ఆడపిల్లల పేర్లకి అక్షరాలు కలిపితే అత్యాచారాలు అగుతా యంటున్న "వండర్ర్ ర్ ర్ ర్ బ్రహ్మశ్రీ శ్రీ శ్రీ శ్రీ " . !!!


                                                                     

                                 

                          పైన పొటోలో ఉన్న ఆయన పేరు ఏదైనా సరే గాని, దానికి ముందు ఒక బ్రహ్మశ్రీ ఉంది. అది బహూశా బిరుదో లేక డిగ్రీ యో తెలియదు. అయన గారు సంఖ్యా జ్యోతిష్య శాస్త్రం లో పండితులు కాబోలు  T .V. లలో  ఆ శాస్త్రం గురించి ఒక స్పెషల్ షో నిర్వహిస్తూ ఉంటారు. నేను సాదారణంగా ఈ అప్రాయోజిత కార్యక్రమాలు చూడను. కాని  ఈ  రోజు T.V. చానల్స్ మారుస్తుండగా , అనుకోకుండా ఈయన గారు చెప్పే మాటలు కొంత ఆసక్తి కలిగించబట్టి, ఒక 5 నిమిషాలు ఈయన గారి ప్రోగ్రాం ని చూసాను. అయన చెప్పే దానిని వింటుంటె నాకు బోల్డంత ఆశ్చర్యం వేసింది. దేశం లో ఆడపిల్లలు మీద అత్యాచారాల రేటు పెరిగిపోయిందని అందోళన చెందే వారికి , వాటి నివారణకు ఈయన గారు చేపుతున్నపరిహారం వింటే "ఇంత సింపుల్ గా అత్యాచారాలను అరికట్ట వచ్చా " అని తెగ సంబ్రమశ్చ్ర్యాలకు గురి కాక తప్పదు. ఇంతకీ అయన, అత్యాచారాల నివారణకు  చెప్పిన తరుణోపాయం ఏమిటంటె

    సదరు బ్రహ్మశ్రీ   గారు ఒక పరిశోదన చేసారట. ఆ పరిశోదన ఎవరి మీద అంటె , ఈ  మద్య అత్యాచారాలకు గురి అయిన బాదిత  స్త్రీల  పేర్లు మీద . సదరు బాది త స్త్రీలను  ఒరిజినల్ పేర్లు కు బదులు, ముద్దు పేర్లు తో   పిలుస్తూ ఉండటం, అలాగే వారి పేర్లలో అక్షరాలు వాటికి సంబందించిన సంఖ్య ల కూడిక తో వచ్చే సంఖ్య దోష పూరితంగా ఉండటం వలననే వారి మీద అత్యాచారాలు జరుగుతున్నాయి అట. సమాజంలో అందరి స్త్రీల  మీద కాక కొందరి స్త్రీల మీదే ఇలా  అత్యాచారాలు జరుగపోవటానికి , కేవలం  సంఖ్యా దోషమే తప్పా , మగాడి లోని 'మృగ బుద్ది ' కాని, స్త్రీల లోని ప్రవర్తనా దోషం కాదని తేల్చి చెప్పారు ఈ బ్రహ్మశ్రీ గారు. అలా తేల్చి చెప్పడమే కాకుండా , సదరు సంఖ్యా దోష నివారణా నిమిత్తం పరిహారం కూడా చెప్పాడు ఆయన. అయన చెప్పిన పరిహారం ఏమిటంటే , దోష పూరితమైన సంఖ్యలు ఏర్పడే పేర్లున్న ఆడపిల్లలు , తమ పేర్లను రెగ్యులర్ పద్దతిలో కాకుండ , బ్రహ్మశ్రీ గారు చెప్పినట్లు 21 సార్లు రాసి, ఇకనుండి అదే విదంగా తమపేరును రాస్తూ ఉంటె , వారి మీద అత్యాచారాలు జరిగే చాన్సే లేదట. అబ్బ ఎంత గొప్ప పరిహారం చూపించాడు ఈ  సంఖ్యా బ్రహ్మా గారు.

