రాజమండ్రి పుష్కరాల్లో 30 మంది చావుకు ముఖ్యమంత్రి గారు కారణమైతే , ఖమ్మం వెటర్నరి డాక్టర్ గారి పుష్కర చావుకు కారణమెవరు?

                                                                             

                         


                                         కొన్ని  ప్రమాద సంఘటణలకు  తక్షణ కారణం ,మూల కారణం అనేవి రెండు ఉంటాయి. మనం సాదారణంగా తక్షణ కారణాలు మీదే స్పందించి  దానికి అనుగుణంగా అందుకు బాద్యులు అయిన వారి మీద చర్యలు తీసుకోవాలని కోరుతుంటాం. ఒక్కొక్క సారి తక్షణ కారణం కంటె ఆ కారణానికి కారణమైన మూల కారణం ఏమిటొ కనుకున్ని అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది . అయితే ఇటువంటి  కారణం కనుకోవటానికి సమగ్ర విచారణ జరపాల్సి ఉంటుంది. ఈ  రెండే కారణాలు కాక అసలు కారణం మరొకటి ఉంటుంది అని నా లాంటి నమ్మకస్తులు అనుకుంటూ ఉంటారు. అదే "విది ". విది కి వ్యతిరేకంగా ఏమి జరగదు అని , ఏది జరిగినా అంత "విది లిఖితం " అని అనుకునే వారు చాందస వాదులు లాగా కనిపించినప్పటికి , మన దేశం లో చాలా మంది ఆ నమ్మకం తోనే మనసును సంతృప్తి పరచుకోవడం వలన , దుర్ఘటనల తాలూకు మనో గాయాలు కు అది ఒక మంచి మందులా పనిచేసి , త్వరగా కోలుకోగలుగుతున్నారు.

          ఉదాహరణకు , మొన్న రాజమండ్రిలో పుష్కరాల తోలి రోజునే, విపరీతమైన తోపులాట జరిగి ,  30 మంది భక్తులు  ఆ తొక్కిడిలో మరణించడం విషాదంలో మహా విషాదం. దీనికి తక్షణ కారణంగా కనిపించేది , భక్తులలో క్రమశిక్షణ లేక , ఎదుటి వారి కంటే ముందు తామే పుష్కర స్త్నానం చెయ్యాలనే ఆరాటం తో ముందున్న వ్రుద్దులు , స్త్రీలు క్రిందపడిపోయినా , వారిని తొక్కుకుంటూ వెళ్ళడం వలననే  ఆ దుర్ఘటన జరిగిందనేది . దీనికి కొంత మంది చెప్పిన వక్రబాష్యం వింటుంటె అసలు వారు బుద్ది ఉన్న మనుషులేనా అనిపించింది. వారి వక్ర బాష్యం ప్రకారం దేవుని మెప్పు  కోసం మనుషులను చంపే "తాలి బాన్ " లు , తొక్కిడిలో చనిపోయిన వారి ని తొక్కుకుంటూ వెళ్ళిన భక్తులూ ఒకటెనట. ఇద్దరూ పుణ్యం కోసం ఎదుటివారిని హత మార్చే రకమట . ఇలా నా బ్లాగులో ఒక "బ్లాగు రాక్షసుడు"  వ్యాఖ్యానించాడు.   "బ్లాగు రాక్షసులు " అంటె ఎవరో ఇక్కడ క్లిక్ చేసి చుడండి.

       అయితే  ఆంద్ర ప్రదేశ్ లోని ప్రతి పక్షాల వారి వాదన ప్రకారం ఆ 30 మంది దుర్మరణం కి ముఖ్యమంత్రి గారే కారణమని ,VIP ఘాట్ లో పుష్కర స్నానం చేయాల్సిన అయన , సామాన్య భక్తులు స్నానం చేసే "పుష్కర ఘాట్ " లో స్నానం చేయడం వలన అక్కడ 2 గంటలు పాటు భక్తులను నిలిపివేయడం వలన , ఆ తర్వాత కూడా ఒక్కసారిగా భక్తులను ఇరుకు ద్వారం గుండా స్నానానికి  వదిలివేయడం వలన ఒక్క సారిగా ఏర్పడిన తొక్కిసలాటలో అబలలు మరణించారని కాబట్టి ఈ ప్రమాదానికి నైతిక బాద్యత వహించి ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారిని సమర్దించే వారేమో , దీనికంతటికీ అధికారులకు , భక్తుల రద్దీ విషయంలో ముందు చూపు లేకపోవడం వలన , వారిని ఇతర ఘాట్లకు మళ్ళించడం లో విపలమవడం వలన, ముఖ్యమంత్రి గారు వెళ్లి పోయాక   ఒక పద్దతి పాడు లేకుండా భక్తులను ఒక్కసారిగా వదలడం< వలన ప్రమాదం జరిగిందని, కాబట్టి దీనికి సంబందిత అధికారులదే బాద్యత అంతున్నారు. ఏది ఏమైనా మూల కారణం కనుక్కోవాలంటే  సమగ్ర విచారణం అవసరం కాబట్టి ముఖ్యమంత్రి గారు వేసిన జుడిషియల్ ఎన్కుఐరీలో అయినా ములాకారణమ్ తెలుస్తుందేమో చుడాలి .

