"పరాధికారం పైన వేసుకున్న వాడు గాడిదవలె దుర్మరణం పాలవుతాడు " అన్న కద,రాజమండ్రి విషాదాంతం కి సరిపోతుందా?

                                                                 

                           

                                   ఈ  రోజు మహా ప్రశస్తమైన రోజు. ప్రతి 144 సంవత్సరాలకు ఒక సారి వచ్చే గోదావరి మహా పుష్కారాలు ఆరంభమైన రోజు. ఈ సందర్భంగా  తోటి హిందూ సోదరులందరికి గోదావరి పుష్కర శుభాభినందనలు .

    ఈ రోజు దురదృష్ట వశాత్తు , ప్రభుత్వ ముందు చూపు లేమి వలన రాజమండ్రి లో కడపటి వార్తలు అందేసరికి 27 మంది పుష్కర భక్తులు , తొక్కిడిలో ఊపిరాడక మరణించడం గోదావరి పుష్కర చరిత్రలోనే చీకటి రోజు.తమ పితృదేవతల సంస్మరణర్దమ్ జరిపే  మతాచార సేవా కార్యక్రమం లో నిమగ్నమై తమ అసువులు బాసిన ఆ పరమ భక్త్క్తులకు బగవంతుడు ఆత్మ శాంతి చేకూర్చాలని ప్రార్దిస్తున్నాను. 

      పరవస్తు చిన్నయ సూరి గారు చెప్పిన పంచ తంత్రం కధలలో "పరాధికారం పైన వేసుకున్న వాడు గాడిదవలె దుర్మరణం పాలవుతాడు " అన్న కద,ఆ కధ ఏమిటంటె " అనగనగా ఒక ఊరిలొ ఓ చాకలి ఉండెవాడు . అతనికి ఒక కుక్క, ఒక గాడిద ఉండేవి. గాడిద చాకలిమేటలను మోసేదీ. కుక్క చాకలి ఇం టికి కాపల కాసి అతనెక్కడికి వెళ్తే అక్కడకెళ్ళి తోడుండేది.
ఒక రోజు రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు ఇంట్లోకొక దొంగ ప్రవేశించాడు. ఇది గమనించిన గాడిద కుక్క వేపు ఆశ్చర్యంగా చూసి, “నువ్వు దొంగను చూసి మొరగలేదెందుకు?” అనడిగింది.
“మన యెజమాని మన్ని అస్సలు పట్టించుకోడు. గత కొన్ని రోజులలో నాకు సరిగ్గా తిండి కూడ పెట్టలేదు. నేనెందుకు పట్టించుకోవలి?” అని కుక్క ఎదీ పట్టనట్టు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది.
“ఇది మనం మొరబెట్టుకునే సమయంకాదు. మన యజమానికి సహాయం చేయాలి” అని గట్టిగా గాడిద కూతపెట్టడం మొదలెట్టింది.
దెబ్బకు ఇంట్లో వాళ్ళంతా లేచారు. దొంగ పారిపోయాడు. చాకలికి కి ఎవ్వరూ కనిపించకపోయేసరికి అనవసరంగా నిద్ర చెడకొట్టిందన్న కోపంతో గాడిదను బాగా బాదేడు.దానితో అది చచ్చి పోయింది. కాబట్టి పరాధికారం పైన వేసుకున్న వాడు గాడిదవలె దుర్మరణం పాలవుతాడు " అని ఈ  కద లో నీతి 
.

          రాజమండ్రి విషాదాంతం  చూస్తే పై కదే గుర్తుకు వస్తుంది. మనది ఎంత సెక్యులర్ రాజ్యం అయినప్పటికి , మెజార్తీ ప్రజలు ఆచరించే హిందూ జీవన విదానంలో భాగమైన క్రతువులలో పాలుపంచుకోవడం , వాటిలో కొన్నింటిని అధికారికంగా జరపడం రాజ్యాధి నేతలకు తప్పని సరి . అందులో బాగంగానే రెండు తెలుగు రాష్ట్రాలలోని ముఖ్యమంత్రులు గోదావరి పుష్కారాలను , తాము ప్రధమ స్థానం చేసి ప్రారంభించారు అని అనుకోవచ్చు. వారు అంత వరకే పరిమితమై , తతిమ్మా మతపరమైన కార్యక్రమాలు సంబందిత మతాచార్యులులకు , పీటాధిపతులకు ,ఇతర సంస్తలకు వదిలివేసి , భక్తుల సౌకర్యాల పర్యవేక్షణ , రక్షణ విదుల ను సమర్దవంతంగా మానిటరింగ్ చేసి ఉంటె రాజమండ్రి విషాదాంత ఉదంతాలు జరిగి ఉండెడి కాదేమో. అలాగే భక్తుల చావుకు చంద్రబాబు ని పర్సనల్ గా బాద్యులను చేయాలన్న ప్రతిపక్షాల వాదానికి బలం చేకూరేది కాదు.  

    రాజమండ్రిలో కొన్ని  రోజుల క్రితం ప్రారంభమైన గోదావరి నిత్య హారతి మొదలు నేటి వరకు ప్రతి మతపరమైన కార్యక్రమాల్లో ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గారు పాల్గొంటు ఉండటం , భక్తుల సౌకర్యాలు చూడవలసిన అధికార యంత్రాంగం , అయన మెప్పు కోసం  అయన చుట్టే తిరుగుతూ ఉండటం , దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కి తన పుష్కర కర్తవ్యం ఏమిటో తెలియక అమాయకంగా చూస్తుంది పోవడం వలన , ఘాట్ ల పర్యవేక్షణ విషయం లో సరి అయిన ప్లానింగ్ అనేది కొరవడి ఉంటుంది. అందుకే భక్తులు లో ఎక్కువ మంది ఇతర ఘాట్ లను వదలి "పుష్కర ఘాట్ " వైపే మొగ్గు చూపడం, ముక్యమంత్రి గారు కూడా తమ ప్రధమ స్నానం కి అదే ఘాట్ ఎంచుకోవడం, అయన గారి కార్యక్రమం అయ్యే దాక , పోలిసులు భక్తులను కట్టడి చేసి , అయన వెళ్ళాక ఒక్క సారిగా 
భక్తులను ఇరుకు ద్వారాల ద్వారా వదలడం, తొక్కిసలాట జరిగి జరుగ రాని ఘోరం జరిగి , ఆ అప్రతిష్ట అంతా చంద్ర బాబు గారి మెడకు చుట్టుకోవడం జరిగింది. ఇదంతా ఎందుకయ్యా అంటే పైన చెప్పిన పరవస్తు గారి కద లోని నీతిని పాటించనందు వలననే. 

 నాకు తెలిసి భగవత్ సేవ కంటె భక్తులకు చేసే సేవ చాలా గొప్పది మరియు  పలవంతమైనది. ఈ కారణం చేతనే  మానవ సేవే మాధవ సేవ అనేది మన ధర్మం అయింది. గోదావారి పుష్కర బక్తులకు చేసే ప్రతి సేవ ప్రత్యక్షంగా ఆ గోదావరి మాత కే చెందుతుంది. కాబట్టి పూజలు , పునస్కారాలు లాంటి మత సేవలను సంబందిత మత సంస్తలకు వదిలి పెట్టి , భక్తులకు చేయాల్సిన ఇతర సేవలను ప్రభుత్వ సంస్తలు , వాటిని అజమాయిషీ చేసే నాయకులు అధికారులు చూసుకుంటే వారికి ఎవ్వరికీ దక్కని పుణ్యం దక్కుతుంది అనటం లో ఎటువంటి సందేహం అక్కర లేదు. 
      

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన