సిమాంద్ర ప్రజలు K.C.R గారి పోటో ఇంట్లో పెట్టుకుని , రోజూ మొక్కే రోజు వస్తుoదా !

                                                                             

తెలంగాణా ప్రజలు కోరుకున్నట్లు గానే జూన్ 2 న తెలంగాణా రాష్ట్రం ఏర్పడుతుంది . తెలంగాణా ప్రజలు ముక్యంగా రాజకీయ , విద్యార్ధి , అడ్వకేట్ , ఉద్యోగ వర్గాలు వారు "సంబురాలు " చేసుకుంటారు . ఎలాగు మిగులు బడ్జెట్ ఉంటుంది కాబట్టి కొత్త ప్రబుత్వం అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు . కొత్తగా పెండ్లి చేసుకున్న వారు తోలి నెల  "హనీమూన్ " పేరుతొ జామ్ జామ్ గా జాలిగా గడిపినట్లు , తెలంగాణా తోలి ప్రబుత్వం కూడా "విక్టరి ఇయర్ "ని ఎంజాయ్ చేయవచ్చు . కాని తెలంగాణా కు ఏర్పడబోయే అసలు సమస్య కరెంట్ కష్టాలు . దీనికి పరిష్కారం గురించి K.C.R  గారు ఎక్కడా ప్రస్తావించటం లేదు . దానిని అదిగమించటానికి "గుజరాత్ తరహ సోలార్ ప్రాజెక్టు లను ప్రోత్సాహించడం అనివార్యం అయినప్పటికీ అ దిశగా ఆలోచిస్తున్నట్లు  కొత్త నాయకత్వం ఎక్కడా చెప్పటం లేదు . వారు ఇంకా ఉద్యమాల మూడ్ లో నుండి బయటకు వచ్చిన దాఖలాలు కనపడటం లేదు . పై వర్గాలు  తప్పా సామాన్య ప్రజలు సంబురాలు గురించి ఆలోచించటం లేదు . కనీసం యువతకు విద్యా , ఉపాధి, ఉద్యోగ రంగాలలో గతం కంటే మెరుగైన అవకాశాలు లభిస్తే తప్పా , వారు కోరుకున్న తెలంగాణా వచ్చినట్లు కాదని బావిస్తున్నారు . 

  అటు సిమాంద్ర విషయానికి వస్తే రాజకీయ నాయకులు తో సహా ప్రజలంతా చాలా హుషారుగా ఉన్నట్లు అనిపిస్తుంది . రాజధాని హైదరాబాద్ ను కోల్పోయి అన్యాయం అయిపోయామన్న బావన ప్రజలలో పట్టుదలను బాగా పెంచుతుంది . అద్దోక్కట్టి చాలు వారు రాబోయే 10 సంవత్సరాలులో హైదరాబాద్ ను తల దన్నెలా  సిమాంద్ర రాజధానిని తయారు చేసుకోవడానికి . దేశం లో వారు అన్యాయానికి గురి అయారు అనే సింపతి తో వారికి కేంద్రం వారు ప్రసాదించిన "ప్రత్యెక ప్రతి పత్తి " హోదా వారికి సువర్ణ అవకాశంగా మారనుంది . ప్రస్తుత B.J.P ప్రభుత్వం మరో 5 యేండ్ల పాటు అ హోదాని పొడిగించి తీరుతుంది కాబట్టి రాబోయే 10 ఏండ్లలో సిమాంద్ర సుసంపన్నం అవుతుంది . B.J.P  వారికి చంద్ర బాబు నాయుడు గారితో ఉన్న సానిహిత్యం , వెంకయ్య నాయుడు గారికి కేంద్ర ప్రబుత్వం లో ఉన్న పట్టు నిజంగా సిమాన్ద్రులకు గొప్ప వరంగా మారనున్నాయి .అందుకే వారిలో హుషారు బాగా కనిపిస్తుంది .

 మొత్తానికి తెలంగాణా నూతన రాష్ట్రం అయినా , నూతనోత్సాహాన్ని ఎంజాయి చేసేది మాత్రo సిమాన్ద్రులే . ఇప్పటికే సిమాంద్ర డెవలప్ మెంట్ పండ్ పేరుతొ ప్రజలు వద్ద నుండి విరాళాల స్వికరణకు అనేక సంస్తలు ముందుకు వచ్చి పని చేస్తున్నాయి . సిమాంద్ర ప్రజలలో తెలంగాణా రాజకీయ నాయకులు ముక్యంగా K.C.R గారి మిద ఉన్న కసి , కోపం , అసహ్యం వారిని మరింత పట్టుదలగా పనిచేసేలా చేసి వారు కోరుకున్న అభివృద్ధి సాదిం చేలా చేస్తుంది అని పిస్తుంది . అందుకే ఏనాటికైనా సిమాంద్ర ప్రజలు K.C.R  గారి పోటో ఇంట్లో పెట్టుకుని , రోజూ మొక్కే రోజు వస్తుంది  అని అంటుంది .

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

తిరుమల దేవస్థానం వివాదాన్ని, కమ్మ ,బ్రాహ్మణ సామాజిక వర్గాల మధ్య జరిగే వివాదంగా చూడటం ఎంతవరకు సమంజసం?

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

15యేండ్ల అమ్మాయి పొందు కోసం , పెళ్ళానికి విడాకులు ఇచ్చేస్తాను అన్న "పాస్టర్ "!.