దుమ్ము రేపిన ఖమ్మం "విద్యా గన్స్
తెలంగాణా ప్రాంతంలో విద్యా పరంగా ఖమ్మం కి ఒక ప్రత్యేకత ఉంది . హైదరాబాద్ ఆంద్ర ప్రదేస్ కి రాజదాని కాబట్టి ఇంటర్ కాలేజీలలో జరిగే పరిక్షలలో అక్కడి విద్యార్దులు సాదించే మార్కులు లేక ర్యాంకులు ప్రత్యేకంగా అ ప్రాంతం లోని విద్యార్డులవే అని చెప్పడానికి విలు ఉండదు . అలాగే విజయవాడ కూడా . కాని ఖమ్మం లాంటి నగరాలలో ఇంటర్ చదివే విద్యార్దులు ఎక్కువమంది అ జిల్లాకు చెందినా వారే అయ్యి ఉంటారు . అందుకే ఖమ్మం జిల్లాలో ఇంటర్ విద్యార్దులు ఎ ప్రతిభ కనపరచినా అది ఖచ్చితంగా జిల్లాకే సొంతం అని చెప్పవచ్చు .
నిన్న ఇంటర్ మీడియట్ బోర్డు ద్వితీయ సంవత్సర పరీక్షా పలితాలను తెలిపింది . అందులో MPC విభాగంలో టాప్ 10 లో 8 మందిఅంటే K. నిఖిల్ బాబు , కోటేరు ఆశ ,మిట్టకోలు రోషిత్ ,కొండపల్లి హేమంత్ ,తాళ్లూరి గీతాంజలి ,భువనగిరి పరిచయ ,కోలా లక్ష్మి సాయి మానస ,M .స్వాప్నిక ఖమ్మంజిల్లా వారే కావడం అ జిల్లాకే గర్వ కారణం . ఇందులో వరుసగా 1 నుండి 7 ర్యాంకులు ఖమ్మానివే . అలాగే Bi.P.C విభాగంలో కూడా 4,5 ర్యాంకులను ఖమ్మం విద్యార్దులు అయిన రిషబ్ అగర్వాల్ ,బోల్లపు భవ్య సాదించడం ముదావహం .అలాగే H.E.C లో ఖమ్మం జిల్లాకు చెందిన చంద్ర కాంత్ ఫస్ట్ ర్యాంక్ సాదించి రాష్ట్రం లో జిల్లాకు పేరు తెచ్చాడు . వారందరికీ" మనవు" తరపున హట్సాప్ !.
తెలంగాణా రాష్ట్రంలో ఖమ్మం ఒక గొప్ప విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది అని నాకెప్పటినుంచో ఒక నమ్మక్కం ఉంది . దానికి కారణంఖమ్మం , విజయవాడ ఇతర ప్రాంతాలలో చదివే విద్యార్దులలో ఖమ్మం జిల్లా వారు సాదిస్తున్నమార్కులు ప్రగతి . విజయవాడ లో సుమారు లక్షమంది విద్యార్దులు తెలంగాణా వారు ఉన్నారు . రేపు తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే ఖమ్మం ని ఒక గొప్ప విద్యా కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన బాద్యత అ జిల్లా నాయకులు , విద్యావేత్తల పై ఉంది . ఇంటర్ లో ఎంత గొప్ప ప్రతిభను ప్రదర్సిo చినా , , ఎంసెట్ లో అ స్తాయి ప్రతిభను కనపరచి ర్యాంకులు సాదిమ్చాలేకపోవడానికి ప్రదాన కారణం ఆ టెక్నిక్ లు బోదిo చగల లెక్చరర్లు లేక పోవడమే . సిమాo ద్రాలోని ప్రైవేట్ కళా శాల యాజమాన్యాలు ఇచ్చె వేతనాలు ఇవ్వగలిగితే , ఖమ్మంలో కూడా మంచి కోచింగ్ లు ఇప్పించి మొత్తం తెలుగు రాష్ట్రాలకే తల మానికంగా నిలువ వచ్చు . అప్పుడు తెలంగాణా ప్రాంత విద్యార్దులు సిమాంద్ర కు వెళ్ళాల్సిన అవసరం ఉండదు . ఆ దిశగా ఖమ్మం విద్యావేత్తలు , ఆలోచిస్తారని ఆశిద్దాం .
ఇంటర్ పరిక్షా పలితాలలో ఉత్తీర్ణులు అయిన విద్యార్దిని విద్యార్దులు అందరికి , ముక్యంగా ఈ సారి కూడా అత్యదిక ఉత్తిర్నత శాతం సాదించిన అమ్మాయిలకు మనవు తరపున శుభాభి నందనలు తెల్పుతున్నా
Comments
Post a Comment