వైద్యురాలి వివాహం "వన్ సైడ్ లవర్ " చేతిలో చావు కొచ్చింది !

                                                                               

అందమైన భారతావనిలో అందమైన వనితల  జీవితాలకు భద్రత లేకుండా పోయింది . వారి ఇష్టా ఇష్టాలతో పనిలేకుండా ప్రేమించి వేయడం , ఆ  ప్రేమలో ఉన్మాదిగా మారడం , తను ప్రేమించిన అమ్మాయి ఎవరినైనా వివాహమాడితే సహించ లేక వారిని పొట్టన పెట్టుకోవడం అనేది ఎంత దారుణమైన విషయం !ఈ పిచ్చి కుక్కల వలన అడబిడ్డలకు రక్షణ లేకపోతుంటే ఏమి చెయ్యాలి ? మనుషుల ప్రాణాలకు ముప్పు తెచ్చె వీది లో తిరుగాడే పిచ్చి కుక్కల్ని కాల్చి చంపినట్లే ఈ ఉన్మాదులను కాల్చి చంపితే తప్పా , అడ పిల్లలకు రక్షణ కలుగదా? అదే నిజమని అనిపిస్తుంది . మొన్న గురువారం భోపాల్ లో జరిగిన దారుణ ఉదంతం తెలియ చేస్తుంది . వివరాలు లోకి వెళితే ,
    మద్య ప్రదేశ్ లోని బొపాల్ కి చెందినా జయశ్రీ వృత్తి రిత్యా వైద్యురాలు . ఆమెకు డాక్టర్ రోహిత్ అనే వ్యక్తితో వివాహం జరిగింది . దాని సందర్భంగా భోపాల్ లోని ఒక ఫంక్షన్ హాలులో ఘనంగా  రిసెప్షన్ పార్టి ఏర్పాటు చేసారు . అందరూ ఆనందంగా పార్టి జరుపుకుంటున్న వేళ 'అనురాగ్' అనే వ్యక్తీ వచ్చి జయశ్రీ మిద పిస్టల్ తో కాల్పులు జారి పాడు . అ సంఘటన తో నిర్ఘాంత పోయిన అక్కడి అహ్వానితులు కొంత సేపు తర్వాత తేరుకుని అనురాగ్ ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు . అ తర్వాత జయశ్రీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించింది . ఈ సమాజానికి వైద్య సేవలు అందించాల్సిన ఒక లేడి డాక్టర్ ఒక ఉన్మాది వలన చంపబడింది .
 
          ఆమెను అలా దారుణంగా చంపడానికి అ ఉన్మాది చెపుతున్న కారణం  నిజం కాదు అని పోలిస్ వారి ప్రాదమిక విచారణలో తేలిందట . అతని వాంగ్మూలం ప్రకారం ఆతను జయశ్రీ ప్రేమికులు అని , ఆమె అతని ప్రేమను నిరాకరించి వేరొకరిని పెండ్లి చేసుకోవడం తో తట్టుకోలేక ఆమెను చంపాడు అట . అయితే జయశ్రీ అతనిని ప్రేమించినట్లు ఎక్కడా ఆదారాలు కనిపించక పోవటం వలన అతనిది వన్ సైడ్ లవ్ గా బావిస్తున్నారు పోలీసులు . ఇలా వన్ సైడ్ లవర్ లు కూడా ఉన్మాదులు గా మరి ఆడపిల్లలను చంపుతుంటే వారిని రక్షించుకోవడం ఎలాగా ? ఆడపిల్లలకి అందమే శాపమా ? భారత దేశంలో ఆడపిల్లలు బ్రతకాలంటే ప్రతి అడ పిల్లకు ఒక గన్ మేన్ ఉండాల్సిన రోజులు దాపురిస్తున్నాయా ? ఆడపిల్లలు మిద హత్యా , అత్యాచారాలు జరిగాక చేసే దర్యాప్తులు , దోషులకు మరణ శిక్షలు విదించే ప్రస్తుత రక్షణ వ్యవస్థ , స్త్రీలకు సంపూర్ణ రక్షణ ఇవ్వ లేదు .మ్రుగాల్లకు  ఆడపిల్లలను కన్నెత్తి చూడాలంటే వెన్నుల్లో వణుకు పుట్టించే రక్షణ వ్యవస్థ కావాలి . దాని కోసం అవసరమైతే వరంగల్ తరహ ఎన్కౌంటర్ లు చేసినా తప్పులేదు . ప్రేమ ఉన్మాదుల వలన స్త్రీలకు  ఎప్పటికైనా ప్రమాదమే ! వారిని ని సంస్కరించడం ఉన్మాదుల  సంబందిత కుటుంబ పెద్దల పని . లేదని వీదుల్లోకి వస్తే పిచ్చి కుక్కలను కాల్చినట్లే కాల్చి పారేయాలి . అప్పుడే అందరికి బయం కలిగి ఎవరి జాగర్తలు వారు తీసుకుంటారు .
    
       ఈ ఘోర ఉదంతo  గురించి మరింత సమాచారం కొరకు క్రింది వీడియోను చూడండి .

                      
                      

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం