తన పిల్లల దన విజ్ఞానానికి బలై పోయిన "జన విజ్ఞాన వేదిక " నాయకుడు !

                                                                   

మన సమాజం లో కొంతమంది నిస్వార్దంగా జనం కోసం అహర్నిశలు పని చేస్తూ , తాము నమ్మిన సిద్దాంతం కోసం తన సర్వసాన్ని చివరకు తన ఆస్తి పాస్తులను సైతం సమర్పించేసి " మహాత్ములు " మహా పురుషులు అనిపించుకుంటారు . వీరి వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది అనే విషయం లో ఎలాంటి సందేహాలు ఉండవలసిన అవసరం లేదు. కాని వీరి అంతులేని ఉదార స్వబావం వలన బాదితులుగా మారేది సదరు మహాత్ముల "కుటుంబ సబ్యులు". అందుకే జనానికి "గాడ్ పాదర్" అయిన వారు కూడా  , ఇంట్లో పిల్లలకి   "గుడ్ పాధర్ " కాలేరు. ఇంట గెలిచి రచ్చ గెలవడమనేది విజ్ఞుల లక్షణం . కాదు సమాజమే నా దేవాలయం . ప్రజలే నా దేవుళ్ళు అనుకున్నప్పుడు ముందు కుటుంబ బాద్యతలు నెరవేర్చి , ఇంట్లో ని సబ్యులందరిని సమావేశపరచి , తన ఆస్తి పాస్తులును ఎవరి వాటా వారికి ఇచ్చివేసి , తనకు వచ్చిన వాటాని , ఇక బవిష్యత్ లో తానూ సంపాదించే దానిని పూర్తిగా తానూ నమ్మిన సిద్దాంతం కోసమో , ప్రజల కోసమో వెచ్సిస్తాను అని స్పష్టంగా చెప్పివేస్తే , అది ధర్మబద్దంగాను, న్యాయబద్దంగాను ఉంటుంది. పిల్లల మనస్సుల్లో కూడా ఎలాంటి దురభిప్రాయాలు , అపోహలు ఉందే అవకాశం ఉండదు.

   పిల్లలందరికి తల్లి తండ్రులకు ఉన్న సమాజ సేవా గుణం లక్షణాలు ఉందకపోవచ్చు. కాని వారిలో ఏ ఒక్కరికి అటువంటి లక్షణాలు ఉన్నట్లు తల్లి తండ్రులు గుర్తిస్తే, వారు తమ అడుగుజాడల్లో నడుస్తూ తమ ఆశయాలు సాదిస్తారు అని నమ్మక్కం ఏర్పడితే అటువంటి పిల్లలకు పైన చెప్పిన విదంగా తనవాటాకు వచ్చిన ఆస్తిని అప్పచెప్పి , తన తదనంతరం తన ఆశయ సాదన కొనసాగించవలసిన విదానాన్ని నిర్దేసిస్తే తప్పకుండా వారు అమరజీవులవుతారు. ట్రస్ట్ లు ఇతరత్రా సంస్తలు అలా రూపొందించబడినవే . వ్యక్తికీ స్వీయ ఆశయాలు ఉన్నప్పుడు తప్పని సరిగా తన వాటాకు రాబడిన కుటుంబ ఆస్తిని పై రకంగా చేయడం ఉత్తమమ్. అలా కాక "నా స్వార్జితం , నేను సంపాదించిన ఆస్తిని నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను. చట్ట ప్రకారం స్వార్జితం మీద నాదే అధికారం అంటె ,కుటుంబానికి అన్యాయం చేసినట్లే. ఈ  విషయం లో చట్టాలలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది . స్వార్జిత ఆస్తులకు , పిత్రార్జిత ఆస్తులకు మద్య బేదం తొలగించి , కుటుంబ సబ్యులకు అందరికి సమాన వాటా స్వార్జిత ఆస్తుల్లో కూడా పొందే అవకాశం కల్పించాలి.

  ఇదంతా ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటె , మొన్న నెల్లూరులో ప్రముఖ సమాజసేవకులు, జనవిజ్ఞాన వేదిక నాయకులు శ్రీ విజయ్ కుమార్ గారు తన పిల్లచేతిలో దారుణంగా చంపబద్దారు అని తెలిసి మనసు చలించి పోయింది . సమాజం చేత మన్ననుల్ అందుకున్న వ్యక్తిని అయన గారి కుటుంభ సబ్యులే చంపడం తీవ్రమైన విషయం. ఇదంతా, అయన హాస్పిటల్ వారసులకు ఇవ్వకపోవడమే అని మీడియా కదనాలు. విషయం  పూర్తిగా తెలియకుండా అయన విదానాని కాని , అయన  కుటుంబ సబ్యుల ప్రవర్తనను విస్లేశించడం సరి కాదు కాబట్టి దానిని గురించి నో కామెంట్ . కాని కుటుంబ బాద్యతలను సక్రమంగా నెరవేర్చే కుటుంబ విజ్ఞానం కూడా "జన విజ్ఞానం " లో బాగమేనని దానిని నిర్లక్ష్య పరచరాదని, సేవా తత్పరులు అయిన తల్లి తండ్రులు  గుర్తించాలి. అలాగే పిల్లలు కూడా ఆస్తియే పరమార్దం కాదని , ఆశయ సాదన కూడా మానవ జీవితం లో ఒకటని గుర్తించి పెద్దలకు సహకరించి వారి ఆశయ సాదన అమలులో బాగస్వాములు కావాలి. లేకుంటే తల్లితండ్రులకు ఉన్న గొప్ప పేరే పిల్లలని అత్యంత హీనులుగా , సమాజంలో ముద్ర పడేలా చేస్తుంది.

   శ్రీ విజయ్ కుమార్ గారి మరణం గురించి మరింత సమాచారం కొరకు క్రింది వీడియోను చుడండి . శ్రీ విజయ్ కుమార్ గారి ఆత్మకు శాంతి కలగాలని ఆ బగవంతున్ని మనస్పూర్తిగా ప్రార్దిస్తున్నాను.


                     

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన