కోపమొస్తే ఆ బార్యా భర్తలకి బట్టలిప్పదీసి విశ్వ రూపం చూపించడం ఒక అలవాటట !.

                                                       


అ అమ్మాయి పేరు అనురాధ , అబ్బాయి పేరు ప్రభాస్ . వారిద్దరికి ఉన్న ఒక ప్రత్యెక లక్షణం ఏమిటంటే , ఎవరైనా తమకు నచ్చని పని చేసి కోపం కలిగిస్తే వారిని ఏమి అనరు అట ! సింపుల్ గ ఒంటి మిద బట్టలు విప్పదిసి విశ్వ రూప ప్రదర్సన చూపిస్తారట . ఆ దెబ్బతో ఎదుటి వాళ్ళు ఠారెత్తి పోయి బ్రతుకు జీవుడా అంటూ పారి పోవటం కాని , అ జంట కోరిన పని చేసి పెట్టడం కాని జరుగుతుందట . మరి ఇతరుల సంగతి సరే , వారిద్దరిలో ఒకరి మిద మరొకరికి కోపం వస్తే ఏమి చేస్తారని కదూ మీ అనుమానం . అదే చెప్పబోతున్నా ! ఒక వేళా అ జంటలో ఒకరి మిద ఇంకొకరికి కోపం వచ్చినా సేమ్ పద్దతి! బట్టలిప్పదదీసుకుని బాదేసుకుంటారట ! అనక ఆవేశం చల్లారాకా ఏమి చెయ్యాలా అని అప్పుడు అలొచిస్తారట ! అది వారి స్పెషాలిటి !

  అదిగో అలాంటి యువ జంట ప్రభాస్ , అనురాధ లకు డిల్లిలొని రాష్ట్రపతి గారిని కలిసి మాట్లాడాలి అనిపించిందట . అనుకున్నదే తడవుగా ఇరువురూ బయలుదేరి డిల్లి వెళ్ళారు . అక్కడ రాజ్ భవన్ చూడాగానే అన్నమాచార్యులుకుమొదటి సారి తిరుమల కొండ చూస్తె ఎంత అనందం కలిగిందో అంత ఆనందం కలిగింది . అయితే వారికి అన్నమయ్య గారి లాగా పద్యాలు గట్రా రావు కాబట్టి మూగ ఆనందం అనుభవిస్తూ ముందుకు కదిలారు . అయితే గేట్  దగ్గర సెక్యూరిటి వారికి  విరి సంగతి తెలియదు కాబట్టి వీరిని అడ్డగించి రాష్ట్ర పతి  గారిని కలవడానికి సరి అయిన కారణం చెపితేనే లోపలకు వదులుతాం అన్నారట . దానికి అ జంట సంతృప్తికర సమాదానం చెప్పలేదట . వారికి తెలిస్తేగా చెప్పటానికి . వారికి రాష్ట్ర పతిగారిని కలవాలి అని అనిపించింది , వచ్చేశారు . అంతే ! దానికి మించి వారేమి చెప్పలేక పోయే సరికి సెక్యూరిటి వారిని లోపలకు అనుమతించలెదు. అంతే ఆ  జంటకు కోపం వచ్చేసింది !

  వెంటనే అలవాటు ప్రకారం ఇద్దరూ ఒకరి నొకరు చూసుకుని , వన్.. టూ ... త్రీ .. అని ఒంటి మీద  ఉన్న బట్టలు అన్ని విప్పేసి సెక్యూరిటి ముందు నిల బడ్డారు అట ! అ దెబ్బతో విశ్వరూపం చూసిన అర్జునుడులా మూ ర్చిల్లక పోయినా , సెక్యూరిటి వారికి దాదాపు అంత పిలింగ్ కలింగిందట . కాసేపటి తర్వాత తేరుకుని తమ డ్యూటి గుర్తుకు వచ్చి వారిద్ద్దరిని బట్టలు దరించమని కోరినా వారు అందుకు అంగీకరించక పోయే సరికి , వారికి బలవంతంగా బట్టలు వేసే ప్రయత్నం చేయబోయారట . బానితో ప్రభాస్ కాసేపు వారికి దొరక కుండా అటూ ఇటూ పరుగులు తీసాడు . తర్వాత ఎలాగో కష్టపడి అతనిని పట్టుకుని , వారిద్దరిని బలవంతంగా పోలిస్ వ్యాన్ లోకి నెట్టి , బట్టలు వేయించి మేజిస్ట్రేట్ గారి ముందు హాజరు పరిస్తే , అయన వారిని మెడికల్ చెకప్ కి పంపించారట . ప్రస్తుతం పోలీసులు వారి సంబదికులు ఎవరో తెలుసుకుని , ఆ  యువ జంట ను వారికీ అప్పగించాలని చూస్తునారు అట ! ఇది నిన్న రాజ్ భవన్ ఎదుట జరిగిన ప్రహసనం !

   ఈ   సంఘటన చూస్తుంటే మన దేశం లో కూడా అమెరికా తరహా ఉన్మాద చేష్టలు అక్కడక్కడా  యువతలో ప్రారంబం అయ్యాయి అనిపిస్తుoది . సంచలనం కోసం చేసినా , మరింకే కారణం తో చేసినా ఇటువంటి చేష్టలు ఖచ్చితంగా మానసిక రుగ్మతలే అని చెప్పవచ్చు . ఇండ్లలో  మంచి చెడు చెప్పే పెద్దవాళ్ళు లేకపోవడం , సమాజం అంటే తమకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించినా ఏమి చెయ్యలేనిది అనే బావన ఉండటం , ఏదో రకంగా ఏదో ఒక పని చేసి పది మంది దృష్టిలో పడటం ఒక గొప్ప కార్యంగా బావించటం , ఇవ్వన్ని యువతను ఉన్మాదానికి గురయ్యేలా చేస్తున్నాయి . మొన్న ఒక చోట చదివాను . విదేశి మెడికల్   కంపెనీలు లాబ్రేటరిలు వారు తమ  పరిక్షలలో బాగంగా ఇటువంటి ఉన్మాద ప్రవర్తనలకు ప్రేరేపించే ఔషద ప్రయోగాలు చేస్తున్నారని , వాటి వలననే ప్రపంచం లోని కొన్ని ప్రాంతాలలో ప్రజలలో ఉన్మాద లక్షణాలు కనపడునాయని దాని సారాంశం . ఇదే నిజమయితే అటువంటి ప్రయోగాలు చేసే వారిని చరిత్ర క్షమిoచదు. అది నిజమయినా కాకపోయినా , ఇటువంటి ఉన్మాద చేష్టలకు పాల్పడే వారిని అన్ని రకాలుగా పరిక్షలు నిర్వహించే అసలు కారణం కనుగోనాల్సిన అవసరం ఉoది. అవసరమయితే వారికి నిర్బందంగా అయినా సరే "బిహేవియర్ తెరపి" ఇప్పిమ్చాల్సిన బాద్యత ప్రబుత్వం మిద ఉంది . అంతే  కాని వారిని మందలించి బందువులకు అప్పచేప్పినంత  మాత్రానా వారిలోని "ఉన్మాదుడు"  అంతరించడు. మళ్ళి  ఎక్కడో ఒక చోట , ఎప్పుడో ఒకప్పుడు అవతరించి విశ్వ రూపం చూపింప చేస్తుంటాడు .

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన