సీమాంద్రా రాజదానిని రెండు నరసింహ క్షేత్రాలైన అగిరి పల్లి, మంగళ గిరి మద్య నిర్మింఛి "నర సింగపూర్" అని పేరు పెడితే బాగుంటుంది !
అగిరిపల్లి దేవాలయ మెట్ల మార్గం |
సీమాంద్ర నూతన రాజదాని ని విజయవాడ చుట్టు ప్రక్కల ప్రాంతంలోనే నిర్మిస్తామని ఆంద్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి గారు ప్రకటించడం దైవ సంకల్పం లో బాగంగానే అనిపిస్తుంది . మొన్నటి దాక వివిధ ప్రాంతాలు పేర్లు చెప్పుకోచ్సినప్పటికి రాజదానిగా ముక్యంగా గుంటూర్ , తెనాలి, మంగళగిరి , విజయవాడ మద్య ప్రాంతమే బహుళ ప్రచారం లో ఉండటం వలన ఆ ప్రాంతాలులోని బూములకు బూమ్ వచ్చింది . అయితే అనూహ్యంగా తేరా మీదకు అగిరిపల్లి పరిసర ప్రాంతాలు రాజదానిగా చేయనున్నారని వార్తలు రావడం , ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు విజయవాడ పరిసరాలలోనే రాజదాని ఉంటుందని ప్రకటించడం తో "అగిరి పల్లి" పరిసర అటవీ ప్రాంతానికి మహర్దశ పట్టినట్లే .
అగిరి పల్లి ఒక పుణ్య క్షేత్రమ్ . దేవదేవుడైన ఆ నరసింహ స్వామీ ఇక్కడ శోభనాచల వ్యాఘ్రా లక్ష్మీ నరసింహ స్వామిగా శోభానా చలం పై వేంచేసి ఉన్నారు . ఈ క్షేత్ర విశేషాలు తెలుసుకోవాలంటే క్రింది వీడియోను చూడవచ్చు .అగిరిపల్లి చుట్టూ అటవి ప్రాంతం వేల ఎకరాల్లో విస్తరించి ఉండటం వలన ఇక్కడ రాజదాని నిర్మాణం వ్యయ భరితం కాదని సర్కార్ వారి ఆలోచన . అగిరిపల్లి, అడవినెక్కలం , నున్న, గడ్డ మణుగు గ్రామ ప్రాంత ఫరిసరాలలో సుమారు 11 వేల ఎకరాలు ప్రభుత్వభూమి , 30 వేల ఎకరాలు అటవీ భూమి ఉందని కాబట్టి రాజధాని నిర్మాణం కి ఈ భూములు అనువుగా ఉంటాయని అంటున్నారు . అదీ కాక ఎత్తైన భవన నిర్మాణాలకు ఇవి అనుకూలమని ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు . ఇవన్నీ నూతన రాజదాని నిర్మాణం ఇక్కడ చేపట్టడానికి పనికి వచ్చే అంశాలు .
అయితే వాస్తుపరంగా చూస్తె అగిరి పల్లి ప్రాంతం కంటే మంగళ గిరి ప్రాంతం బహు శ్రేష్టమైనది అని వాస్తు పండితుల బావన . ఈశ్యాన్య బాగంలో పుణ్య కృష్ణా నది ప్రవహిస్తూ ఉండటం వలన ఇక్కడ రాజధాని నిర్మిస్తే బేషుగ్గా ఉంతుంది అంటున్నారు . వాస్తు పరంగా అది కరెక్టే . కాని రాజదాని నిర్మాణానికి వాస్తుతో పాటు వేల ఎకరాల భూమి అవసరం . మంగళ గిరి పరిసర ప్రాంతంలోని వ్యవసాయ భూమిని నిర్మాణాలకు ఉపయోగించడం చాలా ఖర్చుతో కూడుకున్నదే కాక నష్ట దాయక మైనది . అందుకే అటు వాస్తు పరంగా , ఇటు భూముల లబ్యత పరంగా ఉభయ తారకంగా మేలు చేసే విదంగా నూతన రాజదాని నిర్మాణం చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం .
మంగళ గిరి పరిసర ప్రాంతాలలో రాజధాని అధికృత కార్యాలయాలు అంటే అసెంబ్లీ , సెక్రటేరియట్ నిర్మింప చేసి , మిగతా పాలనా పరమైన బవంతులు , ప్రజల నివాసాలు అన్నీo టికీ అగిరిపల్లి అటవి భూములు ఉపయోగొస్తే బాగుంటుంది . దీని వలన ఇటు మంగళ గిరి నుండి అటు అగిరి పల్లి వరకు రాజదాని విస్తరించి రెండు పవిత్ర నరసింహ క్షేత్రాల మద్య నగరం విలసిల్లుతూ ఉంటుంది . ఎలాగో గుంటూరు , తెనాలి నగరాలు కలిసి పోతాయి కాబట్టి ఆ ప్రాంతమంతా మహా నగరంగా మారిపోతుంది . నూతన రాజదాని రెండు నరసింహా క్షేత్రాల మద్య ఆవిర్భవిస్తుంది కాబట్టి దానికి "నర సింగ పూర్" అని పెడితే అటు మోడరన్ గాను ఇటు సాంప్రాదాయ బద్దంగాను ఉంటుంది .
ఏది ఏమైనా అతి త్వరలో సిమాంద్రా కు నూతన రాజదాని నిర్మాణం జరిగి అది కూడా హైదరాబాద్ తో సమానంగా అభివృద్ధి చెందాలని, సీమాంద్రా వారు సుఖ సంతోషాలతో ఉండాలని తోటి తెలుగు వారిగా తెలంగాణా వారు కూడా కోరుకుంటున్నారు .
Comments
Post a Comment