'గోవిందా' అని అనాల్సిన చోట "జై జగన్ " అన్నందుకే ఇన్ని అనర్దాలా !?

                                                                               


మనిషి అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ప్రపంచంలో  భగవంతున్ని విశ్వసించే వారు ఉండక పోవచ్చు . ఎన్నో సందర్బాలలో  చేతికందినట్టే అంది ,చివరి క్షణాలలో అవకాశాలు చేజారి పోతూ ఉంటాయి . దానినే మన పెద్దలు "చేతి కందిన ముద్ద  నోటి కందేదాక  గ్యారంటి లేదు " అని అంటుంటారు . అదిగో అటువంటి పరిస్తితులు ఎదురైనప్పుడే నాస్తికులు సైతం భగవంతున్ని నమ్మినట్లు చరిత్రలో ఉదాహరణలు కో కొల్లలు .

       గత 5 ఏండ్లుగా మన రాష్ట్రంలో జరుగుతున్నా కొన్ని పరిణామాలు చూస్తుంటే దివంగత ముఖ్య మంత్రి శ్రీ రాజ శేఖర్ రెడ్డి గారి కుటుంబానికి ఏదో దైవ శాపం తగిలినట్లే అనిపిస్తుంది . నాకు బాగా గుర్తున్న సంఘటన ఏమిటంటే , అసెంబ్లీలో ముఖ్య మంత్రిగా రాజ శేఖర్ రెడ్డి గారు , ప్రతి పక్ష నాయకుడిగా చంద్ర బాబుగారు , తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామీ దేవాలయంలో జరుగుతున్నా అవక తవకలు గూర్చి సీరియస్ గా చర్చిస్తున్న సందర్బంలో , రాజశేఖర్ రెడ్డి గారు కొంత హేళన గా ప్రవర్తించడం చూసి , అగ్రహోదగ్రులు అయిన చంద్ర బాబు గారు "వెంకటేశ్వర స్వామి విషయంలో  హేళన చేసిన వారు బాగుపడిన దాఖాలాలు లేవు అనే అర్ధం లో మాట్లాడారు . అ రోజు అదంతా రాజకీయంలో బాగంగా జరిగిన సంఘటన అని చాలా మంది అనుకోవచ్చు కాని , నిజానికి అ తర్వాతే రాజశేఖర్ రెడ్డి గారికి , వారి కుటుంభ సబ్యులు కు వరుసగా ఎన్నో అనర్దాలు సంబవిమ్చాయి .

     రెడ్డి గారు ప్రయాణించే హెలికాప్టర్ పావురాలు గుట్టకు  గుద్దుకోవడం , రాజశేఖర్ గారి తర్వాత వారి కుమారడు జగన్ ముఖ్య మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నా , అయన అ పదవి చేపట్ట లేక పోవడం , కేంద్ర ప్రభుత్వం పట్టించుకోక పోయినా , కోర్టులు కలుగ చేసుకుని ఆయనను అవినీతి ఆరోపణలు మిద 18 నెలలు జైలులో ఉంచడం లాంటి ఘటనల వెనుక మానవ ప్రమేయాలు కంటే దైవ శక్తి ప్రమేయమే ఎక్కువుగా ఉన్నట్లు అనిపిస్తుంది . చివరకు రాజ శేఖర్ రెడ్డి గారి కుటుంబ సబ్యులు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామీ పట్ల అపచారం కి ఒడి కట్టడం వలననే వారికి దక్కవలసిన పదవులు వారికి దక్కకుండా పోయాయా అని అనిపిస్తుంది .

   తిరుమల కొండ పరమ పవిత్ర క్షేత్రం . అక్కడ శ్రీ వేంకటేశ్వరుని గోవింద నామం తప్పా , మరే ఇతర స్వామీ పేరు ఉచ్చరించడానికి భక్తులు ఇష్ట పడరు . మరి అటువంటి క్షేత్ర సందర్సనం కి వెళ్ళినప్పుడు ఎంత నిర్మల మనస్సుతో అ దేవ దేవుణ్ణి స్మరించాలి . మంది మార్బలం ఉంది కదాని ,గోవింద నామం ఉచ్చరించ వలసిన చోట "జై జగన్ " అని నినాదాలు చేస్తే అ పాపం ఎవరికీ ? జిందాబాద్ లు కొట్టిన వారికా? వారిని వారిమ్చాకుండా ప్రోస్తాహిమ్చిన వారికా? యస్ ! అ పాపం వలననే జగన్ గారికి దైవానుగ్రహం దూరమైంది . అయన ప్రత్యర్ది అయిన చంద్ర బాబుగారు సెక్యులరిస్ట్ అయినప్పటికీ , ఆ స్వామీ ని నమ్మి వేడుకున్నందుకు , ఆయనకి శ్రీ కృష్ణుడు లాగా మోడీ గారు , ఆంజనేయ స్వామీ యొక్క కపి రాజు ధ్వజం లాగా పవన్ కళ్యాన్ గారు సహాయం అందించి గెలిపించారు అంటే అది దైవానుగ్రహం కాక మరేమిటి ?

     నిజానికి 3 నెలల క్రితం ఎన్నికలు జరిగి ఉంటె జగన్ గారిదే ముఖ్య మంత్రి పదవి . ఇప్పుడు అయినా తెలుగు దేశానికి, అయన పార్టికి తేడా 3% లోపు వోట్లు మాత్రమె . జండా పై కపి రాజులా విజ్రుభించి" పవనుడు " యువత ఓట్లను తెలుగు దేశం వైపు మళ్ళించాడు అంటే అందులో దైవ సంకల్పం తప్పా వేరేమి లేదు . ఇప్పటికైనా జగన్ యువకుడే కాబట్టి జరిగిన దానికి అ స్వామీ ని మన్నించమని వేడుకుని , తగిన విదంగా బవిశ్యత్ కార్యాచరణ  రూపొందిoచుకుంటే మంచిది . ముందు సమర్డులైన న్యాయవాడులను నియమిమ్చుకుని తను ఎ నేరం చేయలేదని , కోర్టులలో నిరూపిమ్చుకోవలసిన అవసరం ఉంది . అలాగే ప్రతి పక్ష నాయకుడిగా బాధ్యతతో వ్యవహరించి , ఈ 5 ఎండ్లూ ప్రజల మన్నల ను పొందితే , బవిశ్యత్ లో నైనా అయన కోరిక నేర వేరవచ్చు . వయసులో చిన్న వాడే కాబట్టి , ముందు ముందు ఎన్నో సేవలు ప్రజలకు అందించ వచ్చు . దిని కి కావాల్సింది ఓర్పు, అహంకార రహిత స్వబావం. అన్ని డబ్బులతో సమకూరుతాయి అనుకోవడం తప్పే అని ఇప్పటికైనా అర్దమైతే అదే ఆయనకు  దైవ రక్షా !

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )