అమర వీరుల త్యాగ పలితం, ధరల తెలంగాణా ! దొరల తెలంగాణా !?

                                                         


సుమారు 1300 మంది ఆత్మ హత్యలు చేసుకుంటే కాని తెలంగాణాకు విముక్తి లభించలేదు . ఇది తెలంగాణా లోని ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి వేళా , ప్రతి చోటా నొక్కి వక్కానించిన మాట .అలాగే తెలంగాణా ఏర్పడ్డాక ప్రతి అమరవిరుడి కుటుంబానికి 10 లక్షలు ఇస్తామని K.C.R గారు అన్నట్లు గుర్తు . కాని తెలంగాణా ప్రకటించాక ఈ అమరవీరుల కుటుంబాల వారెవ్వరూ "సంబురాల్లో " పాల్గొన్నట్లు మీడియాలో ఎక్కడా కనిపించలేదు . బహూశా ఆత్మానందం పొంది సంతృప్తి చెంది ఉంటారు .

   చిన్న రాష్ట్రాల ఏర్పాటు వలన ముక్యమైన సామజిక పరివర్తన నిమ్న వర్గాల ప్రజలకు రాజ్యాదికారం సిద్దించడం అని భారత రాజ్యంగ నిర్మాత శ్రీ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు అన్నారు . దానిని నమ్మి తెలంగాణా సాధనకు ఉద్యమించిన వారిలో   గద్దర్ అన్న, విమలక్క, దళిత బహుజన వర్గాల   నాయకత్వంలో లక్షలాది ప్రజలు, కవులు , కళాకారులూ "సామాజిక తెలంగాణా " కోసం నినదించారు . వీరందరినీ దృష్టిలో పెట్టుకునే K.C.R  గారు కూడా తెలంగాణా తోలి ముఖ్యమంత్రి దళితుడే అని ప్రకటించి తాను బహుజనుల పక్షపాతి అన్నంత బావం దళితులలో కలుగ చేసారు . కాని తెలంగాణా కు పార్లమెంటు ఆమోద ముద్ర వేసాక ఏ  దళిత నాయకుడిని వెంటపెట్టుకుని సోనియా గాంది గారి దగ్గరకు వెళ్లి " అమ్మా . వీరి  అభ్యదయం కోసమే వీర తెలంగాణా అని చెప్పిన పాపాన పోలేదు . పై పెచ్చు తానె ముక్య మంత్రి కావాలని , అందుకు సహకరించాలని అమ్మను కోరినట్లు తెలుస్తుంది . మొత్తానికి పూర్వపు తెలంగాణా దొరల ను గుర్తుకు తెస్తుoడు. 

  నిన్న "దొరబిడ్డ " డిల్లి నుండి హైదరాబాద్ కు వచ్చిన వేళ , బేగంపేట విమానాశ్రయం నుండి దొరబిడ్డ నివాసం వరకు సాగిన కార్ల ర్యాలి చూస్తుంటే పూర్వపు "దొరల తెలంగాణా " వచ్చినట్లే ఉంది కాని , ఎక్కడా అంబేద్కర్ గారు చెప్పిన సామజిక తెలంగాణా వస్తుందన్న ఆశ లేశమంతైనా కలుగలేదు . దొరబిడ్దకే  అంత ఆర్బాటం చేస్తే , ఇక ఈ రోజు దొర వస్తాడంట . ఇక దుమ్ము లేసిపోవాలె !.పొతెపొని ! సామాజిక తెలంగాణా గురించి కాసేపు పక్కన పెడదాం .కేవలం  K.C.R గారు మరియు అయన పార్టీ వలననే తెలంగాణా వచ్చింది అనుకుందాం కాసేపు . మరి 10 సంవత్సరాలు నుండి కష్టపడుతున్న అయన పార్టీ కార్య కర్తలు కు ఏమైనా లబిస్తుందా అంటే అనుమానమే !ఇప్పుడు సోనియాగాంది అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం T.R.S  ప్రజారాజ్యం లా కాంగ్రెస్లో కలిసిపోతుంది . గులాబీ దళాలు త్రివర్ణ దళాలు అవుతాయి . మరి ఇప్పటి దాక ఉన్న త్రివర్ణ దళాలు తో కలిసి పనిచేయాలంటే , చాలా చోట్ల గులాబీ దళాలు రాజ్యాదికారం ని త్యాగం చేయాల్సిన పరిస్తితి . సప్త సముద్రాలు ఈది వచ్చినోడు ఇంటి దగ్గరి మురికి గుంటలో పడి చచ్చిన చందాన , 10 ఏండ్లు గులాబీ  దళాలు పోరాడి అధికారం  కాంగ్రెస్ దొరలకు అప్ప చెప్పుడు తప్పా , తెలంగాణలో వచ్చె మార్పు ఏముంది ?