     ఇక పోతే మూడ కారణం అయిన విది . ఆ 30 మంది భక్తులకు పరమ పుణ్య లోకాలు ప్రాప్తించాల్సి ఉంది కాబట్టే , దైవ కార్యక్రమంలో పాల్గొని ప్రాణాలు విడిచారు అనేది , సంబందిత భక్తుల కుటుంబ సబ్యులకు ఊరట నిచ్చే మాట. ఈ విది కారణం కనుకునే వారు ఎవరూ ఉండరు  కాబట్టి, ఒక వేల ఉన్నా వారి మాటలకు చట్ట ప్రకారం విలువ ఉండదు కాబట్టి దాని గురించి ఆలోచందం వేస్ట్ అనుకునే వారు ఉండవచ్చు.  కాని  బాదితుల మనసుకు పై రెండు కారణాలు ఇవ్వని మనోశాంతిని ఈ కారణం ఇస్తుంది కాబట్టి దీని ప్రయోజనాన్ని తక్కువుగా అంచనా  వేయడానికి వీలు లేదు. సరే , రాజమండ్రిలో అంటె భక్తుల రద్దీ నియంత్రణ  అనేది చనిపోయిన భక్తుల చేతిలో లేని అంశం కాబట్టి దానికి బయటి వారు బాద్యులు . కాని నిన్న ఖమ్మం జిల్లా నెల్లిపాక వద్ద జరిగిన పుష్కర స్నాన ప్రమాదం లో ఖమ్మం కు చెందిన పశు వైద్యాధికారి శ్రీ దిరిశాల సత్యనారాయణ గారి చావుకు ఎవరు కారణం? ఒక విజ్ఞాని , ముందు చూపు కొరవడి, అమాయకంగా నదిలో తెలియని లోతుకు వెళ్లి దుర్మరణం పాలు కావడం వెనుకాల అధికారుల నిర్లక్ష్యం ఉందా? అయన కంటె అవగాహన తక్కువు ఉన్న అయన వెంట ఉన్న వారు ,క్షేమంగా పుష్కర స్నానం చేస్తే , విజ్ఞాని అయిన అయన గోదావరిలో మునిగిపోవడం వెనుకాల కేవలం అయన గారి నిర్లక్ష్యం మాత్రమే అని అనుకోవాలా ? "ఇంకా ముందుకు వెళ్ళు " ఇంకా ముందుకు వెళ్ళు " అని ఆయన్ని ప్రోత్సాహించిన ఆద్స్రుశ్య శక్తి ఏమిటి? "విది " కాదా? ఏమో ? అనుకుంటే శాంతి , లేకుంటే అశాంతి . ప్రమాద ఘటన యొక్క పూర్తి వివరాలు కోసం పైన ఇచ్చిన చిత్రం చూడ గలరు.

                ఏది ఏమైనా ప్రతి దుర్ఘటన లో లౌకిక కారణాలు రెండు , అలౌకిక కారణం మరొకటి ఉంటుందని నా నమ్మక్కం. విచారణ అనేది బౌతికంగా కనిపించే 2 కారణాలకే పరిమితమైనా , ఆ కనిపించని మూడవ కారణం కూడా మన జీవితాలను ప్రబావితం చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం ఉండవలసిన అవసరం లేదు. విది ఆడిన నాటకంలో   డాక్టర్ గారి తో పాటు పుష్కర స్నానాల్లో అశువులు బాసిన భక్తులు అందరి  ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతున్ని ప్రార్దిస్తూ , వారి వారి కుటుంభ సభులకు ప్రగాడ సంతాపాన్ని తెలియ చేస్తున్నాను.

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన