జంటగా నేరం చేసిన ఆడదాన్ని ఏమనలేక ,మగాడిని కూడా వదిలేయమన్న సుప్రీం కోర్టు అప్ ఇండియా !
సెక్షన్ 497 కేసులో తప్పు లేక నేరం స్త్రి పురుషులు ఇరువురు చేసినప్పటికీ ,కేవలం పురుషుడికి మాత్రమె శిక్ష విదించే అవకాసం కల్పించడం ,స్త్రీని కనిసం ప్రేరేపణ చేసిన వ్యక్తిగా నైన సహా నిందితురాలిగా చేర్చకుండా పూర్తిగా వదిలి వేయడం వెనుకాల "కేవలం స్త్రి పురుషుడి యొక్క స్వంత ఆస్తి కాబట్టి, అట్టి ఆస్తికి సంబందించిన హక్కుకు బంగం కలిగింది కాబట్టే ,ఇది కేవలం పురుషుల మద్య అనుభవ హక్కుల సమస్య గా బావించి వెనుకటి చట్ట నిర్మాతలు,పురుష ఆదిక్య బావజాల ప్రబావం తో ఈ సెక్షన్ పెట్టారు " అని బావించటం పూర్తిగా తప్పు. అదే నిజమైతే తప్పు చేసిన మగవాడికి 5 యేండ్లు జైలు శిక్ష విడిస్తే ,అదే తప్పు చేసిన స్త్రీని ఇంకా కటినంగా శిక్షించమని చట్టం చేసి ఉండేవారు. దీనిలో స్త్రీల మిద కేసు పెట్టకపోవడానికి అ నాటి సమాజ పరిస్తితులే కారణం.
అ రోజుల్లో వివాహేతర సంబంధం పెట్టుకుంటే ,అలా పెట్టుకున్న స్త్రీని సమాజం హీనంగా చూసేది. జరిగిన తప్పు లో బాద్యత ఎవరిదైనా ,సమాజం మాత్రం ఆమెను మాత్రమె బాద్యురాలిగా చేసి ఆమెనే నానా రకాలుగా హింసించేది . ఇక్కడ సమాజం అంటే కేవలం పురుషులు మాత్రమె కాదు. స్త్రి పురుషులతో కూడుకున్నది అని అర్ధం చేసుకోవాలి. ఆఖరకు తప్పు చేసిన వాడి పెళ్ళాం కూడా రంకు చేసిన తన మొగుణ్ణి ఏమనలేక , తన లైంగిక హక్కులకు బంగం కలిగించిన స్త్రి మీదే తన కోపాన్ని వేల్లగ్రక్కేది. ఆమె కాదు ఆమె తరపు బందువులు కూడా ఇటువంటి కేసుల్లో తమ ప్రతాపాలను స్త్రి మీదే చూపించే వారూ. ఇటు అత్తింటి వారూ తమ కోపాన్ని ఆమె మిద ప్రదర్శించేవారు. యావత్ సమాజం ఆమెను చాల హీనంగా చూసేది. ఇది అయిదు ఏండ్ల జైలు శిక్ష కంటే ఎక్కువ . కాబట్టి అప్పటి చట్ట నిర్మాతలు ఇ కేసుల్లో తప్పు చేసి, వివాహ వ్యవస్తను అగౌరవ పరచడమే కాక అదేదో ఘనకార్యం చేసినట్లు సమాజం లో రొమ్ము విరుచుకుని తిరిగే అవకాసం మగవాడికి ఉంది కాబట్టి , వాడిని శిక్షించి వివాహ వ్యవస్థ ఔన్నత్యం కాపాడలనే మదాశయంతోనే 497 సెక్షన్ ని పెట్టారు తప్ప , అందులో స్త్రీలను మినహయించడం ,ఆమెకు సమాజం విదించే శిక్ష చాలు అని బావించటం వలెనే తప్పా ,ఆడవాళ్లు మగవాడి ఆస్తులు అనే భావం తో కాదు అని నా ఉద్ద్యేశ్యం.
ఈనాడు ఆ పరిస్థితులు ఉన్నాయా అంటే , చాలా వరకు లేవనే చెప్పాలి. స్త్రీకి అన్ని విషయాల్లో స్వాతంత్య్రం కావాలి అనే సమానత్వపు ఆలోచన ఆధునిక సమాజాలలో అభివృద్ధి చెందడం వలన, ఏదైనా నేరం జరిగినప్పుడు దానికి బాద్యులుగా ఉన్న స్త్రీ పురుషులను ఇరువురు ను సమానంగా శిక్షించాలని ఆధునిక శిక్షా స్మ్రుతి చెపుతుంది. ఆధునిక సమాజం కూడా అదే కోరుతుంది. కానీ నిన్న సుప్రీం కోర్టు వారు వెలువరించిన తీర్పు చూసాక , "నేరం చేసిన స్త్రీని ఏమనలేక ,పురుషున్ని కూడా వదిలేయండి " అని సెలవిచ్చినట్లుంది . పై పెచ్చు వివాహేతర సంబంధం కేవలం సామాజిక తప్పు మాత్రమే అని ,ఆ కారణంగా విడాకులు తీసుకోవొచ్చు తప్ప , ఎవరిని శిక్షించకూడదని చెప్పింది. ఇద్దరి కిష్టమైతే ఎమన్నా చేసుకోవచ్చు అనే లైంగిక విశృంఖలత్వ స్వేచ్ఛను వివాహితులు కు ప్రసాదిస్తే ,దాని పర్యవసానం ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించారా?
అసలు మన సమాజాల్లో వివాహానికి ప్రధాన కారణాల్లో సంతానాభివృద్ది కొరకు ,తద్వారా ఒక క్రమమైన కుటుంబ అభివృద్ధి కొరకు తగిన భాగస్వామిని ఎంచుకుని ,అతను లేక ఆమె తో మాత్రమే తాను లైంగిక అవసరాలు తీర్చుకుంటాననే ఒప్పందం ఆ వివాహ తంతు క్రియలో ఇమిడి ఉంటుంది. మరి అటువంటి మూల ఒప్పందాన్ని ఉల్లంఘించి , పెండ్లి చేసుకున్నా స్త్రీకి ఉండే లైంగిక స్వేచ్ఛ పోదు అని తీర్పు ఇవ్వడం ఎంతవరకు సమంజసం? ఆ స్వేచ్చని పెండ్లి తో పోగొట్టుకోమని ఎవరు అడిగారు? జీవితాంతం పెండ్లి పెటాకులు లేకుండా ఇష్టం వచ్చిన వారితో ఉంటాను అంటే కొట్టింది ఎవరు? ఒక వేళా మొగుడు తో తనకు సరి పోదు అనుకుంటే డిగ్నిఫైడ్ గా విడాకులు ఇచ్చి నచ్చినట్లు ఉండే అవకాశం ఉంది కదా ! అలా కాకుండా ఏంటో విశిష్టమైనది అని కొనియాడ బడుతున్న యావత్ భారతీయ వివాహ వ్యవస్థకే తూట్లు పొడిచేలా " లైంగిక స్వేచ్ఛ " విషయం లో పెండ్లి నాటి ప్రమాణాలను ఉల్లంఘిస్తే అది నేరం కాదు అని చెప్పడం ఎంత వరకు సమంజసం? ఒక ఒప్పందాన్ని ఉల్లంఘించి ఎవరికైనా నష్టం కలిగిస్తే దానికి మోసం అని పేరు పెట్టి సెక్షన్ 420 క్రింద 7 యేండ్లు జైలు శిక్ష విధించాలని చెపుతున్న శిక్షాస్మృతిని కలిగి ఉన్న ఐ దేశం లో , వ్యవ స్థకు మూలాధారమైన వివాహ వ్యవస్థనే మోసం చేసిన వారిని శిక్షించడానికి ఉద్దేశించిన సెక్షన్ 497 ఎలా పనికిరానిదైందో చెప్పాలి.
సెక్షన్ 497 లో కేవలం పురుషున్న మాత్రమే శిక్షించడం అసమానం అవుతుంది. దానికి చేయాల్సింది తప్పు చేసిన స్త్రీని కూడా పురుషిని తో పాటు సమానంగా లేక బాధ్యత మేర శిక్షించాలి. దానికి గాను నిందితురాలి భర్తకు ఏవిదంగా నైతే నిందితుడి మీద కేసు పెట్టె అధికారం ఉందొ ,అటువంటి అధికారమే నిందితుడి భార్యకు కల్పించాలి. అప్పుడే సమానత్వం అనే దానికి అర్ధం లభిస్తుంది. అంతే కానీ తప్పు ఇద్దరం చేస్తే నాకే ఎందుకు శిక్ష అని సహా నేరస్తుడు అడిగితె ,మరో నేరస్తుడిని ఏమనలేక "ని మీద కూడా కేసు లేదు పో" అంటే ఎలా ఉంటుంది? ఇదిగో అచ్చం సుప్రీం కోర్టు అప్ ఇండియా తీర్పులా ఇలా ఉంటుందన్నమాట!ఈ సందర్బంగా మొన్న హైదరాబాద్ లో పట్టా పగలు అందరు చూస్తుండగా జరిగిన ఘోర హత్యలకు మూలం వివాహేతర సంబంధం కారణమని. చట్ట ప్రకారం శిక్షించే వీలు ఉంటేనే ఇన్ని హత్యలు జరుగుతుంటే, ఇక అసలు విడాకులు తీసుకోవడం తప్పా చేసేదేమి లేడు అని మీరు చెపుతున్న పురుషాధిక్య సమాజం లోని బాధితులైన పురుషులు భావిస్తే ? ఇంకెన్ని ఘోరాలు జరుగుతాయో ?ఆలోచించండి మరి!
Comments
Post a Comment