   ఇక పొతే తెలంగాణా రాష్ట్రం వలన తెలంగాణాకు కొత్తగా బాదలు తప్పా , పెద్దగా లాభిo చేది ఏమిటో అస్సలు అర్ధం కావటం లేదు .సిమాo ద్రా  వారికే ప్రత్యెక హోదాలు , ఉచిత పోలవరం ప్రాజెక్టు , బోల్డన్ని రాయితీలతో కూడిన ప్యాకేజీలు , కొత్త రాజదాని ఇలా ఎన్నో సౌకర్యాలు సమకూరి 10 సంవత్సరాలలో దేశంలో ఒక గుర్తింపు స్తాయికి చేరే అవకాశం  ఉంది . తెలంగాణా కి హైదరాబాద్ ఆదాయం తప్ప చెప్పుకోవటానికి ఏమి లేదు . ఆ హైదరాబాద్ లో కూడా సగం మంది పైగా సిమాంద్ర కి చెందిన వారే ! దాని మిద వచ్చె ఆదాయం తెలంగాణా రాష్ట్రం లో ఏర్పడే కరెంట్ లోటు ను పూడ్చడానికే వినియోగించాలి . సిమాంద్ర వారి దగ్గర ఉన్న మిగులు కరెంట్ ను కొనడానికే ఆ ఆదాయం సరిపోతుంది . బవిశ్యత్ లో ఏర్పడే కరెంట్ కష్టాలు వలన ఆన్ని వస్తువుల రెట్లు అమాంతంగా పెరిగిపోతాయి . సామాన్య జనం మిద దర ల పిడుగులు పడుతుంటాయి . అలా  దొరల పాలనలో దరల బారం తో కుంగిపోవడం తప్పా , కొత్తగా వచ్చె లాబాలేంటో ఇంతవరకు తెలంగాణా ప్రజలుకు తెలియదు .                     
              ఎకరానికి కోటి రూపాయలు వచ్చె మోడరన్ వ్యవ్యసాయం గురించి రైతులు , ఒక్క సారిగా తెల్లారే పాటికి ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు , తమ ఇండ్లలో ఇక మగవారు తాగకుండా పైసలు అదాచెస్తారని ఆడపడుచులు ఏంతో ఆశగా ఉన్నారు . మరి వారి అశలను తెలంగాణా దొరలు నిజం చేస్తారా ,లేదా అనేది "దొరలో తెలంగాణా " లో చూడాల్సిందే !

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

ఇంగ్లీష్ దుస్తులు వేసుకుని "Happy New Year " అంటే , కన్నడ కేకలు వేస్తూ వెంటపడి వేధించారు అట !

మొదట్లో స్త్రీలను పూజించమన్న "మనువాదం " ప్రక్షిప్తమవడానికి, "బడ్డు బైరాగి వాదం " కారణం కాదా ?

సాయిబాబా భక్తులకి ,స్వరూపానంద స్వామికి మధ్య గొడవలకు కారణమైన "ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ చట్టం 1987 ".

"గోపాలకుడు " ను కాదని "గొర్రె పాలకుడు "బిరుదు ధరించిన "కంచ ఐలయ్య షెప్పర్డ్ " చెప్పే ఐడియాలజీ వలన ఎవరికీ లాభం ??