"హలాల్" లో ఆరోగ్య కారణాలు ఉన్నయో లేవో కాని , "ఆదిత్య నమస్కారం " లలో మాత్రం బోల్డన్ని ఉన్నాయి !

                                                                   

                                               జూన్ 21 తేదిని ప్రపంచ యోగ డే గా ఐక్యరాజ్య సమితి ప్రకటించడం, అందుకు అనుగుణంగా ప్రపంచం లోని అనేక జాతులు, మతాలూ , వర్గాలుకు చెందిన ప్రజలు "యోగ " గురించి, అరోగ్య పరంగా దానికిఉన్న విశిష్టత గురించి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు అందరికి  అవగాహన కలిగించే దిశగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం చాలా ఆనందించవలసిన విషయం. ముక్యంగా భారతీయులైన మనకు చాలా గర్వకారణం . దీనికి ప్రదాన కారణాలు రెండు (1). యోగ అనే ఆరోగ్య ప్రక్రియ కు భారత దేశం పుట్టినిల్లు కావడం .
(2). "యోగ " కోసం సంవత్సరం లో జూన్ 21  ని  యోగ డే గా  ప్రకటించడానికి , మన దేశ ప్రదాని గారు ఐక్య రాజ్య సమితిని ఒప్పించడం లో క్రుషి చేసి విజయం సాదించడం    
           
                   అయితే ఇదే సందర్బంలో  జూన్ 21 ని యోగా డే గా జరుపుకోవడానికి ప్రపంచం లోని ముస్లిం సమాజాలకు లేని అబ్యంతరం ఈ  దేశం లోని కొంత మంది ముస్లిం లకు ఉండడం కడు విచారకరం. వారి  అవగాహన ప్రకారం యోగా అనేది హిందూ మతం కి సంబందించిన మత ప్రక్రియ అట. దానిని పాటిస్తే ఇస్లాం కి వ్యతిరేకం అని తప్పుడు వాదాలు చేస్తూ అమాయకులైన ముస్లిం లను ఆరోగ్య సూత్రాలకు వ్యతిరేకం చేస్తున్నారు. నిజానికి మహ్మద్ ప్రవక్త కొన్నాళ్ళు గుహల్లో ఆసనాలు వేసి దీఖ్శదారుడిగా ఉండి దైవ రహస్యాలు తెలుసుకున్నారు అంటారు. పోని అదంతా కాదు మన దేశానికి ప్రపంచ సమాజం లో గొప్ప పేరు లేదా గుర్తింపు తేవడానికి ఉపయోగడే జూన్ 21 యోగా డే ని సమర్దించడం వలన ఇండియన్ ముస్లిం లకు కలిగే నష్టం ఏమిటొ తెలియ చేస్తే బాగుంటుంది. 

       యోగా లో సూర్య నమస్కారాలు అనేవి ఒక బాగం. సులువుగా ఉండె సూర్య నమస్కారాలు వలన వాటిని చేసే ప్రతి ఒక్కరికి లాభముంది మృదువైన కదలికలతో సూర్య నమస్కారాల పేరిట ఆచరించే పన్నెండు ఆసన భంగిమలు  ప్రసిద్ధమైనవి .మనిషి పుట్టిన తేదీ ఆధారంగా ఏర్పడే వయస్సు కాకుండా మనిషి వెన్నెముక వంగే శక్తి ఆధారంగా ' యోగ వయస్సు' అనేది మరొకటి ఉందని పెద్దలంటారు . యోగప్రాయాన్ని బట్టి యవ్వనం, భౌతిక శక్తి, బలమైన మనస్సు ఏర్పడతాయి. శరీరాన్ని ఎలా పడితే అలా స్వాధీనంలో ఉండేలా వెన్నెముక సులువుగా వంగేలా ఉంచుకునేందుకు అవసరమైన సరళతర వ్యాయామం సూర్యనమస్కారాలు.

                 పన్నెండు ఆసనాలు వేయడం వల్ల శరీరంలో బిగువులు తొలగడం, విషపదార్థాలు కరిగిపోవడం, దేహ కదలికలు సులువు అవడం, కీళ్ళు వదులవడం జరిగి నరాల కండరాల వ్యవస్థ సమతుల్యంగా పని చేస్తుంది. దృష్టి, వినికిడి, వాసన, రుచి శక్తులు పెరుగుతాయి. అంతే కాక వ్యాధి నిరోధక శక్తి హెచ్చి శరీరం తేలికగాను, తేజోవంతంగాను, శక్తివంతంగాను  తయారవుతుంది. దేహంలోని వ్యవస్థలన్నీ మెరుగుపడి మలినరహితమై శక్తివంతమవుతాయి.

                     సూర్యాసనాల ప్రక్రియ వల్ల మనస్సు స్థిమితంగా ఉండి జ్ఞాపక శక్తి పెరగడం, ఆలోచనలో స్పష్టత, భావ వ్యక్తీకరణలు , ప్రజ్ఞ కలుగుతాయి. వీటి వలన శరీరం ఒకే  విధమైన విశ్రాంతిని పొందుతుంది. ఆత్మకు అనిర్వచనీయమైన  అనుభూతి కలుగుతుంది. సమతుల్యం, సహనం, నిర్దిష్ట మార్గానుసరణ, అనుభూతి పొందుతూ సంతోషం, అర్థవంతమైన జీవనం, ఆలోచనాత్మకమైన మనో విశ్లేషణ, హృదయ వివేకాన్ని సాధకుడు పొందుతాడు. ద్వాదశ సంఖ్యాత్మకమైన  సూర్య నమస్కారాలు గోప్యమైనవి. వీటిని సక్రమంగా ఆచరిస్తే, ఇవి ప్రణామ ప్రవాహంగా అవిచ్చిన్నంగా సాగుతాయి. వీటిలో మొండెం, మెడ ముందుకు , వెనుకకు , పైకి, కిందకు ప్రధానంగా కదులుతాయి. ఈ కదలికలు ఏడు ప్రధాన చక్రాలను చైతన్యవంతం చేస్తాయి అంటారు .


                        ఈ ప్రక్రియలో గుర్తుంచుకోవలసిన అంశాలు రెండు .వేసే ప్రతి ఆసనంలోను శరీరంలోని వివిధ భాగాల కదలికలు గమనించడం మొదటిది .శ్వాస యుక్తలయను కదలికలతో అనుసంధానించడం రెండవది. శరీరాన్ని వెనుకకు వంచేటప్పుడు లోనికి శ్వాసించడం, ముందుకు వంగేటప్పుడు శ్వాసను వదలడం ముఖ్య సూత్రం .ప్రాణాయామం, సూర్యనమస్కారం, విశ్రాంతి ఆసనమైన శవాసనం అనే మూడు ఆదిత్య ప్రణామాల్లో అంతర్లీనంగా ఉంటాయి. మరి ఇటువంటి సూర్య నమస్కారాలు ను హిందూ మత పరమైనవి అని అనడం, ఆ కారణం తో యోగా డే ని తిరస్కరించాలి అనడం, వారి ఓట్లకు తల ఒగ్గి భారత ప్రభుత్వం సూర్య నమస్కారాలను యోగా నుండి తొలగించడం చూస్తుంటె , భారత రాజకీయాలు ఎంత దయనీయ పరిస్తుతుల్లో ఉన్నాయో అర్దమవుతుంది. 
                                                                            
                                                                        

       ముస్లిం మిత్రుల కోసం "హలాల్ " చేసిన మాంసం ని తింటున్నారు హిందువులు. హలాల్ పక్కా ముస్లిం మత పరమైన చర్య. అయినా సరే తమ మత పరమైన అభిమాన్నాన్ని చంపుకుని , ముస్లిం మిత్రుల కోసం త్యాగం చేస్తుంది భారత దేశం లోని హిందూ సమాజం. కనీసం ఆ కృతజ్ఞత అన్నా లేకుండా పోయింది , యోగా లోని సూర్య నమస్కారాలను విమర్శిస్తున్న వారికి. అయినా విమర్శించే వారి పిచ్చి కాకపోతే, ప్రభుత్వాలను ఓట్ల బ్లాక్ మెయిలింగ్ తో  "యోగా " నుండి సూర్య నమస్కారాలను తొలగించగల రేమో కాని , యోగా డే గా జరుపుతున్న జూన్ 21 విశిష్టత ను ప్రపంచ ప్రజానీకం మరచిపోయేలా చేయగలరా?  జూన్ 21 అనేది సంవత్సర కాలం లో పగలు ఎక్కువుగా ఉండె రోజు. దీనికి కారణం సూర్యుడు తన అయన దిశను మార్చుకునే రోజు . అందుకే పగటి కాలం జూన్ 21 న ఎక్కువ. సూర్యుడి గమన్నాని తెలియ చేసే ఆ విశిష్ట రోజునే "యోగా డే " గా ప్రపంచం గుర్తిస్తుంటె , "యోగా " లో బాగమైన సూర్య నమస్కారాలను తొలగించి భారత ప్రభుత్వం లోని పెద్దలు తమ అజ్ఞానాన్ని చాటుకుంటున్నారు. ఎవరో కొంత మంది అజ్ఞానుల కోసం విజ్ఞాన పరమైన , ఆరోగ్యకరమైన పద్దతులను విడనాడం మహా అజ్ణానం. సూర్య నమస్కారాలు హిందువులవే అని డిక్లేర్ చేసి సూర్య బగవా నున్ని హిందూ దేవుడిగా మాత్రమే అంగీకరిస్తే , సూర్య రస్మి పొందుతున్న వారంతా "హిందువులే " అవుతారు. లేదా హిందు దేవున్ని సొత్తుని కాజేస్తున్న వారు అవుతారు. 

     కాబట్టి పనికిమాలిన లేక పనికి రాని  వాదాలను  ను పక్కకు నెట్టి ప్రజలకు మంచిని చేకూర్చే వి ఏ మతం లో ఉన్నా స్వీకరించి ముందుకు సాగడమే నిజమైన విజ్ఞానం 
                                ( 21/6/2016 Post Republished.)

Comments

  1. I really like your site - In addition to this I herewith posting a very useful site regarding the educational information.

    Click Here To Teacher Guide.in.

    ReplyDelete

Post a Comment

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

ఇంగ్లీష్ దుస్తులు వేసుకుని "Happy New Year " అంటే , కన్నడ కేకలు వేస్తూ వెంటపడి వేధించారు అట !

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

మనల్ని ఆపదల నుండి కాపాడే నరసింహ మంత్రం

మళయాళ శ్రుంగార నటి "శ్వేతా మీనన్" కేసు విషయం లో "మనవు" చెప్పిందే నిజమయింది!

"నాగుపాము" మహిమలు గూర్చి మా ప్రత్యక్ష అనుభవాలు