పెళ్ళాం బిడ్డలతో కలసి ఉండలేని కైకలూరు M.L.A గారు రాష్ట్ర ప్రజలను కలిసి ఉండమంటున్నారు
ప్రజలకు ఏదైనా చెప్పే అధికార స్తాయి ఉన్న పెద్దమనుషులకు కొంత నైతిక అర్హత కూడా ఉండాలి . అలా లేని వారు ప్రజలకు సుద్దులు చెప్పాలని చూడడం శుద్ద అవివేకం అవుతుంది . ఈ సూత్రం సిమాంద్రాకు చెందిన కైకలూరు M.L.A జయ మంగళం వెంకట రమణ గారికి నూటికి నూరు పాళ్ళు వర్తిస్తుంది .
జయమంగళం గారు కైకలూరు నియోజక వర్గ ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిది. అయన గారి నియోజక వర్గంలో ప్రజల బాగోగులను చూడడం అయన గారి బాద్యత . కుటుంభ సమస్యల పరిష్కారం నిమిత్తం కౌన్సెలింగ్ ఇవ్వడమనేది ప్రబుత్వం యొక్క విదుల్లొ ఒకటి . అందుకోసం ప్రతి పోలిస్ స్టేషన్ లో నమోదయ్యేకుటుంభ కేసుల్లో తొలుత కౌన్సెలింగ్ నిర్వహించి ,పలితం లేకపోతేనే క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలని మార్గ దర్సకాలు ఉన్నాయి . మరి అటువంటిది సాక్షాతూ ప్రజా ప్రతినిది అయిన M.L.A గారి మీదే కుటుంబ వేదింపుల కేసు నమోదు కావడం ఎంత సిగ్గు చేటు . 5 నెలలు గడువు ఇచ్చినప్పటికీ కట్టుకున్న బార్యతొను , కన్న బిడ్డలతోనూ ఒక అవగాహనకు రాలేని వారు ప్రజలకు ఏమని నీతిని బోదిస్తారు ?
M.L.A అయినంత మాత్రానా కుటుంభ సమస్యలు ఉండవా అని ఎవరైనా అడగొచ్చు . కుటుంభ సమస్యలు ఉండటం తప్పు కాదు . కొన్ని దురదృష్టకర పరిస్తితుల్లో అవి ఎర్పడవచ్చు.కాని పది మందికి న్యాయం చెప్పాల్సిన పెద్ద మనిషికే అటువంటి పరిస్తుతులు ఏర్పడినప్పుడు పెద్ద మనసుతో వాటిని పరిష్క్ రించి పది మందికి ఆదర్శంగా నిలవాలి . M.L.A గారికి అయన బార్య గారికి 5 నెలలు క్రితం గొడవలు ఏర్పడితే ఆమె గారు కేసు పెడితే , అయన గారు హై కోర్టును ఆశ్రయించారు . దానికి కోర్టు వారు M.L.A గారు తన కుటుంబ సమస్యను సరిదిద్దుకోవడానికి 3 నెలల సమయం ఇచ్చి అప్పటి దాక ఆయన్ని అరెస్ట్ చెయొద్దన్నారు . కాని ఆ సమయం గడచిన తర్వాత కూడా నిన్న తిరిగి M.L.A గారి బార్య తనను చంపుతాను అని బెదిరిస్తున్నాడు అని పోలిస్ స్టేషన్ కేసు పెట్టిందంటే తప్పు ఎవరిలో ఉంది ?
బార్యా బర్తలు మద్య ఏదైనా సమస్యలు ఏర్పడి దూరమైనప్పుడు వారు తిరిగి ఒకటి కావడానికి ముక్యంగా తోడ్పడేది పిల్లల మిద ఉన్న ప్రేమాభిమానాలు . కాని M.L.A గారు తన పిల్లలను కూడా వెదిస్తున్నారు అని స్వయంగా పిల్లలే చెపుతుంటే ఇంకా వారి కుటుంబాన్ని కలిపి ఉంచే శక్తి ఎవరికుంది ? M.L.A గారు సిమాంద్ర కు చెందిన వారు . ఈ మద్య తెలంగాణా రాష్ట్ర విబజన విషయంలో సిమాంద్ర రాజకీయ నాయకులు అందరు రాష్ట్ర ప్రజలు విడి పోవద్దని , కలసి ఉంటె కలదు సుఖం అంటూ బారి డైలాగులు వల్లే వేస్తూ డిల్లి దాక పోయి మరీ ఆందోళనలు చేస్తున్నారు . అందులో కైకలూరు M.L.A గారు కూడా బాగ స్వాములే ! పెళ్ళాం బిడ్డలతో కలసి ఉండలేని సదరు కైకలూరు M.L.A గారు రాష్ట్ర ప్రజలను కలిసి ఉండమనే నైతిక అర్హత ఉందా? తమ పార్టి M.L.A కుటుంబాన్నే కలిపి ఉంచలేని సిమాoద్ర T.D.P నాయకులుకు సమైక్య నినాదం ఇచ్చె నైతిక అర్హత ఉందా? నేను ఈ ప్రశ్న అడుగుతుంది, చెయ్యని నేరానికి బాదలు అనుభవిస్తున్న M.L.A గారి పిల్లలను చూసాక నాలో కలిగిన జాలి వలన మాత్రమె . మరి ఆ మాత్రం జాలి సిమాంద్ర నాయకులకు కలగటం లేదా? ఇదేనా సమైక్యతా కోరుకునే వారి కుండాల్సిన లక్షణం ?
M.L.Aగారి గురించి అయన బార్యా పిల్లలు ఎమన్నారో క్రింది విడియో లో చూడండి
Comments
Post a Comment