               ఉదాహరణకు మన దేశం లో నిర్భయ చట్టం రావడానికి కారకురాలైన వ్యక్తీ "నిర్భయ " అసలు పేరు జ్యోతి సింగ్ . ఆ అమ్మాయి మీద  కొంత మంది మ్రుగాల్లూ అతి పాశవికంగా  అత్యాచారం జరపడమే కాక, అమానవీయంగా గాయపరచి నడుస్తున్న బస్సులోనుంచి విసిరివేస్తే , ఆ గాయాలకు ఆమె మరణించింది. మన బ్రహ్మశ్రీ గారి సంఖ్యా సిద్దాంతం  ప్రకారం "జ్యోతి సింగ్ " అనే పేరుతొ ఏర్పడే సంఖ్య లో దోషం ఉండబట్టి ఆమె మీద అత్యాచారం జరిగింది. లేకుంటే ఆమె ఆ రోజు బాయి ప్రెండ్ తో కలస్ది సినిమాకు వెల్లీ ఉందేది కాదు, వెళ్ళినా మ్రుగాళ్ళు ప్రయాణం చేస్తున్న ఆ బస్సు ఎక్కి ఉండి కాదు, ఎక్కినా ఆమెను చూస్తే , ఆ మ్రుగాళ్ళకు చెడు బుడ్డి కలిగి ఉండెది కాదు, ఒక వేలా కలిగినా ఆమె బాయిప్రెండ్ వారిని హింది సినిమాలో హీరో లా ఒంటి చేత్తో వారిని విరగదీసి ఆమెను రక్షించి ఉండె వాడు అన్న మాట . పాపం  విషయం తెలియక జ్యోతి సింగ్ అన్యాయంగా బలి అయి పోయింది .

     ఒక వేళ తెలిసి ఉంటె బ్రహ్మశ్రీ గారి దగ్గరకు వచ్చి ఉందేది . అప్పుడు అయన గారు" జ్యోతి సింగ్" లోని స్పెలింగ్ ను మార్చి వేసి ఆమె గారిని కాపాడి ఉండె వారు . ఉదాహరణకు "JYOTI SINGH " అనే పేరు ను "JYYOOTTI SSINGGH" అని 21 సార్లు రాయించి ఆమెను అత్యాచారానికి గురికాకుండా చేసే వారు . చూసారా చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ జీవితాలను ఎలా నాశనం చేస్తుందో. కాబట్టి ఇక నైన ఆడపిల్లలు పై పోటో లో ఉన్న బ్రహ్మశ్రీ గారు చెప్పినట్లు స్పెల్లింగ్ కరెక్టు చేసుకుంటే మ్రుగాళ్ళు మీ జోలికి రారు.

   అసలు స్పెల్లింగ్ లు కరెక్టు చేస్తే సంఖ్యలు కుదురుకుని ,జీవితాలు చక్క గాఉంటాయి అనే ఈ సో కాల్డ్ సంఖ్యా శాస్త్రం ఎక్కడి నుండి ఉద్భవించిందో నాకు తెలియదు. సదరు బ్రహ్మశ్రీ గారు చెపుతున్న దాంట్లో నిజమెంతో కూడా అస్సలు తెలియదు. అయన చెపుతునట్లు రాసి , పేర్లను ఉచ్చరిస్తే అది "నత్తి నత్తి " గా పేరును పలికినట్లుంటుంది ఉంటుంది కాబట్టి అయన చెప్పేది "నత్తి శాస్త్రం " అవుతుంది కాని , సమగ్రమైన సంఖ్యా శాస్త్రం ఎలా అవుతుంది? . ఈ  సంఖ్యా శాస్త్రం గురించి నాకు తెలియదు కాబట్టి నో కాఅమెంట్. కాని అక్షరాలు కలిపితే అత్యాచారాలు అగుతాయని చెప్పడం ఎంత పనికిమాలిన మాటలు. వీటిని నిరూపించవలసిన బాద్యత బహిరంగ ప్రకటనలు చేస్తున్న సదరు బ్రహ్మశ్రీ గారి మీద ఉంది .లేకుంటే ఏదో ఒక నాడు కోర్టు కేసులో చిక్కుకోక తప్పదు .

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!