింటున్నప్పుడు, ఇతను మరో కెజ్రివాల్ లాగా జనం లో పోకస్ కావాలి అని అనుకుంటున్నాడా అని అప్పుడు నాకు అనిపించింది. అయితే నిర్భయ కి వచ్చినంత రెస్పాన్స్ కనీసం రాష్ట్ర స్తాయిలో పాలెం బస్ ఉద్యామానికి రాలేదు కాబట్టి , ఒక వేళ ఆ ఉద్యమం వెనుక ఎవరైనా స్పాన్సర్ లు ఉన్నట్లయితే వారు నిరాశ చెంది ఉండవచు . కాని ఇప్పుడు తెలంగాణా రాష్ట్ర విభజనకు పార్లమెంట్ ఆమోద ముద్ర వేయగానే దానికి కిరణ్ కుమార్ రెడ్డి గారిని , సిమాoద్ర రాజకీయ నాయకులను బాద్యులను చేస్తూ వారిని క్షమార్హులు కారు అని ప్రబొదిస్తో సేం నటుడు శివాజీ గారు బయటకు రావడం చూస్తుంటే అతని వెనుకాల ఒక రాజకీయ ప్రయోజనం ఆశించే గ్రూప్ ఉందని అర్ధమవుతుంది .
శివాజీ సొంటినేని అనే ఈ నటుడు "మ్యాంగో " అనే T.V లో ప్రసంగించిన పాఠం వింటుంటే అది ఖచ్చితంగా కిరణ్ కుమార్ రెడ్డి గారి బవిశ్యత్ రాజకీయాలను టార్గెట్ చేసి ప్రసంగించినట్లు ఉంది . రాష్ట్ర విభజనను సాకుగా చూపిస్తూ ఎక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు సిమాo ద్ర రాజకీయాలను శాసిస్తాడో అని , అతని వైపు ఆకర్షితులు అవుతున్న విద్యార్దులను ఉద్యోగులను తన వైపు మరల్చుకుని , సిమాo ద్రాలోని మరెవ్వరికొ 2014 ఎన్నికలలో లాభం చేకూర్చే విదంగా సదరు నటుడు గారిని ఎవరో ముందుకు నెట్టారు అనిపిస్తుంది . 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం చేపట్టడానికి T.D.P వోట్లను కొల్లగొట్టిన లోక్ సత్తాయె పరోక్ష కారణమని రాజకీయ పండితుల విశ్లేషణ . అదే తరహాలో ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి గారు పార్టి పెడితే అయన గారి పార్టీ పట్ల సిమాంద్ర విద్యార్దులు , ఉద్యోగులు ఆకర్షితులు కావడం ఖాయం . దానికి గండి కొట్టాలనే ఈ గడ్డం పెంచిన వీర శివాజీని స్పాన్సర్లు రంగంలో దించారు . అయితే ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటే ఈయన గారు K.C.R గారిని , హరీష్ రావు గారిని యమ పొగడటం చూస్తుంటే వారి అనుమతి లేకుండా హైదరాబాద్ లో ఉండటం కష్టం అని గుర్తించడమే కావచ్చు లేక ఆయన్ని ప్రమోట్ చేస్తున్న స్పాన్సర్లకు ఆ నాయకులకు మద్య ఏదైనా అవగాహన ఉండవచ్చు . .
ఏది ఏమైనా మ్యాంగో T.V ద్వారా తన బావాలను ప్రసారం చేస్తున్న ఈ "మ్యాంగో మ్యాన్" ప్రస్తుత సంక్షోభ సమయంలో అం అద్మి కెజ్రివాల్ గారిలా తనూ పోకస్ కావాలని ఆశిస్తున్నట్లే ఉంది . అమ్ అద్మి అంటే కామన్ మ్యాన్ అని కాకుండా మ్యాంగో మ్యాన్ అని అర్ధం చేసుకున్నట్లు ఉంది ఈయన్ని స్పాన్సర్ చేస్తున్న వారు . అందుకే మ్యాంగో చానల్ లో ఈ యన గారి బావ ప్రసారాలు మొదలయ్యాయి . చూదాం ఇంకా ముందు ముందు ఏమి చెపుతాడో . ప్రస్తుతం రాష్ట్ర విభజన మిద ఆయనగారు సిమాంద్ర విద్యార్దులు కు ఇస్తున్న సందేశం క్రింది విడియోలో చూడవచ్చు .
Comments
Post a Comment