మాతృ భూమి హిందూ జీవన విదాన సాంప్రదాయాన్ని పాటించిన "జగన్ " గారికి శుభాభి నందనలు!!

                                                                 



                                 ప్రతి దేశానికి " law of the land " ఉన్నట్లే "Religious of the Land " కూడా  ఉండాలి . ఒక దేశంలో పుట్టి , కొనసాగే ఏ సాంప్రదాయమైన ఆ దేశ వారసత్వ సంపదే . దురాచారాలు, దుష్ట సాంప్రదాయాలు ఎక్కువ కాలం ప్రజల్లో మనలేవు కాబట్టి అవి పుబలో పుట్టి మఖలో మాడిపోయెవి. వాటి గురించి చెప్పుకోవలసిన అవసరం లేదు . కాని ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ , వారి అభ్యున్నతి కోసం ఉద్భవించిన ఏ ఆచారమైనా , మత విదానంగా రూపుదిద్దుకుంటుంది. దానినే దేశం లోని మెజార్తీ ప్రజలు ఆచరిస్తూ ఉన్నట్లైతే అది తప్పకుండా "Religious of the Land " అవుతుంది. దీనికి భారత దేశం కూడా మినహాయింపు ఏమి కాదు.

         మనదేశం  లోని ప్రజల యొక్క దురదృష్టమో , అదృష్టమో విదేశి శక్తుల దండయాత్రలకు గురి అయి , అనేక సంవత్సారాలు వారి పాలనలో ఉండాల్సిన దుస్తితి ఏర్పడింది.విదేశి మత శక్తులు వారి సామ్రాజ్య వ్యాప్తి కోసం  ఈ దేశం లోని  ప్రజలను బలవంతంగా వారి మతాలలోకి మార్చి, వారినే తమ మాత్రు మతస్తుల మీదకు ఉసికొల్పి , వారి మద్య చిచ్చు పెట్టి , ఇక్కడి ప్రజలను తమకు తల వంచేలా చేసుకుని పాలన చేసారు. క్రమంగా విదేశి మత బీజాలు ఈ  గడ్డ  మీద వ్యాపించి , వారి బిడ్డలుగా మారాయి. కాని వారి D.N.A లు మాత్రం మాతృ మతానికి చెందినదే అయి ఉంటుంది కాబట్టి ఎప్పుడొ ఒకప్పుడు మాతృ సంప్రదాయాల మీద తనకు గల సహజ అభిమాన్నాన్ని తనకు తెలియకుండానే ప్రకటించుకుంటుంది. శైవులు , వైష్ణవులు , ఇండియన్ ముస్లింలు, ఇండియన్ క్రిస్టియన్ , సిక్కులు , జైనులు, ఇండియన్ పార్సీ లు ఎవరైనా సరే అందరిలో ఉన్నమూలాలు ఒకటె. అందరం హిందూ జీవన విదానంలో బాగమే . అందుకే హిందూ అంటె ఒక మతం కాదు , జీవన విదానం అని సుప్రీం కోర్టు వారు నొక్కి చెప్పింది. ఎవరు అవునన్నా , కాదన్నా మనలో ఉన్న మాతృ వారసత్వ అభిమానం ఎప్పుడొ ఒకప్పుడు బయట పడుతూనే ఉంటుంది.

     అలాంటి అభిమానం మొన్న పుష్కర స్తానాల వేళ దివంగత నేత శ్రీ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అయిన శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో , తనువులో , తన తండ్రి గారి తర్పణం నిమ్మితం చేసే పుష్కర స్తానాల వేల కనిపించింది.   విదివశాత్తు పరాయి మతం స్వీకరించినా , ఆ మతంలో పుష్కర స్నానానికి తావు  లేక  పోయినా, లక్షలాది తన తెలుగు సోదరులు తమ తమ పిత్రు దేవతల కోసం తర్పణాలు కోసం చేసే పుష్కర స్నానాలు చూసి, అయనగారి లో ఉన్న మాత్రు సాంప్రదాయం ఉవ్విలూరింది. తనూ తన ప్రియతమ తండ్రి గారికి, తన మాత్రు సాంప్రాదాయ విదానంలో పుష్కర స్నానాలు చేసి,  తర్పణాలు వదలాలని ఆశపడింది. దాని పలితమే జగన్ గారి పుష్కర శ్నానం.

     పుష్కర స్నానం నిమిత్తం సాంప్రదాయబద్దంగా పైనున్న దుస్తులు తీసి వేసి , పవిత్ర స్నానం ఆచరించి, నిబద్దతతో, తన పెద్దలకు పిత్రు తర్పణాలు వదులుతున్న జగన్ గారిని చూస్తుంటె, ఎంతో ముచ్చట వేస్తుంది. దారి తప్పి పోయి అన్యుల పంచన బ్రతికిన పిల్లాడు తిరిగి ఇంటికి వచ్చి శుభ్రంగా ఇంటి పనులు చేసుకుంటుంటె కుటుంబ సబ్యులకు ఎలాంటి ఆనందం కలుగుతుందో అలాంటి ఆనందమే మాత్రు సాంప్రదాయ వాదులకు ఆ డ్రుశ్యం చుస్తున్నప్పుడు కలిగి ఉంటుంది. కావాలంటె మీరు క్రింది విడియోను చూస్తే ఆ విషయం తెలుస్తుంది.        
 రాజకీయ పరంగా  ఏ సిద్దాంతాన్ని పాటించినా , సాంప్రదాయ పరంగా మాతృ  భూమి హిందూ జీవన విదాన సాంప్రదాయాన్ని పాటించి, అన్యమతస్తులకు మార్గదర్శకుడయ్యారు. మిగతా వారు కూడా అయన బాటను అనుసరిస్తారని ఆశి స్తూ  "జగన్ " గారికి శుభాభి నందనలు తెలుపుచున్నాను. !!                
                                        



                   

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం