అత్యుత్సాహ D.E.O ఆకస్మిక తనికీ కి వెళితే , రిటైర్డ్ టిచర్ కి షో కాస్ నోటిస్ వెళ్లిందట !
ప్రబుత్వ అధికారుల లీలలకు జార్ఖండ్ రాష్ట్రం ఏమి తక్కువ తినలేదు అనే సంఘటన ఒకటి ఇటివల జార్ఖండ్ రాష్ట్రంలోని దుమ్కా అనే జిల్లాలో జరిగిoది . దుమ్కా జిల్లా విద్యాశాఖాది గారికి తన ఏలుబడి నిర్వహణలో ఉన్న ఒక స్కూల్ ని ఆకస్మిక తనికీ చేయాలని అనిపించిందట . అంతే !ఎవ్వరికి చెప్పా పెట్టకుండా సదరు స్కూల్ తనిఖి కి వెళ్లారట ! అయితే అక్కడ పిల్లలే కాని స్కూల్ టీచర్లు కనిపించలేదట . దానితో అగ్గి మిద గుగ్గిలమైన D.E.O గారు స్కూల్ రిజిస్టర్ ని తెప్పించుకుని అందులో ఉన్న ఇద్దరు టిచర్ ల వేతనాలు కు కోత విదిమ్చడమే కాకుండా , వారిద్దరిని గైర్హాజరు కారణంగా ఎందుకు సస్పెండ్ చేయకూడదో తెలపాలని కోరుతూ షో కాస్ నోటిసులు వారిద్ద్దరి ఇళ్ళకు పంపించాడు అట ! అంతే కాకుండా వారిద్దరిపై విచారణ జరిపి రిపోర్ట్ సబ్మిట్ చేయాలని తన క్రింది అధికారికి హుకుం జారి చేసి వెళ్ళాడట .
అయితే సదరు షో కాజ్ నోటిసులు అందుకున్న ఇద్దరు టీచర్లు అవి చూసి నిర్ఘాంత పోయారట . కారణం వారు అ స్కూల్ ని వదిలి పెట్టి 8 సంవత్సరాలు అయిందట ! అందులో ఒకరు ఉన్నత విద్యార్హత మిద సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అయితే , రెండవ వారు అల్రడి రిటైర్ అయి పోయారట ! రిటైర్ అయి పోయిన తనకు గైర్హాజర్ నోటిస్ ఏమిటి అని అయన ఉన్నతాదికారులకు తెలియచెస్తె , D.E.O గారి అత్యుత్సాహం వెలుగులోకి వచ్చింది . దానిమీద ఉన్నతాది కారులు D.E.O గారికి షో కాజ్ నోటిసులు ఇవ్వడానికి సంకల్పించారు అట ! అదీ D.E.O అత్య్త్సాహపు ఆకస్మిక తనికీ కద ! నా ఉద్దేస్యం అయితే తనికీ లో D.E.O గారు 8 సంవత్సరాల క్రిందటి రిజిస్టర్ ని పొరపాటుగా గమనించకుండా 2014 రిజిస్టర్ గా బావించి చర్యలు తీసుకుని ఉంటారు . అలా అయన గారి లిల భారత దేశం మొత్తం తెలిసి పోయింది . షో కాజ్ వస్తే వచ్చింది కాని ఈ దెబ్బతో పాపులర్ D.E.O అయిపోయారు శ్రీ సతీష్ చంద్ర సింకు గారు .
Comments
Post a Comment