గణపతి పూజ నుండి ఘనపతి పూజ వరకు
ఓ బొజ్జ గణపయ్య! నీ బంటు నేనయ్యా! |
ఆ తర్వాత మా నాన్న గారు విఘ్నేశ్వర పూజా విదానం పుస్తకంలో చెప్పబడిన విదంగా పూజ నిర్వహిస్తు,పెద్దగా మంత్రాలు ,పద్యాలు చదువుతూ పూజ చేస్తూ ఉంటే మేము పిల్లలందరమ్,మా అమ్మ గారు భ క్తి బావంతో ఆలకించే వాళ్లం. పూజ చివర్లో శమంతక మణోపఖ్యానం కధ విన్న తర్వాత, అక్షతలు మా శిరసున వేసి మమ్ములను ఆశీర్వదించి,పూజ ముగించి తీర్థ ప్రసాదములు ఇచ్చేవారు. మేమందరం మాకు చదువులో బాగా మార్కులు రావాలని,బొజ్జ గణపయ్యకు భక్తితో నమస్కరించే వాళ్లమ్.ఆ తర్వాత తీర్థ ప్రసాదాలను మా పాళ్లేర్లకు, మా ఇంటికి వచ్చిన వారందర్కి పంచిపెట్టి ఆనందించే వాళ్లం. ఈ విదంగా గణపతి పూజ ని ఎంతో అనందంగా జరుపుకునే వాళ్లమ్. మా నాన్న గారి తదనంతరం నేను కూడ ఇంచు మించు ఇదే పద్దతి పాటిస్తు మా నాన్న గారి సాంప్రదాయాన్ని పాటిస్టున్నాము.మాకు తెల్సినంత వరకు ప్రతి తెలుగువారు ఈ విదంగానే చేస్తుండొచ్చు. స్వహస్త్తలతొ ప్రతిమని చేసి, స్వహస్త్తలతొ పత్రి సేకరణ చేసి,స్వయంగా గణ నాదుని పూజిస్తే కలిగే త్రుప్తి,ఆనందం మరువలేనిది.
కాని, ఈనాటి పూజా విదానం చూస్తుంటే కొంత బాధ వేస్తుంది.నిరాడంబరం స్తానంలో ఆడంబరం మొదలైంది. గణపతి కి బదులు ఘనపతి ని ప్రతిష్టించి పూజలు జరుపుతున్నారు. దీని కోసం బారీ క్రేన్లను ఉపయూగిస్టున్నారు.విగ్రహ తయారికి పర్యవర్నానికి హాని చేసే అనేక రంగుల్ని ఉపయూగిస్తున్నారు .ఒకరి మీద ఒకరు పోటీ తొ వీది వూరి కొక్కటి లేక కాలని కొక్క గణపతి బదులు అనే క మంది ఘనపతుల్ని పేట్టి అట్టహాసమ్ చేస్తున్నరు. చివరకు ఘననాదుని లడ్డూ సహితం క్రేన్ సహయంతోనే అయన చేతుల్లో పెడుతున్నారంటే ఆడంబరం ఏ స్తాయిలో ఉందో ఆలోచించండి.చివరకు ఈ ఘనపతుల్ని చెర్వులో నిమ్మజ్జనం చేస్తుంటె పర్యావరణ ప్రేమికులు వ్యతిరేకించడం చివరకు మన మతాచారాలే ప్రశ్నించబడడం ,విజ్నానుల ద్రుష్టిలో మనం అజ్ఞానులుగా మిగిలిపొవడం ఎంతవరకు సమంజసం చెప్పండి? దేనికైన ఒక పరిమితి ఉంటుంది.ఎక్కడ నిర్మలత్వం ఉంటుందో అక్కడ మాత్రమే భగవంతుడు ఉంటాడు.ఆడంబరమ్ మనకి దైవాన్ని దూరం చేస్తుంది. పత్రం,పుశ్పం,ఫలం,తోయం చాలు అన్నాడు భగవంతుడు.నమ్మని వాళ్లు ఎలాగు నమ్మరు. నమ్మే మనమైన అది పాటించాల్సిన అవసరం లేదా? మనం చేస్తుంది గణపతి పూజా? ఘనపతి పూజా? మీరే ఆలోచించండి.
మనవు బ్లాగు వీక్షకులకు , అగ్రిగ్రేటర్ లకు, స్నేహితులకు , శ్రేయోభిలాషులకు అందర్కి వినాయక చవితి శుభాకాంక్షలతో ...
"మనవు "
చాల చక్కగా చెప్పారు
ReplyDeleteచాల చక్కగా చెప్పారు
ReplyDeleteధన్యవాదములు మనసుభాషణం గారు
ReplyDeleteమీకూ శుభాకాంక్షలు ...
ReplyDeleteధన్యవాదములు స్రుజన గారు
Deleteమీకు కూడా వినాయకచవితి శుభాకాంక్షలు
ReplyDeleteధన్యవాదములు చంద్రశేఖర్ గారు
Delete